BigTV English

SSMB 29: హైప్ పెంచుతున్న గాసిప్స్.. వినడానికే ఇంత బాగుంటే.. మరి చూస్తే!

SSMB 29: హైప్ పెంచుతున్న గాసిప్స్.. వినడానికే ఇంత బాగుంటే.. మరి చూస్తే!

SSMB 29:ఒక పెద్ద స్టార్ హీరో సినిమా వస్తోందంటే చాలు.. ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక గాసిప్ బయట వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక్కొక్కసారి వినిపించే ఆ గాసిప్స్ వినడానికి చాలా బాగుంటాయి. అటు సినిమాపై అంచనాలు పెంచేస్తాయి. ఆ గాసిప్స్ ను కచ్చితంగా సినిమాలో చూడాలనే కోరిక ప్రేక్షకుడిలో కలిగేలా చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా చేస్తున్న చిత్రం ఎస్.ఎస్.ఎం.బీ 29. (SSMB 29). ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. అంతేకాదు అలా వచ్చిన వార్త అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటుందనడం లో సందేహం లేదు. అంతేకాదు సినిమాపై అంచనాలు కూడా పెంచుతోంది.


ఎస్ఎస్ఎంబి 29 నుంచీ క్రేజీ గాసిప్..

ఈ క్రమంలోని ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ గాసిప్ వింటుంటే అభిమానులే కాదు ఆడియన్స్ కూడా సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురుచూస్తున్నారు. మరి ఎస్ఎస్ఎంబి 29 నుంచి వినిపిస్తున్న ఆ కొత్త గాసిప్ ఏంటి అనే విషయానికి వస్తే.. “హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఒక లోయలో జరుగుతుందని, ముఖ్యంగా ఫారెస్ట్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. లోయ లోపల చేసే ఛేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉంటుందట. కచ్చితంగా ఈ సీక్వెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది అని, అందుకే ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతోంది” అంటూ ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఇక వింటుంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సీక్వెన్స్ తెరపై చూస్తే ఇంకెలా ఉంటుందో అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.


యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఎస్ఎస్ఎంబి 29..

ఇక సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా నటిస్తున్నారు. అంతేకాదు ఒక హాలీవుడ్ యాక్టర్ ను ఇందులో మెయిన్ విలన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం..

ఎస్ఎస్ఎంబి 29 కోసం ఇండియా చేరుకున్న ప్రియాంక చోప్రా. .

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా తన భర్త నిక్ జోనస్ తో కలిసి విదేశాలలోనే ఉన్న ఈమె.. తాజాగా ఎస్ఎస్ఎమ్బీ29 మూవీ కోసం ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకుంది. ఇక అందులో సోమవారం ఉదయం ఇండియాకి వచ్చినట్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. ముఖ్యంగా తన కూతురు మాల్టీతో కలిసి ఇండియాకి చేరుకున్నట్లు ప్రియాంక స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. ఇకపోతే మహేష్ – ప్రియాంక మధ్య ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఎస్ఎస్ఎంబి 29 నుంచి రోజుకొక గాసిప్ వినిపిస్తూ అంచనాలు పెంచేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో.. ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో? చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×