E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 18th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్న అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today August 18th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్న అమర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి రెడీ అయి ఉంటారు. ఇంతలో అమర్‌ వస్తాడు. పిల్లలకు గుడ్‌ మార్నింగ్ చెప్తాడు. ఆనంద్‌ను దగ్గరకు పిలుస్తాడు. గెలిస్తే అదొక ఎచీవ్‌మెంట్‌గా తీసుకుని స్కూల్‌కు  స్టూడెంట్స్‌కు నీ వల్ల ఎంత హెల్ప్‌ అవుతుందో అంత హెల్ప్‌ చేయాలి. ఓడిపోతే స్పోర్టీవ్‌గా తీసుకుని ఎందుకు ఓడిపోయావో అనాలసిస్‌ చేసుకుని నెక్ట్‌ టైం అది రిపీట్‌ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్తాడు. ఆనంద్‌ ఓకే డాడ్‌ అని చెప్తాడు. పక్కనే ఉన్న గుప్త అనుమానంగా ఎన్నడూ లేనిది ఇతగాడేంటి ఇంత ప్రేమగా పిల్లలతో సంభాషిస్తున్నాడు. ఒకవేళ ఆ బాలిక ఇతగాడిలో ప్రవేశించలేదు కదా..? అను అనుమానంగా చూస్తుంటాడు.

ఇంతలో అంజు ముందుకు వచ్చి డాడ్‌ అన్నయ్య పోటీలో ఓడిపోడు డాడ్. అమ్ము పోటీలో నిల్చోను అంటే నేను అన్నయ్యను నిలబెట్టాను. అన్నయ్య కోసం స్కూల్‌లో క్యాంపెయినింగ్‌ కూడా చేశాను.  ఎలాగైనా సరే అన్నయ్యన గెలిపిస్తాను డాడ్‌. అన్నయ్యను లీడర్‌ను చేస్తాను అని చెప్తుంటే గుప్త అనుమానంగా ఈ పిల్ల పిచ్చుక ఆ పిల్ల పిచ్చుకను నమ్మకంగా గెలిపిస్తానని చెప్పుచున్నదనిన..ఆ బాలిక కచ్చితంగా ఈ పిల్ల పిచ్చుకందే ప్రవేశించినట్టు ఉన్నది అని అనుమానంగా చూస్తుంటాడు. ఇంతలో అమర్‌ వెరీగుడ్‌ నీ యాక్టివిటీస్‌ అంతా బాగానే ఉన్నాయి. వాట్‌ అబౌట్‌ యువర్‌ స్టడీస్‌ అని అడుగుతాడు. దీంతో లేదు డాడ్‌ స్టడీష్లో డోకానే లేదు డాడ్‌ అని చెప్తుంది. ఈసారి బాగా చదివి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంటాను అంటూ అంజు చెప్పగానే.. గుప్త ఆ పిల్ల పిచ్చుక నందు కూడా లేదు అనుకుంటాడు. మిస్సమ్మ కలగజేసుకుని క్లాస్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వస్తే చాలు అనుకుంటున్నావా..? అంజు.. అని అడగ్గానే లేదు మిస్సమ్మ ఈ సారి ఎంతైనా కష్టపడి చదివి కచ్చితంగా స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంటాను అని చెప్పగానే రాథోడ్‌ వెటకారంగా తుమ్ముతాడు.

Advertisement

ఇంతలో ఆనంద్‌ నువ్వు ఓవరాక్షన్‌ చేయకే డాడీకి దొరికిపోతావు అంటాడు. అమ్ము, ఆకాష్‌ మీరు కూడా ఆనంద్‌కు సపోర్టుగా ఉండండి అని చెప్తాడు. రాథోడ్‌ కూడా అవును సార్‌ ఆనంద్‌ బాబుకు ముఖ్యంగా వాళ్ల సపోర్టే కావాలి అంటాడు. దీంతో ఎందుకు అలా చెప్తున్నావు రాథోడ్‌ అని అమర్‌ అడగ్గానే.. ఆంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా..? అందుకే అలా చెప్తున్నాడు… ఏవండి మీరు కూడా స్కూల్‌ కు వస్తే బాగుంటుందేమో అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో అమర్‌ నాకు ఆఫీసులో చిన్న వర్క్‌ ఉంది భాగీ కుదరదు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ అంటే మీరొస్తారని పిల్లలతో చెప్పాను అంటుంది. దీంతో ఒక పని చేయ్‌ భాగీ పిల్లలతో నువ్వు వెళ్లు..  సార్‌ మీరు వస్తే పిల్లలకు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటుంది. వీళ్లను స్కూల్‌ లో డ్రాప్‌ చేసి అటు నుంచి  అటే ఆఫీసుకు వెళ్దాం సార్‌ అని రాథోడ్‌ చెప్పగానే .. సరే పదండి పిల్లలు అంటూ అమర్‌ చెప్పగానే అందరూ స్కూల్‌కు బయలుదేరుతారు.

స్కూల్‌ కు వెళ్లిన తర్వాత  అందరూ లోపల ఉండగా మనోహరి బయటకు వచ్చి తన మనిషికి కాల్‌ చేస్తుంది. నేను చెప్పిన పని ఏమైంది అని అడగుతుంది. మీరు చెప్పినట్టే నేను షాపింగ్‌ మాల్‌లో మేనేజర్‌గా జాయిన్‌ అయ్యాను మేడం అని  చెప్తాడు. దీంతో గుడ్‌ నెల రోజుల్లోపు ఆ షాపు దివాలా తీయాలి వాళ్లు రోడ్డు మీద పడాలి. షాపింగ్‌ మాల్‌ నష్టాల్లో కూరుకుపోవాలి. కస్టమర్స్‌ ఎవ్వరూ మాల్‌ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. నెల తిరగిలోపు షాపులో ఈగలు దోమలు తప్పా షాప్‌లో కస్టమర్స్‌ ఎవ్వరూ కనబడకూడదు. నెల కాదు పది రోజుల్లో షాపును దివాలా తీయిస్తాను. వాళ్లను రోడ్డు మీద పడేస్తా..! అని చెప్తుండగానే.. వెనక నుంచి అమర్‌ వచ్చి మనోహరి అని పిలుస్తాడు. అమర్‌ సౌండ్‌కు మనోహరి షాక్‌ అవుతుంది. తిరిగి చూస్తుంది. వెనక అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌, పిల్లలు ఉంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Big Stories

Advertisement
×