E-Paper
Advertisement

విశాఖ వైపు ప్రపంచం చూపు.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన, సీఎం చంద్రబాబు డ్రీమ్‌కు తొలి అడుగు

విశాఖ వైపు ప్రపంచం చూపు.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన, సీఎం చంద్రబాబు డ్రీమ్‌కు తొలి అడుగు
Advertisement

Visakha Google Data Centre: ఏపీని ప్రపంచ పటంలో నిలపాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు రంగం సిద్ధమైంది. విశాఖ విశ్వ నగరంగా అడుగులు వేసింది.  ఆ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.  15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో గూగుల్‌ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు పునాది పడింది. ఇకపై గ్లోబల్ టెక్ మ్యాప్‌పై తనదైన ముద్ర వేయనుంది విశాఖ సిటీ. ఇప్పటికే పోర్టు-స్టీల్ తర్వాత డేటా సిటీగా అడుగులు వేయనుంది.

విశాఖ వైపు ప్రపంచం చూపు.. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన

Advertisement

విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఏపీలోపాటు విశాఖ భవిష్యత్తును మార్చనుంది ఈ ప్రాజెక్టు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు, కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం భూమిపూజ చేశారు.

దాదాపు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో మూడు చోట్ల డేటాసెంటర్లు ఏర్పాటు చేస్తోంది గూగుల్ సంస్థ.తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరంలో 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాలను కేటాయించింది చంద్రబాబు సర్కార్. మూడు డేటా సెంటర్లను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని పెట్టుకుంది ఆ సంస్థ.

Advertisement

సీఎం చంద్రబాబు డ్రీమ్‌కు తొలి అడుగు..  యువతకు ఉపాధి అవకాశాలు

దేశంలో ఐటీ రంగాన్ని కేరాఫ్‌గా మారిన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల సరసన విశాఖను నిలపనుంది గూగుల్‌ డేటా సెంటర్. సముద్ర తీరంలో వేసే సబ్‌ సీ కేబుళ్లతో వివిధ దేశాలతో విశాఖకు అనుసంధానం ఏర్పడనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆసియా ప్రాంతానికి గూగుల్‌ క్లౌడ్‌ ఏఐకి గేట్‌వేగా మారనుంది విశాఖ.

గూగుల్‌ డేటా సెంటర్‌ వల్ల దాదాపు లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఓ అంచనా. డేటా సెంటర్ వల్ల స్టార్టప్‌లు, పరిశోధనలు, డిజిటల్ సేవలకు భారీగా ఊపురానుంది. అంతేకాదు ఐటీ, ఏఐ, క్లౌడ్ సేవల రంగాల్లో అవకాశాలు రానున్నాయి. టెక్నాలజీ ఆధారిత మార్కెట్ పెరిగి యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

ALSO READ: రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: కమిషనర్ కన్నబాబు

గూగుల్ డేటా సెంటర్ వల్ల వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కంప్యూటింగ్‌ సేవలు అందనున్నాయి. మౌలిక వసతులతోపాటు డేటా స్టోరేజీ, వేగవంతమైన కమ్యూనికేషన్‌ సదుపాయాలు వంటివి ఏర్పాటు కానున్నాయి. అంతేకాదు విశాఖపై అంతర్జాతీయ ఐటీ సంస్థలు దృష్టి సారించనున్నాయి. డేటా సెంటర్ వల్ల దాని అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందనున్నాయి.

ముఖ్యంగా పవర్, కూలింగ్, నెట్‌వర్కింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశమున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, మంత్రి నారా లోకేష్, డిబివి స్వామి, గూగుల్ ఇండియా, అదాని, ఎయిర్టెల్ ప్రతినిధులు హాజరయ్యారు.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×