E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన రణవీర్ 

Nindu Noorella Saavasam Serial Today Episode April 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన రణవీర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆకాష్‌ను కిడ్నాప్‌ చేయడానికి హాస్పిటల్‌కు డాక్టర్‌ గెటప్‌లో వెళ్తాడు రణవీర్‌. అప్పుడే అమర్‌ కూడా ఏదో పని మీద హాస్పిటల్‌ నుంచి బయటకు వెళ్తుంటాడు. పక్క నుంచి అంతా గమనిస్తున్న మనోహరి షాక్‌ అవుతుంది. కోపంగా రణవీర్‌ను తిట్టుకుంటూ అబ్బా ఈ మట్టి బుర్రకు ఎంత చెప్పినా అర్థం కాదు. మాస్క్‌ పెట్టుకోకుండా లోపలికి వచ్చేశాడు అని టెన్షన్‌ పడుతుంది. వెంటనే రణవీర్‌ను పక్కకు లాగేస్తుంది. రణవీర్‌ ఏంటిది అని అడగ్గానే.. రణవీర్‌ తెలియనట్టు ఏమైంది మనోహరి అని అడుగుతాడు. అమరేంద్ర లోపలే ఉన్నాడు. అని చెప్తుంది.

దీంతో రణవీర్‌ ఇందాకే వెళ్లిపోయాడు అని చెప్పావు కదా అనగానే.. ఎందుకో మళ్లీ వెనక్కి వచ్చినట్టు ఉన్నాడు. అయినా నిన్ను మాస్క్‌ పెట్టుకోమని చెప్పాను కదా అనగానే.. రణవీర్‌ మర్చిపోయాను ఇప్పుడైనా అమర్‌ వెళ్లిపోయాడా..? అని అడగ్గానే.. మనోహరి వెళ్లిపోయాడు. జాగ్రత్తగా ఉండమని నీకెన్నిసార్లు చెప్పినా ఇలా ఉంటావేంటి..? దయచేసి ఈ ప్లాన్‌ను చెడగొట్టకు అని చెప్పగానే.. ఓకే నువ్వు వెళ్లి భాగీని డైవర్ట్‌ చేయ్‌.. నేను టక్కున ఆ పిల్లాడిని ఎత్తుకెళ్లిపోతాను అని చెప్పగానే.. మనోహరి సరే నీకు మళ్లీ చెప్తున్నాను. ఎలాంటి పొరపాట్లు చేయకు నువ్వు దొరికిపోయి నన్ను ఇరికించకు అని చెప్పగానే.. రణవీర్‌ సరే అంటూ ఐసీయూ వైపు వెళ్తాడు.

Advertisement

ఐసీయూలో ఆకాష్‌ పక్కనే కూర్చుని మిస్సమ్మ బాధపడుతుంది. రేపు మార్నింగ్‌ నైన్‌కు ఒక ఇంజక్షన్‌ ఇస్తే నీ కోర్స్‌ పూర్తి అయిపోతుంది ఆకాష్‌. ఆ తర్వాత నీకు అంతా నార్మల్‌ అయిపోతుంది. మనం ఇంటికి వెళ్లిపోవచ్చు.. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఆడుకోవచ్చు.. ఎగ్జామ్స్‌ రాసుకోవచ్చు అని చెప్తుండగానే.. మనోహరి కాల్‌ చేస్తుంది. ఫోన్‌ చూసి మనోహరి కాల్ చేస్తుందేంటి..? చెప్పు మనోహరి అని అడగ్గానే.. హలో భాగీ ఇక్కడ రిసెప్సన్‌లో నర్స్‌ ఆకాష్‌ ప్రివియస్‌ రిపోర్ట్స్‌ అన్ని అడుగుతున్నారు అని చెప్పగానే.. మిస్సమ్మ అదేంటి మరి ఇందాక డాక్టర్‌ను అడిగితే అవసరం లేదు అన్నారు అనగానే.. ఇప్పుడేదో డౌటు వచ్చిందంట హిస్టరీ కావాలంటున్నారు. నువ్వు వచ్చి చెప్తావా..? అని మనోహరి చెప్పగానే.. మిస్సమ్మ ఆయన బయటకు వెళ్లిపోయారు. నేను ఆకాష్‌ దగ్గర ఉన్నాను. ఆ నర్సునే ఇక్కడికి రమ్మని చెప్పవా..? అనగానే..

మనోహరి ఇక్కడ సిస్టమ్‌లో ఎంట్రీ చేయాలంట భాగీ అందుకని నువ్వే ఇక్కడికి వచ్చి అన్ని చెప్పేసి వెళ్లిపో అనగానే.. మిస్సమ్మ సరే నేను వస్తున్నాను అంటూ కాల్‌ కట్‌ చేసి ఐసీయూలోంచి బయటకు వెళ్తుంది. మనోహరి వెనకే వచ్చిన రణవీర్‌ ఏమైంది మనోహరి అని అడగ్గానే.. మనోహరి వెళ్లు రణవీర్‌ భాగీ వచ్చేస్తుంది. అది తిరిగి వచ్చేలోపు ఆకాష్‌ను తీసుకుని సైలెంట్‌గా వెళ్లిపో అని చెప్పగానే.. రణవీర్‌ అలాగే అంటూ వెళ్లిపోతాడు. ఐసీయూలోంచి బయటకు వచ్చిన మిస్సమ్మ రణవీరకు డాష్‌ ఇస్తుంది. రణవీర్‌ చేతిలో ఉన్న ఫైల్స్‌ కింద పడిపోతాయి. మిస్సమ్మ ఐయామ్‌ సారీ డాక్టర్‌ చూసుకోలేదు అంటూ ఫైల్స్‌ తీసి ఇస్తూ.. అనుమానంగా మీరు కొత్తగా వచ్చారా డాక్టర్‌ మార్నింగ్‌ నుంచి మిమ్మల్ని ఇక్కడ చూడలేదు అంటుంది. రణవీర్‌ అవును అంటాడు. సరే అంటూ మిస్సమ్మ రిసెప్షన్‌ దగ్గరకు వెళ్తుంది. రిసెప్షనిస్టును ఆకాష్‌ ప్రివియస్‌ హిస్టరీ అడిగారంట అని అడగ్గానే..

Advertisement

రిసెప్షనిస్టు లేదు మేడం మీకు ఎవరు చెప్పారు అని అడగ్గానే.. ఇక్కడ ఉన్న నర్స్‌ అడిగారట అని మిస్సమ్మ చెప్పగానే.. ఇక్కడ ఈవెనింగ్‌ నుంచి ఇక్కడ డ్యాటీలో నేనే ఉన్నాను. వేరే  నర్సులు ఎవరూ మెడికల్‌ హిస్టరీ గురించి అడగలేదు.. అని చెప్పగానే.. ఆ ష్యూరా..? అంటూ మిస్సమ్మ అడగ్గానే.. రిసెప్షనిస్ట్‌ ఎస్‌ మేడం అయినా ప్రవియస్‌ హిస్టరీ కావాలంటే పేషెంట్‌ దగ్గరకు వచ్చి తీసుకుంటాము కానీ ఇలా రిసెప్షన్‌ దగ్గరకు పిలవం అంటూ చెప్పగానే.. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. అమర్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. మనోహరి ఫోన్‌ చేసి చెప్పిన విషయం రణవీర్‌ డాష్‌ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని గట్టిగా ఆకాష్‌ అంటూ పిలుస్తూ ఐసీయూ వైపు పరుగెడుతుంది.

అప్పటికే ఐసీయూలోకి వెళ్లిన రణవీర్‌ ఆకాస్‌ను ఎత్తుకుని వెల్లబోతుంటే మిస్సమ్మ డోర్‌ ఓపెన్‌ చేసి ఆకాష్‌ అంటుంది. దీంతో రణవీర్‌ ఆకాష్‌ను పడుకోబెట్టి సెలైన్‌ బాటిల్‌ చెక్‌ చేస్తున్నట్టు నటిస్తాడు. లోపలికి వచ్చిన మిస్సమ్ ఏయ్‌ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ కత్తి తీసుకుని చూపిస్తూ .. మర్యాదగా బయటకు వెళ్లు లేదంటే దీనితో పొడిచేస్తాను అనగానే.. రణవీర్‌, మిస్సమ్మను కొట్టి ఆకాష్‌ను ఎత్తుకెళ్తేందుకు ప్రయత్నిస్తాడు. మిస్సమ్మ ప్రతిఘటిస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Big Stories

Advertisement
×