E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను నాన్న అంటూ పిలిచిన బుజ్జమ్మ    

Nindu Noorella Saavasam Serial Today Episode April 24th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను నాన్న అంటూ పిలిచిన బుజ్జమ్మ    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ సీరియస్‌గా ఆలోచిస్తూ కూర్చుని ఉండగా బుజ్జమ్మ వాటర్‌ తీసుకెళ్లి సార్‌ వాటర్‌ తాగండి అంటూ ఇస్తుంది. అప్పుడే బయటి నుంచి వస్తున్న మిస్సమ్మ, రాథోడ్‌ గుమ్మంలోనే  నిలబడి చూస్తుంటారు. వాటర్‌ తాగిన అమర్‌ థాంక్యూ బుజ్జమ్మ అని చెప్పగానే.. బుజ్జమ్మ ఏమైంది సార్‌ ఎందుకు డల్లుగా ఉన్నారు…? ఏదైనా ప్రాబ్లమా సార్‌ అని అడుగుతుంది. దీంతో అమర్‌ ఏం లేదు.. నా మూడ్‌ కొంచెం బాగాలేదు అని చెప్పగానే.. బుజ్జమ్మ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్‌ చేశారు.. కోపం ఆరోగ్యానికి మంచిది కాదు సార్‌. మీరు సీరియస్‌గా ఉంటే అసలు బాగుండరు. మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు ఫ్లీజ్‌ కొంచెం నవ్వండి సార్‌.. అనగానే.. అమర్‌ అలాగే బుజ్జమ్మ అంటాడు.

బుజ్జమ్మ కొంచెం అంటే కొంచెమే నవ్వుతారా..? బాగా నవ్వండి అని చెప్పగానే.. బాగా అంటే ఎలా అంటూ అమర్‌ అడగ్గానే.. బుజ్జమ్మ నవ్వుతూ ఇలా నాలాగా నవ్వండి అని చెప్పగానే.. అమర్‌ నువ్వు కూడా కొంచెమే నవ్వుతున్నావు.? ఎలా నవ్వాలో నేను నేర్పిస్తాను అంటూ చకిలిగింతలు పెడుతుంటాడు. బుజ్జమ్మ నవ్వుతుంది. ఇక చాలు సార్‌ నేను నవ్వలేకపోతున్నాను.. ఇక ఆపండి సార్‌ నవ్వలేకపోతున్నాను.. కడుపునొప్పి వస్తుంది.. ఆపండి సార్‌.. అంటూ ఇక చాలు నాన్నా అంటుంది బుజ్జమ్మ దీంతో అమర్‌ షాక్‌ అవుతాడు.. వెంటనే బుజ్జమ్మ మనసులో నాన్నను నాన్న అనేశానేంటి… అని అనుకుంటుండగానే.. అమర్‌ కూడా ఏమన్నావు బుజ్జమ్మ నాన్న అన్నావు కదా..? చెప్పు బుజ్జమ్మ నన్ను నాన్న అన్నావు కదా..? అని అడగ్గానే.. బుజ్జమ్మ అన్నాను.. సార్‌ సారీ సార్‌ అంటుంది. దీంతో అమర్‌ సారీ ఎందుకు అమ్మ అని అడగ్గానే.. మిమ్మల్ని నాన్న అని పిలిచాను కదా..? అనగానే.. అందులో తప్పేం ఉంది అని అమర్‌ చెప్పగానే.. బుజ్జమ్మ హ్యాపీగా అంటే మిమ్మల్ని నేను నాన్న అని పిలవొచ్చా..? అని అడగ్గానే..

Advertisement

అమర్‌ కూడా హ్యాపీగా పిలవొచ్చు అని చెప్తాడు. దీంతో బుజ్జమ్మ నిజంగా పిలవొచ్చా..? అంటుంది. దీంతో అమర్‌ నేను చెప్పాను కదా బుజ్జమ్మ ఇది నీ ఇల్లు మేమంతా నీ వాళ్లం మమ్మల్ని నీ సొంతం అనుకో.. నాకు వాళ్లు ఎంతో నువ్వు కూడా అంతే.. అని చెప్పగానే.. బుజ్జమ్మ హ్మాపీగా అయితే ఇక నుంచి నేను మిమ్మల్ని రోజూ నాన్న అని పిలుస్తాను. అంటూ చెప్పగానే.. అమర్‌ బుజ్జమ్మను హగ్‌ చేసుకుంటాడు. బుజ్జమ్మ అమర్‌కు ముద్దిస్తుంది. అమర్‌ కూడా నువ్వు అలా పిలవడమే నాకు ఇష్టం అని చెప్తాడు. బుజ్జమ్మ థ్యాంక్యూ నాన్న అంటుంది. అమర్‌ ఇక నుంచి మీ నాన్న ఎవరు అని ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు బుజ్జమ్మ అని చెప్పగానే.. బుజ్జమ్మ థ్యాంక్యూ నాన్నా అంటుంది. అమర్‌ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్లిపోతాడు. అమర్‌ వెల్లాక అంత సేపు అక్కడే నిలబడి చూస్తున్న మిస్సమ్మ ఎమోషనల్ అవుతుంది. ముగ్గురు పిల్లలు బుజ్జమ్మను చక్కిలిగింతలు పెడుతూ నవ్వుతుంటారు.

రాథోడ్‌ మెల్లగా మిస్సమ్మ , బుజ్జమ్మకు నిజం చెప్పేశావా..? సార్‌ వాళ్ల నాన్న అని తెలిసిందా..? అని అడగ్గానే.. లేదు రాథోడ్‌ నేను చెప్పలేదు అని మిస్సమ్మ అనగానే.. మరి బుజ్జమ్మ సార్‌ను నాన్న అని ఎందుకు పిలిచింది అని అడగ్గానే.. బుజ్జమ్మ ఆయన రక్తమే కదా రాథోడ్‌ ఆ రక్త సంబంధమే పిలిపించిందేమో అంటుంది. దీంతో రాథోడ్‌ ఎమోషనల్ అవుతూ నిజమే మిస్సమ్మ  అంటుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×