E-Paper
Advertisement

టైమ్ లూప్ లో చిక్కుకునే పోలీసులు… మైండ్‌ను బ్లాస్ట్ సస్పెన్స్‌తో అబ్బురపరుస్తున్న మలయాళం మూవీ

టైమ్ లూప్ లో చిక్కుకునే పోలీసులు… మైండ్‌ను బ్లాస్ట్ సస్పెన్స్‌తో అబ్బురపరుస్తున్న మలయాళం మూవీ
Advertisement

Science fiction thriller OTT : ఓటీటీలో రీసెంట్ గా వచ్చిన ‘Sambhavam: Adhyayam Onnu’ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మలయాళం నుంచి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌తో మైండ్ బెండ్ చేస్తోంది. రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. హాలీవుడ్ లెవల్ ట్విస్టులతో, పాటలు గీటలు ఏమీ లేకుండా, సీటు అంచున కూర్చోబెట్టే సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతోంది. ఇది ఐయండిబిలో ఇది 7.2రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఒక దట్టమైన అడవిలో ముగ్గురు పోలీసులు, ఒక మనిషి కోసం వెతుకుతూ టైమ్ లూప్ లో చిక్కుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ మధ్య మెదడుకు ఇంతగా పని పెట్టిన సినిమా కూడా ఇదే.

జియో హాట్ స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్  

జితు సతీశన్ మంగళత్తు దర్శకత్వంలో ‘Sambhavam: Adhyayam Onnu’ 2026 మార్చి 6న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అసిమ్ జమాల్, సిద్ధార్థ్ భరతన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా డైరెక్టర్ జితు సతీశన్ మంగళత్తు మొదట ఇదే కథను యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింగా తీశారు. అది చూసి ఇంప్రెస్ అయిన ప్రొడ్యూసర్లు, దీన్ని పెద్ద సినిమాగా తీయమని ఛాన్స్ ఇచ్చారు. కేరళలోని పాలక్కాడ్ అడవుల్లోనే దాదాపు షూటింగ్ అంతా చేశారు. అడవిలో ఆ గగుర్పాటు కలిగించే సీన్స్ కోసం ఎక్కడా గ్రాఫిక్స్ వాడకుండా, నిజమైన లొకేషన్లలోనే షూట్ చేయడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమాకి ‘అధ్యాయం ఒకటి’ అని పేరు పెట్టడంతో దీనికి పార్ట్-2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. అది సినిమా క్లైమాక్స్ చూస్తే కూడా అర్థం అవుతుంది. ఇది 2026 ఏప్రిల్ 15 నుండి JioHotstar ఓటీటీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఓ దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ స్టోరీ సాగుతుంది. ఈ ఏరియా పోలీస్ స్టేషన్‌కు ఆనంద్ అనే కానిస్టేబుల్ బదిలీ అవుతాడు. ఒక సెల్యూట్ చేయలేని కారణంగా అతన్ని ఆ అడవి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఉండే ఒక కాకి దేవాలయం ఉన్న ప్రాంతంలోకి వెళ్తే ఎవరూ తిరిగి రారనే ప్రచారం జరుగుతుంటుంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు కూడా. అయితే అదే ప్రాంతానికి దగ్గరలో ఉండే ఈ పోలిసే స్టేషన్‌లో రెజీ, స్టీఫెన్ కూడా పని చేస్తుంటారు.

ఈ ముగ్గురు పోలీసోళ్లకు వాకి టాక్ లో ఒక వాయిస్ వినిపిస్తుంది. కాపాడమని అవతలి వ్యక్తి వేడుకోవడంతో వీళ్ళు ముగ్గురు ధైర్యం చేసి ఆ అడవిలోకి వెళ్తారు. కానీ ఎంతసేపు తిరిగినా అతను ఎక్కడా కనబడడు. అతను చెప్పిన చోటుకి వెళ్తే అక్కడ మనిషి అస్థిపంజిరం మాత్రమే కనబడుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి 1994లో వింటున్న పోలీసోళ్ళు 2026లో. ఈ ట్విస్ట్ కి చూసే ఆడియన్స్ కి కూడా దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడు అతన్ని వెతకడానికి వెళ్ళిన ఈ ముగ్గురికి ఆ అడవిలో వింత వింత శబ్దాలు, వింత మనుషులు కనిపిస్తుంటారు. ఏదో తేడా కొడుతుందని వీళ్లకు అర్థం అవుతుంది.

Advertisement

అడవిలో కొంతదూరం వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది. వీళ్లు ఎంత నడిచినా మళ్ళీ మళ్ళీ అదే చోటకి వస్తుంటారు. అక్కడ కాకి ఆకారం ఉన్న దేవాలయం దీనికి అంతా కారణం అని ఆనంద్ తెలుసుకుంటాడు. అయితే బయటకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా, ఒకే టైమ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఒకే సంఘటన వీళ్ళ కళ్లముందే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే, వీళ్లకు పిచ్చెక్కిపోతుంది. చనిపోయినోళ్లు మళ్ళీ బతకడం, బతికున్నోళ్లు మళ్ళీ చావడం.. ఇలా ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీ నడుస్తుంది. చివరికి కాలంతో ఆడుకునే ఆ అడవి రహస్యాన్ని వీళ్ళు ఎలా ఛేదించారు? ఆ టైమ్ లూప్ నుండి బయటపడ్డారా లేదా? అన్నది చాలా సస్పెన్స్‌గా సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా చూస్తుంటే బుర్ర హీటెక్కిపోతుంది, కానీ చివరి వరకు ఏమవుతుందో అని భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

Read Also : థియేటర్లలో చరిత్ర సృష్టించిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు… వీటిలో మీరెన్ని చూసారు ?

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×