Naa Anvesh: నా అన్వేష్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు ప్రపంచయాత్రికుడిగా ఈయన వివిధ దేశాలు తిరుగుతూ ఎన్నో వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా మిలియన్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న అన్వేష్ ఇటీవల కాలంలో తరచూ రాజకీయంశాల గురించి సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తలో నిలుస్తున్నారు. ఇకపోతే ఈయన ఇటీవల బిగ్ బాస్ (Bigg Boss show)కార్యక్రమం గురించి కూడా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.
తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి, నాగార్జున (Nagarjuna)గురించి నా అన్వేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి . నాగార్జున గారు మీరు తయారు చేసిన ఉగ్రవాదులను చూడండి అంటూ ఈయన బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్నటువంటి పలువురు బుల్లితెర నటీనటులు, యాంకర్లు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించారో వారందరి గురించి కూడా ఈయన ప్రస్తావించారు. ఇందులో భాగంగానే ఒక మూవీ షూట్ చేస్తున్నట్టు ఆ మూవీకి “బీబీ కొంపలో బెట్టింగ్ మాఫియా” అనే టైటిల్ పెట్టి కంటెస్టెంట్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన క్లిప్స్ జోడించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన బుల్లితెర నటీనటులు అందరూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కావడంతో వీరందరిని ఉగ్రవాదులతో పోలుస్తూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇకపోతే గతంలో కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో అన్వేష్ చేసిన హడావుడి మామూలుగా లేదని చెప్పాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్ట విరుద్ధం. అయితే సెలబ్రిటీలు మాత్రం ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారట ఈయన గతంలో కూడా విమర్శలు చేశారు.
?stkn=MTB1NWxidTM4eTJlag%3D%3D
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వారందరి వివరాలను ఈయన బయట పెట్టడంతో అధికారులు సైతం ఈ వ్యవహారపై సీరియస్ అవుతూ కేసులు నమోదు చేశారు అలాగే పలువురు సెలబ్రిటీలను గతంలో విచారణకు కూడా పిలిచిన సంగతి తెలిసిందే. ఇలా బెట్టింగ్ యాడ్స్ కు వ్యతిరేకంగా నా అన్వేష్ గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఈయన బీబీ హౌస్ లో బెట్టింగ్ మాఫియా అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.
Also Read: ఏం తప్పు చేశాను.. రాబందులలా పొడుచుకు తింటున్నారు..రాజకుమారి ఎమోషనల్!