E-Paper
Advertisement

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో
Advertisement

PM Kisan 24th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24 వ విడత నిధుల విడుదల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈసారి కొందరు రైతులకు రూ. 4000 పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి తదుపరి విడత ఎప్పుడు? రూ. 4 వేలు ఎవరెవరికి పడనున్నాయి? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రైతులకు కీలక కబురు, నవరాత్రుల సమయంలో

దేశవ్యాప్తంగా రైతులు ప్రధాన‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన-పీఎం-కిసాన్ తదుపరి విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం 23వ విడత ఈ ఏడాది జూన్ 20న విడుదల చేసింది. 24వ విడత ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నిధులు విడుదల చేయనుంది కేంద్రం. అర్హులైన రైతులకు ప్రతి ఏటా వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 6,000 చొప్పున పంట పెట్టుబడి సాయం అందించే పథకం ఇది. మూడు విడతలకు ఒక్కోసారికి రూ. 2000 వారి ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ చేస్తోంది కేంద్రం. 24వ విడత నిధులను దుర్గా నవరాత్రులు పండగల సీజన్ అంటే అక్టోబర్ నెలలో రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని వెల్లడించాల్సివుంది. ఈ నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు పూర్తి చేయాలి.

పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు

Advertisement

పీఎం కిసాన్ యోజన కింద 24వ విడతకు అర్హత పొంది నమోదు చేసుకున్న రైతు కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పథకం అర్హత కలిగిన భూమి ఉన్న రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కొంతమంది ఈ పథకానికి అర్హులు కారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, కొన్ని నిర్దిష్ట ప్రమాణాల పరిధిలోకి వచ్చేవారు ఉన్నారు. అలాంటి రైతుల ఖాతాలకు నిధులు జమ చేయబడదు.

ALSO READ: దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

Advertisement

తొలుత రైతులు ఇ-కేవైసీ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఆధార్- బ్యాంకు ఖాతాకు లింకు అయి ఉండాలి. ఇతర సమాచారంలో ఏవైనా లోపాలు ఉంటే రూ. 2000 వాయిదా అందడానికి ఆటంకం కలగవచ్చు. రైతులు తమ బ్యాంకు ఖాతా చురుకుగా ఉందని, DBT కోసం సరిగ్గా అనుసంధానించబడిందని కూడా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే 23వ విడత నిధులు ఇ-కేవైసీ, భూమి ధ్రువీకరణ అసంపూర్తిగా ఉన్న రైతులకు జమ కాలేదు. అలాంటి రైతులు ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి, భూమి ధ్రువీకరణ పూర్తయితే 24వ విడతలో ఆగిపోయిన 23వ విడత బకాయితో 24వ విడత నిధులను జమ చేయనున్నట్లు సమాచారం. రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ కావచ్చు.

Related News

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..

ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుంది? ఈ రూల్స్ తెలుసుకోండి

ఓల్డ్ మాంక్ రమ్ అసలు రమ్మే కాదు.. ఇంతకాలం మందుబాబులను కంపెనీ మోసం చేసిందా?

Big Stories

Advertisement
×