OTT Movie : భూమికి వచ్చే విపత్తులతో ఎన్నో రకాల సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలు సస్పెన్స్‌తో చమటలు పట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ డెట్రాయిట్ అనే నగరంలో జరుగుతుంది. ఇక్కడ ఒక రాత్రి హఠాత్తుగా అందరూ అదృశ్యం అవుతారు. భూమిపై కొద్ది మంది మాత్రమే మిగులుతారు. మిగిలిన వాళ్ళు ఎలా మనుగడ సాగిస్తారు ? ఇలా ఎందుకు జరుగుతుందనేదే ఈ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
డెట్రాయిట్ నగరంలో ఒక రాత్రి భారీ బ్లాక్‌అవుట్ జరుగుతుంది. దాంతో దాదాపు అందరూ అదృశ్యమై, వాళ్ల బట్టలు, కార్లు, వస్తువులు మాత్రమే మిగులుతాయి. పాల్ ఒక సినిమా థియేటర్ ప్రొజెక్షనిస్ట్. అతను హెడ్‌లాంప్ ధరించి ఉండటం వల్ల ఈ ఘటన నుంచి బయటపడతాడు. కానీ అతని చుట్టూ అందరూ అదృశ్యమవుతారు. రోజ్మేరీ అనే హాస్పిటల్‌లో ఫిజికల్ థెరపిస్ట్, తన బేబీ మానీని వెతుకుతూ ఒంటరిగా మిగులుతుంది. లూక్ అనే టీవీ రిపోర్టర్, తన గర్ల్‌ఫ్రెండ్ బ్లాక్‌అవుట్ సమయంలో అదృశ్యమైన వీడియోని చూసి షాక్ అవుతాడు. 72 గంటల తర్వాత, ఈ ముగ్గురూ, 12 ఏళ్ల జేమ్స్ర్ అనే బాయ్‌తో కలిసి, 7త్ స్ట్రీట్‌లోని సనీస్ బార్‌లో ఆశ్రయం పొందుతారు. అక్కడ ఒక జనరేటర్ లైట్‌ని అందిస్తుంటుంది. జేమ్స్ తన తల్లి చర్చ్‌కి వెళ్లిందని, తిరిగి వస్తుందని అనుకుంటూ ఉంటాడు. వీళ్లు గమనించేది ఏమిటంటే, చీకటిలో ఉన్నవాళ్లను ఏదో శక్తి తీసుకెళ్తోంది. వెలుతురు ఉన్నవాళ్లు మాత్రమే సేఫ్ గా ఉంటారు.
పాల్, 16వ శతాబ్దంలో రోనోక్ కాలనీలో జనం మిస్సింగ్ మిస్టరీతో ఈ సంఘటనను లింక్ చేస్తాడు. చీకటిలో ఉన్న అదృశ్య శక్తి వాళ్లను మోసం చేయడానికి, సహాయం కోసం అరుపుల వంటి శబ్దాలను ఉపయోగిస్తుందని తెలుస్తుంది. జనరేటర్ ఫెయిల్ అవుతుండటంతో, లూక్ చికాగోకి వెళ్లాలని చెబుతాడు. రోజ్మేరీ తన బేబీని వెతకాలని, పాల్ హాస్పిటల్‌కి వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో లూక్, రోజ్మేరీ ఒక ట్రక్‌ని తీసుకొచ్చేందుకు బయటకు వెళతారు. కానీ వాళ్ల ఫ్లాష్‌లైట్స్ ఫెయిల్ అవుతాయి. రోజ్మేరీ ఒక బేబీ ఏడుపు శబ్దానికి ఆకర్షితురాలై, చీకట్లోకి వెళ్ళి అదృశ్యమవుతుంది. ఆతరువాత ఒక్కొక్కరికి వింత అనుభవాలు ఎదురవుతాయి. వీళ్లందరినీ ఆ చీకటి తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీళ్లంతా ఆ చీకటికి బలవుతారా ? ఆ అదృశ్య శక్తి ఎలా వచ్చింది ? భూమి మీద ఇంకా ఎవరైనా మిగిలి ఉంటారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ అపోకలిప్టిక్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘వానిషింగ్ ఆన్ 7త్ స్ట్రీట్’ (Vanishing on 7th street) ఒక అమెరికన్ అపోకలిప్టిక్ థ్రిల్లర్ సినిమా. బ్రాడ్ ఆండర్సన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో హేడెన్ క్రిస్టెన్సెన్ (లూక్, టీవీ రిపోర్టర్), థాండివే న్యూటన్ (రోజ్మేరీ, ఫిజికల్ థెరపిస్ట్), జాన్ లెగుజమో (పాల్, సినిమా ప్రొజెక్షనిస్ట్), జాకబ్ లాటిమోర్ (జేమ్స్, 12 ఏళ్ల బాయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2011 ఫిబ్రవరి 18న థియేటర్లలో రిలీజ్ అయింది. మే 17, నుంచి Fandango at Home, Tubi లలో స్ట్రీమింగ్ అవుతోంది. 92 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 4.9/10 రేటింగ్ ను పొందింది.
Read Also : ఓటీటీలోకి వచ్చేసిన 5000 కోట్ల సూపర్ హిట్ మూవీ… ఇంకా చూడలేదా ?