E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి గురించి నిజం తెలుసుకున్న రణవీర్    

Nindu Noorella Saavasam Serial Today Episode April 28th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి గురించి నిజం తెలుసుకున్న రణవీర్    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మ పట్టుబట్టీ మరీ మిస్సమ్మ, అమర్‌లను బుల్లెట్‌ బైక్‌ మీద  స్కూల్ కు తీసుకెళ్లడం గురించి మనోహరి తన రూంలో ఆలోచిస్తూ ఇరిటేట్‌ అవుతుంది. తల్లే అనుకుంటే కూతురు ఇంకా మించిపోయింది. కూతురు గురించి భాగీ, అమర్‌కు చెప్పకుండా నాటకం ఆడుతుంటే.. తండ్రి ఎవరో తెలిసినా ఏమీ తెలియనట్టు కూతురు నాటకం ఆడుతుంది. ఈ తల్లీకూతుళ్లను తొందరగా ఇంట్లోంచి తరిమేయాలి. అప్పుడు కానీ అమర్‌ నా సొంతం అవ్వడు. అప్పుడే మనోహరికి రణవీర్‌ లాయరు కాల్‌ చేస్తుంటాడు.

కోపంగా ఈ లాయరు ఒకడు అస్తమానం నాకు కాల్ చేస్తుంటాడు. అనుకుంటూ కాల్‌ లిఫ్ట్‌ చేసి చెప్పు లాయరు అని అడగుతుంది. లాయరు స్టేషన్‌లో రణవీర్‌ ఎదురుగా నిలబడి స్పీకర్‌ ఆన్‌ చేసి ఫోన్‌ మాట్లాడుతూ… ఎక్కడున్నారు మేడం అని అడగ్గానే.. మనోహరి ఎక్కడ ఉంటాను నా ఇంట్లోనే ఉన్నాను అని చెప్పగానే.. లాయరు మీ ఇల్లా అంటే కోల్‌కతాలో ఉన్నారా..? అని అడగ్గానే.. మనోహరి కోపంగా ఏయ్‌ ఏంటి కామెడీ చేస్తున్నావా..? అమర్‌ ఇంట్లో ఉన్నాను అని చెప్పగానే.. లాయరు అది మీ ఇల్లు ఎలా అవుతుంది మేడం మీరు ఇంకా అమరేంద్ర గారిని పెళ్లి చేసుకోలేదు కదా అనగానే.. మనోహరి కోపంగా ఈ విషయం అడగడానికే ఫోన్‌ చేశావా..? అంటే లాయరు లేదు మేడం రణవీర్‌ సార్‌ గురించి అడగడానికి ఫోన్‌ చేశాను. అని చెప్పగానే.. మనోహరి అనుమానంగా రణవీర్‌ను అమర్‌ పోలీసులకు అప్పగించాడు కదా..? అనగానే.. ఇప్పుడు తను స్టేషన్‌ లోనే ఉన్నాడు. అని చెప్పగానే.. లాయరు తెలుసు మేడం సారుకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలి అని చెప్పగానే.. మనోహరి అది నా పని కాదు అనగానే.. రణవీర్‌ షాక్‌ అవుతాడు.

Advertisement

లాయరు మాత్రం అదేంటి మేడం సారు ఎంతైనా మీ ఎక్స్‌ హస్బెండ్‌ కదా..? మీ కోసం ఎంత చేశారు అనగానే.. మనోహరి కోపంగా నన్ను టార్చర్‌ పెట్టడం తప్ప నాకేం చేశాడు. చెప్పిన ఒక్క పని కూడా చేయలేదు అనగానే.. లాయరు మాత్రం త్వరగా బెయిల్‌ ఇప్పించి సార్‌ను బయటకు తీసుకురండి మేడం లేదంటే పెరోల్‌ రద్దు అయిపోతుంది. సార్‌ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అని చెప్పగానే.. మనోహరి బెయిల్‌ అంటే చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పటికే ఆ డాక్టర్‌కు చాలా డబ్బులు ఇచ్చాను అని చెప్పగానే.. లాయరు మీ గురించి సార్‌ చెప్పకుండా ఉండటం కోసమేగా డాక్టర్‌కు డబ్బులు ఇచ్చారు. అంటే మిమ్మల్ని కాపాడుకోవడం కోసమేగా అంటే రణవీర్‌ సార్‌ ను కాపాడ్డం కోసం కాదు కదా..? అనగానే.. మనోహరి కోపంగా ఇది నీకు అవసరం లేదు.. నువ్వు లా చదివావు కదా నువ్వే ఏదో రకంగా విడిపంచు.. అని చెప్పగానే.. లాయరు అంటే మీరు ఏమీ చేయరా..? మేడం అని అడగ్గానే.. మనోహరి ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు డబ్బు కూడా లేదు అని చెప్పగానే..

లాయరు అంతేనా మేడం అంటాడు. మనోహరి కోపంగా అంతే ఈ విషయం కోసం ఇంకోసారి మళ్లీ నాకు ఫోన్‌ చేయకు బై అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. రణవీర్‌ కోపంతో ఊగిపోతుంటాడు. లాయరు ఇదీ సార్‌ విషయం. ఆవిడ మీకు హ్యాండ్‌ ఇచ్చేసింది అని చెప్పగానే.. రణవీర్‌ కోపంగా దానికి కొంచెం కూడా విశ్వాసం లేదు. కొంచెం కూడా కృతజ్ఞత లేదు. దాని స్వార్థం అది చూసుకుంటుందే తప్పా నాకోసం ఏమీ చేయలేదు.. అని చెప్తుంటే.. అలాంటి మనిషిని మీరెలా పెళ్లి చేసుకున్నారు సార్‌ అని లాయరు అడగ్గానే.. అంతా నా బ్యాడ్‌ లక్‌ రోడ్డు మీద పోయేదాన్ని పెళ్లి చేసుకుని నేను రోడ్డు మీద పడ్డాను అని చెప్పగానే.   మరి ఇప్పుడు  ఏం చేద్దాం సార్‌ కోర్టు మీకు బెయిల్‌ ఇవ్వాలంటే పూచీకత్తుగా డబ్బులు కట్టాలి. మీ అకౌంట్స్‌ అన్ని సీజ్‌ అయ్యాయి. నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పగానే..

Advertisement

రణవీర్‌ కోపంగా చూస్తూ.. నేను బయటకు రావాలంటే ఇప్పుడు ఒకటే దారి ఉంది లాయరు. ఏ మనోహరి అయితే నాకు హ్యాండు ఇచ్చిందో అదే మనోహరి వచ్చి నన్ను విడిపిస్తుంది. నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను అంటాడు రణవీర్‌, లాయరు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×