E-Paper
Advertisement

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
Advertisement

Kanakavva Remuneration:నర్సపల్లె అంటూ ఫోక్ సాంగ్ తో బాగా ఫేమస్ అయిన కనకవ్వ పేరు ఇపుడు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా అటు ఈవెంట్స్ ,ఇటు బతుకమ్మ పాటలు మాత్రమే కాకుండా సినిమాలలో కనిపిస్తూ జానపద పాటలు పాడుతున్న కనకవ్వ అసలు పాటకి ఎంత తీసుకుంటుంది అంటూ ఆరాలు తీస్తున్నారు ఫోక్ లవర్స్.

ఆమె అసలు పేరు గొట్టె కనకవ్వ

Advertisement

కనకవ్వ విషయానికి వస్తే ఆమె అసలు పేరు గొట్టె కనకవ్వ. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం బొడిగెపల్లి ఆమె స్వంత గ్రామం. ఇక చినప్పటి నుండే గ్రామంలో వినిపించే జానపదాలు ఆమె జీవితంలో భాగం అయ్యాయి.అలా ఎవరి వద్దా శిక్షణ తీసుకోనప్పటికీ ఆమెకి జానపదాలు ఒక అలవాటుగా మారిపోయాయి.ముఖ్యంగా అంతా పొలం పనులకి పొతే కనకవ్వ పాడే జానపదాలే వాళ్ళందరికీ ఒక రిలీఫ్ అని చెప్పాలి.

ఫోక్ సాంగ్స్ పుణ్యమా అని

Advertisement

అయితే ఇపుడు ఫోక్ సాంగ్స్ పుణ్యమా అని క్రేజ్ ఇంతటి క్రేజ్ తెచ్చుకుంది కాని మొదట్లో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కనకవ్వ పెద్ద యుద్దమే చేసింది,కాలం అయినపుడు వ్యవసాయ పనులకి పోవడం ,లేకపోతె కూరగాయల మార్కెట్ కి పోయి కూరగాయలు అమ్మడం చేసేది.

అయితే సోషల్ మీడియా జమానా పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆమె లైఫ్ మారిపోయింది. ఒక రోజు అనుకోకుండా తన చెల్లితో కలిసి పాట పాడటం ,దానికి లోకల్ గా ఉండే కుర్రాళ్ళు రికార్డ్ చేసి టిక్ టాక్ చేయడం, ఆ తర్వాత అది మైక్ స్టూడియోకి వెళ్ళడం అక్కడి నుండి నెట్టింట వైరల్ అవ్వడంతో కనకవ్వ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.

పాడిన పాటలు 

ఇక ఆతర్వాత కనకవ్వ ఇక వెనకి తిరిగిచూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ముఖ్యంగా మంగ్లీ తో కలిసి చేసిన నర్సపల్లె అనే పాట కనకవ్వ జీవితాన్నే మార్చివేసింది. ఆ తర్వాత
”గెన్నె రామ గెన్నె రామ”,”మేడారం జాతర పాట”, ”సంక్రాంతి పాట”, ”గురుజవన్నె పావురాలు గూట్లేమో కూసున్నాయి గురియన్నె పాయిరాలు వంటి ఎన్నో పాటలు ఆమెకి మరింత పేరు ని తెచ్చి పెట్టాయి.

కనకవ్వ పారితోషికం విషయానికి వస్తే 

ఇక ప్రస్తుతం కనకవ్వ పారితోషికం విషయానికి వస్తే కనకవ్వ ఒక్కో పాటకి దాదాపు 50 వేల నుండి లక్ష మధ్యలో తీసుకుంటుందని, సినిమాకైతే 1 నుండి 2 లక్షల మధ్యలో తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి,మరి ఇందులో ఎంత నిజముందో కనకవ్వే బయట పెట్టాలి.

చూడాలి మరి తనదైన గాత్రంతో తెలంగాణా జానపదాన్ని మరింత ఎత్తుకు తీసికెళ్తున్న కనకవ్వ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

ALSO READ :జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

Tags

Related News

ఓడిపోయిన చోటే గెలిచి చూపించాను.. అసలైన విజయం అదే అంటున్న సాయి పల్లవి!

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Big Stories

Advertisement
×