E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి కాలాను పంపిన చంభా   

Nindu Noorella Saavasam Serial Today August 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి కాలాను పంపిన చంభా   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటికి వచ్చిన చంభా గార్డెన్‌ లో ఆరు ఆత్మను చూసి నువ్వేన ఇక్కడ ఉన్నది అంటూ నిన్ను ఇక్కడి నుంచి తరిమేసేందుకే వచ్చాను అంటుంది. ఆరు నవ్వుతుంది. దీంతో చంభా తన శక్తిని చూడు అంటూ ఆరు మీదకు వదులుతుంది. ఆరు తన శక్తితో చంభా శక్తిని అడ్డుకుంటుంది. దీంతో చంభా షాక్ అవుతుంది. నా శక్తినే తట్టుకుని నాకే సవాల్‌ విసురుతున్నావా.? నిన్ను.. అంటూ కోపంగా మంత్రాలు చదువుతుంటే ఇంతలో బయటి నుంచి అమర్‌ వస్తాడు. రాథోడ్‌ కారు దిగి చంభాను చూసి దగ్గరకు వెళ్లి ఎవరమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. అసలు లోపలికి ఎలా వచ్చావు.. ఎందుకు వచ్చావు..? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి..? మాటలు రావా నీకు ముందు బయటకు వెళ్లు వెళ్లమంటున్నానా..? అంటుండగానే అమర్‌ దగ్గరకు వచ్చి డబ్బులు తీసి తీసుకుని వెళ్లు అని చెప్తాడు. చంభా డబ్బులు తీసుకోకుండా ఆరును కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఎవరో పిచ్చిదానిలా ఉంది సార్‌.. అంటూ లోపలికి వెళ్తూ ఆ వచ్చిన ఆవిడను చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది సార్‌.. అంజు పాపను కిడ్నాప్‌ చేయడానికి రణవీర్‌ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయోమో సార్‌. అందుకోసమే ఈ లేడీని పంపించాడేమో సార్‌ అంటూ రాథోడ్‌ చెప్పగానే.. కంగారు పడకు రాథోడ్‌ ఆవిడ వచ్చిన రూట్స్‌ ద్వారా ట్రేస్‌ చేయమని చెప్పు. ఇంటి సీసీటీవీ పుటేజీ కూడా చెక్‌ చేయ్‌ నిజం ఏంటో తెలుస్తుంది. అంటూ లోపలికి వెళ్లబోతూ ఆగి గార్డెన్‌లోకి ఎమోషనల్‌గా చూస్తాడు. ఏటి సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే ఆరు అంటూ రాథోడ్‌ ఆ వచ్చిన ఆవిడను చూస్తుంటే నాకెందుకో మాంత్రికురాలిలా అనిపిస్తుంది. ఆరు ఆత్మ ఇక్కడే ఉందని పంతులు గారు చెప్పారు కదా ఆరు ఆత్మ కోసం ఏమైనా వచ్చి ఉంటుందా..? అంటాడు అమర్‌.

Advertisement

అవును సార్‌ నిజమే తన గెటప్‌ చూస్తుంటే.. తను మాంత్రికురాలిలాగే ఉంది అంటాడు రాథోడ్‌. ఇదివరకు ఘోరా వచ్చినట్టు ఇప్పుడు తను వచ్చి ఉంటుంది. ఆరు నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా..? నీకేం కాలేదు కదా అని మనసులో అనుకుంటాడు. అంతా వింటున్న ఆరు మీరు ఉండగా నాకేం అవుతుందండి అనుకుంటూ ఎమోషనల్‌ అవుతుంది. మీ ప్రేమే అరుందతి మేడంకు శ్రీరామ రక్ష సార్‌ పదండి అంటాడు రాథోడ్‌. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లిపోతారు. ఈరోజు ఆ మాంత్రికురాలి నుంచి నిన్ను నీ పతిదేవుడే కాపాడినాడు. సమయమునకు అతగాడు రాకున్నచో ఆ దుష్ట మాంత్రికురాలి బారి నుంచి మేము కూడా నిన్ను రక్షించలేకపోయేవారము. నీ కుటుంబమే నీకు ఎప్పటికీ రక్షగా ఉండును అంటూ గుప్త హెచ్చరిస్తాడు.

మరోవైపు రణవీర్‌ ఇంటికి వెళ్లిన చంభా కోపంగా చూస్తూ ఆ ఆత్మకు శక్తులు ఉన్నాయి రణవీర్‌ అని చెప్తుంది. అదే మేము చెప్పింది అంటాడు రణవీర్‌. మీరు చెప్పిన దానికన్నా.. నేను ఊహించిన దాని కన్నా ఎక్కువ శక్తులు ఉన్నాయి రణవీర్ అని చెప్తుంది చంభా. అయితే నిన్ను ఆ ఆత్మను బంధించలేవా అని అడుగుతాడు రణవీర్. అవుతుంది దాని భర్త రాకపోయి ఉంటే ఇందాకే దాని కథ ముగిసిపోయి ఉండేది. ఆఖరి నిమిషంలో అతను వచ్చి అంతా చెడగొట్టాడు అంటుంది చంభా. దీంతో లాయరు నీ మీద నమ్మకంతో నిన్ను రణవీర్‌ ఇక్కడికి పిలిపించాడు కదా చంభా నువ్వే ఏదో ఒకటి చేయాలి అంటాడు. చేస్తాను అది నా అహాన్ని దెబ్బకొట్టింది. దెబ్బకు దెబ్బ తీస్తాను. రేపు కాలాని ఆ ఇంటికి పంపిస్తాను. ఆ పువ్వులు తీయిస్తాను అని చెప్తుంది.

Advertisement

దీంతో  ఆ రూంలోకి వెళ్లడం అంత ఈజీ కాదని మనోహరి చెప్పింది కదా..? ఎలాగోలా కాలాని రూంలోకి పంపించాలి అంటాడు రణవీర్‌. ఎలాగోలా కాలాని ఆ రూంలోకి పంపిచే ఏర్పాటు మనోహరి చేయమని చెప్పు.. మిగతా పని కాలా      పూర్తి చేస్తుంది అని చంభా చెప్పగానే.. మనోహరి సాయం లేకుండా పాము ఆ రూంలోకి వెళ్లలేదా..? అని లాయరు అడుగుతాడు. ఆత్మ శక్తి ఆ గది చుట్టూ రక్షణ కవచంలా ఉంటుంది. అది చేధించి కాలా లోపలికి వెళ్లాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరు సాయం చేయాలి అంటుంది చంభా. దీంతో రణవీర్‌ అలాగే నేను మనోహరితో చెప్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎలాగైనా సరే ఆ ఆత్మను బంధించు. ఆ తర్వాత నేను అంజలిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోతాను అంటాడు. అలాగే రణవీర్‌ ఇప్పటి వరకు నేను ఓడిపోయిందే లేదు అంటుంది చంభా.

తర్వాతి రోజు చంభా కాలాను పిలుస్తుంది. కాలా రాగానే నువ్వు వెళ్లి ఆరు గదిలో ఉన్న పూలను నీ విషంతో వాడిపోయేలా చేయ్‌ అని చెప్తుంది.చంభా చెప్పినట్టే కాలా అమర్‌ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో మనోహరి రెడీ ఉంటుంది. కాలా రూంలోకి వెళ్లేలా చేస్తుంది. కిటికీలోంచి అంతా గమనిస్తున్న ఆరు షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×