E-Paper
Advertisement

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!
Advertisement

Nalgonda Gaddar:తెలంగాణలో బతుకమ్మ పాటలకి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలని గుర్తుచేసే ఈ బతుకమ్మ పాటలు అలా రిలీజ్ కాగానే ఇలా మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి కూడా. ఇక ఈ క్రమంలోనే నల్గొండ గద్దర్ ఆలియాస్ నరసన్న వదిలిన రమణిలో బతుకమ్మ పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఏకంగా వన్ మిలియన్ వ్యూస్

Advertisement

ఈ పాట కేవలం ఆరు రోజుల్లోనే ఏకంగా వన్ మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టడంతో ఈ ఏడు వచ్చిన బతుకమ్మ పాటల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫోక్ లవర్స్.ఇక ఈ పాట విషయానికి వస్తే బుత్తం రమేష్ రాసినఈ పాటని నల్గొండ గద్దర్ అలియాస్ నరసన్న బుత్తం రమేష్ ఉషక్క కలిసి పాడగా, ఈ పాటకి కళ్యాణ్ కీస్ సంగీతం అందించడం విశేషం.
ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా బతుకమ్మ పాటల కి కళ్యాణ్ కీసే సంగీతం అందించడం ఇక్కడ మరో విశేషం .ఇక ఈ పాటకి శేఖర్ సాగర్ సినిమాటోగ్రఫీ చేయగా అమర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

గ్రామ గ్రామాన మారు మ్రోగిపోతుంది

Advertisement

పాట విషయానికి వస్తే తెలంగాణ యాసలో సాగే ఈ పాట ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా జానపద సంగీతాన్ని ఇష్టపడే వారికి ఇలాంటి పాటలు వినడం ఒక మంచి అనుభూతని చెప్పక్కర్లేదు.
ముఖ్యంగా ఈ లిరిక్స్ లోని పల్లె పదాలు, పండుగని గుర్తుచేసే విధానం వంటివి ఆడియన్స్ ని బాగా కట్టుకున్నాయి .మొత్తంగా నల్గొండ గద్దర్ ఆలియాస్ నరసన్న నుండి వచ్చిన ఈ రమణిలో బతుకమ్మ పాట ఈ బతుకమ్మ సంబరాలలో ప్రతి గ్రామ గ్రామాన మారు మ్రోగిపోతుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

ఏది ఏమైనా ఒకప్పుడు మారుమూల గ్రామాలకే పరిమితమైన టాలెంట్ సోషల్ మీడియా జమానా పుణ్యాన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం విశేషం. ముఖ్యంగా యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ,రీల్స్ ఫేస్బుక్ వంటి ద్వారా జానపదాలు ఆడియన్స్ ని అలరిస్తున్నాయి.

పాటల విషయానికి వస్తే

ఇక నరసన్న పాడిన పాటల విషయానికి వస్తే ‘మూడు రంగుల జెండా మీద’,’భాయ్ నీకు బాధ ఎందుకు’,’పులిలాగా గాండ్రించి లేచినదే’,’మాట తప్పనోడు’,’జై కొట్టు కమలం జెండాకు’,’గద్దరన్న ముద్దాడిన బిడ్డ వెన్నెల అక్క’,’నిప్పును గుండెలో మోస్తున్నాడు రేవంత్ అన్న’,’పెద్దపులి మా రేవంతన్న’,’ఎగిలివరంగా’,’ఓ నా రామయ్య’ వంటి పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో చెప్పక్కర్లేదు. చూడాలి మరి ఆరు రోజుల్లోనే వన్ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన ఈ బతుకమ్మ పాట వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

ALSO READ :ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

Tags

Related News

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

ఏంటి.. సుధీర్ కి అప్పుడే పెళ్ళైపోయిందా.. వైరల్ అవుతున్న పిక్స్!

దక్షనే నా భార్య.. కన్నీళ్లు పెట్టుకున్న దేబ్జానీ!

Gundeninda Gudigantalu : ప్రభా టాలెంట్ కు ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. సూపర్ అంతే..

Big Stories

Advertisement
×