BigTV English

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

OTT Movie : హారర్ జానర్ లో వచ్చే ఇండోనేషియన్ సినిమాలు వెన్నులో వణుకుపుట్టిస్తుంటాయి. చేతబడి లాంటి కంటెంట్ ను సరికొత్తగా చూపిస్తుంటారు. వీళ్ళు తీసే విధానం చూస్తే నిజంగానే దెయ్యాలు ఉన్నాయా! అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియన్ సినిమా డార్క్ విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఒక యువతి స్వర్గంలో చోటు సంపాదించాలనే కోరికతో పెళ్లి చేసుకుంటుంది. ఆతరువాత బ్లాక్ మ్యాజిక్ తో జరిగే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

ఫరా అనే యువతి ముస్లిం బోర్డింగ్ స్కూల్ విద్యార్థిని. స్వర్గంలో చోటు సంపాదించాలనే కోరికతో ఉంటుంది. తన ఉపాధ్యాయురాలు ఉమీ హరుమ్ సలహాతో, వహాబ్ అనే రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆమె విశ్వాసం ప్రకారం, భర్తకు విధేయత చూపడం స్వర్గానికి మార్గమని నమ్ముతుంది. పెళ్లి తర్వాత, వహాబ్ ఎన్నికల క్యాంపెయిన్‌లో బిజీగా ఉంటాడు. ఫరా అతని ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. అక్కడ ఆమెకు వింత అనుభవాలు మొదలవుతాయి. ఒక నల్లటి బట్టలు ధరించిన దెయ్యం ఆమెను వెంటాడుతుంది. విచిత్రమైన కలలు వస్తాయి. వహాబ్ క్యాంపెయిన్ సమయంలో, ఒక మహిళ ముక్కు నుంచి రక్తం కారడం, ఫరా కలలో చూసిన వ్యక్తి మరణించడం జరుగుతాయి. ఫరా ఈ సంఘటనలకు తానే కారణమని భయపడుతుంది. కానీ వహాబ్ ఆమెను ఓదార్చి, ఇవన్నీ ఊహలని చెబుతాడు.


మరోవైపు ఫరా ఇంట్లో ఎంబోక్ అనే పనిమనిషి ఆమె జుట్టు, గోళ్లను తీసుకొని, ఒక గదిలో చేతబడి చేస్తుందని ఫరా గుర్తిస్తుంది. ఆమె తన స్నేహితురాలు దీనాకి ఆ వీడియో పంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ వహాబ్ ఆమె ఫోన్‌ని ధ్వంసం చేస్తాడు. ఆమెను విధేయతగా ఉండమని హెచ్చరిస్తాడు. భర్త ఇలా వ్యవహరించే సరికి ఫరా షాక్ అవుతుంది. వహాబ్ ఎన్నికల్లో గెలవడానికి ఇబ్లిస్ (దెయ్యం)తో ఒప్పందం చేసుకున్నాడు. ఆమె జుట్టు, గోళ్లను ఉపయోగించి ఆమెను నియంత్రించి, ఆమెను ఇబ్లిస్‌కి బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. దీనా, ఉమీ హరుమ్ ఫరా ప్రవర్తనను అనుమానించి, ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఇంతలో వహాబ్ ఒక రిచ్యువల్ రూమ్‌లో ఫరాని బంధిస్తాడు. ఆమెపై ఎక్సార్సిజం కూడా చేస్తారు. ఇక స్టోరీ మరింత భయంకరంగా మారుతుంది. ఫరాని వహాబ్ సైతాన్ కి బలి ఇస్తాడా ? ఫరా చేతిలో వహాబ్ బలవుతాడా ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘వానిటా అహ్లీ నెరాకా’ (Wanita ahli neraka) అనేది ఒక ఇండోనేషియన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా. దీనికి ఫరీషాద్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫెబ్బీ రస్తాంటీ (ఫరా), ఓకా అంటారా (వహాబ్), అషిరా జమితా (దీనా), ఎల్మా థియానా (ఉమీ హరుమ్), ఆల్ఫీ ఆల్ఫాండీ (ఉస్తాద్ ఇర్ఫాన్), దేవీ పాకిస్ (ఎంబోక్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 నవంబర్ 14న ఇండోనేషియా థియేటర్‌లలో రిలీజ్ అయింది. 2025 మార్చిలో Netflixలో అందుబాటులోకి వచ్చింది. 95 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.0/10 రేటింగ్ ఉంది

Read Also : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Related News

OTT Movie : డైవింగ్ కు వెళ్లి దిక్కుమాలిన చావు… ఒళ్ళు జలదరించే సీన్స్ ఉన్న సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : అలాంటి అమ్మాయిలను చూసి సొల్లుకార్చే ఆటగాడు… చివరికి లడ్డూలాంటి పాపతో ఆ పని… క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కంటికి కన్పించని శక్తి కవ్వింపు… సింగిల్ గా ఉంటే వదలకుండా అదే పని… ఒక్కో సీన్ కు వణిపోవాల్సిందే మావా

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

Big Stories

×