E-Paper
Advertisement

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌కి మళ్లీ పిలిచినా వెళ్లను.. మిథిలేష్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Kissik Talks:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొని ప్రేక్షకులకు దగ్గరైన కంటెస్టెంట్లలో మిథిలేష్ రెడ్డి ఒకరు. హౌస్‌లో తనదైన ఆటతీరుతో పాటు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా కిసిక్ టాక్స్ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీనికి సంబందించిన ప్రోమో తాజాగా రిలీజ్ అవడంతో మిథిలేష్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్ హౌస్‌లో స్నేహాలు, గొడవలు, గ్రూపులు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అనేవి మనకి కనిపిస్తుంటాయి. అయితే బయట నుంచి చూసే ఆడియన్స్ కి అది భజనా లేక నిజమైన ఫ్రెండ్ షిప్ హ అన్నది అర్థం కాదు. ఇదిగో ఇదే విషయాన్ని మిథిలేష్‌ను అడగ్గా కామనర్స్ అందరూ రోహిత్‌కు మద్దతుగా ఉంటారని, వర్షిణి మరియు మిగతా వారు ముఖేష్‌కు సపోర్ట్ చేస్తుంటారని చెప్పుకొచ్చాడు.

Advertisement

త్రిగుణ్ గురించి మాట్లాడుతూ

ఇక త్రిగుణ్ గురించి మాట్లాడుతూ, ఆయనకు ఆయనే భజన చేసుకుంటాడు అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేశాడు.ఇక ఇదే ఇంటర్వ్యూలో కర్మ సిద్ధాంతంపై మీకు నమ్మకం ఉందా అని ప్రశ్నించగా, మిథిలేష్ తనకు కర్మపై బలమైన నమ్మకం ఉందని చెప్పారు. మనిషి ఈ జీవితంలో చేసే పనులకు తగిన ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారని గుర్తుచేశాడు. చేసిన పాపాలకు ఇక్కడే ఫలితం అనుభవించాల్సి వస్తుందనే తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు.

Advertisement

బిగ్‌బాస్‌నే నామినేట్ చేస్తారు

ఒకవేళ బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకచోట చేర్చి, బిగ్‌బాస్‌నే హౌస్‌లోకి పంపిస్తే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు నవ్వులు పూయించాడు . ముందుగా బిగ్‌బాస్‌నే నామినేట్ చేస్తారని, నీకు అన్ని రూల్స్ తెలుసు, ఎవరు గెలుస్తారో కూడా తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వే ముందు బయటకు వెళ్లి ఆడుకో అంటూ నామినేషన్ వేస్తారని సరదాగా చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా గత సీజన్‌లో సూట్‌కేస్ ఇచ్చి పంపించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈసారి నిన్నే నామినేట్ చేస్తున్నామని చెబుతారని సెటైర్ వేశాడు.

ఇక మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళ్తారా అనే ప్రశ్నకు కూడా మిథిలేష్ జవాబిస్తూ కొంతమంది బిగ్‌బాస్‌లో పాల్గొనడాన్ని ఒలింపిక్స్‌లో మెడల్ సాధించినంత గొప్ప విజయంగా భావిస్తారని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చినా  వెళ్లను

అయితే బిగ్‌బాస్ ద్వారా వచ్చే పేరు, గుర్తింపు ఎంతకాలం నిలుస్తాయనేది చెప్పలేమని ,గత సీజన్‌లో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా పేర్లు ఇప్పుడు చాలామందికి గుర్తుండకపోవచ్చని అన్నాడు
అంతేకాదు, మరోసారి బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చినా తాను వెళ్లనని మిథిలేష్ స్పష్టం చేశాడు.

ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోనే ఒక రేంజ్ లో వైరల్ అవుతుండగా ఆదివారం రాత్రి 8 గంటలకు BIG TVలో ప్రసారం కానున్న ‘Kissing Talks’ పూర్తి ఎపిసోడ్ ఇంకెలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి !

Tags

Related News

బ్రేకప్ గురించి బయటపెట్టిన మిథిలేష్.. ఆ అమ్మాయికి నో చెప్పేశాడా?

4 నెలల నుంచి దుష్ప్రచారం.. మొదటిసారి స్కామ్ ఆరోపణలపై స్పందించిన నందన!

ఆ అమ్మాయి ఎవరంటే .. ప్రేమ గురించి మనసు విప్పిన ఉప్పల్ బాలు!

నవదీప్ ఒక చిల్లరగాడు ..ఉప్పల్ బాలు షాకింగ్ కామెంట్స్

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన త్రిగుణ్!

ఫోక్ సింగర్ మధుప్రియ ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటి హరిత!

Big Stories

Advertisement
×