E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ తనతో చెప్పిన విషయాలు గుర్తు చేసిన రాథోడ్  

Nindu Noorella Saavasam Serial Today December 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ తనతో చెప్పిన విషయాలు గుర్తు చేసిన రాథోడ్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

  ఇంట్లో మిస్సమ్మ కనిపించడం లేదని అమర్‌ ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడా మిస్సమ్మ కనిపించదు. దీంతో అందరినీ పిలిచి మిస్సమ్మ ఎక్కడుందని అడుగుతాడు. దీంతో అందరూ కూడా తాము చూడలేదని చెప్తారు. దీంతో అమర్‌ కంగారు పడుతుంటే.. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. ఏంటి సార్‌ ఏమైంది కంగారుగా ఉన్నారు అని అడగ్గానే.. మిస్సమ్మ కనిపించడం లేదు రాథోడ్‌ అని చెప్తాడు. దీంతో రాథోడ్‌ అదేంటి ఏదైనా పని మీద స్టోర్‌కు వెళ్లిందేమో అంటాడు రాథోడ్‌ స్టోర్‌ వెళ్లాల్సి వస్తే యాదమ్మ ఉంది కదా రాథోడ్‌ అని చెప్పగానే.. సార్‌ మరి పాప ఎక్కడుంది అని అడగ్గానే.. పాప కూడా కనిపించడం లేదు రాథోడ్‌ అని అమర్‌ చెప్తుంటే.. మనోహరి హ్యాపీగా నవ్వుకుంటూ చంభా అది అర్దరాత్రి ఇల్లు వదిలేసి వెళ్లిపోయినట్టు ఉంది అని చెప్తుంది.

ఇంతలో రాథోడ్‌ తాను రాత్రి వెళ్తుంటే మిస్సమ్మ వచ్చి తనతో మాట్లాడింది గుర్తు చేసుకుంటాడు. రాత్రి రాథోడ్‌ వెళ్లిపోతుంటే.. మిస్సమ్మ బయటకు వచ్చి రాథోడ్‌ వెళ్తున్నావా అని అడుగుతుంది.  అవును వెళ్తున్నాను ఎందుకు అంత స్పెషల్‌గా అడుగుతున్నావు మిస్సమ్మ అనగానే.. మిస్సమ్మ బాధగా రేపు పొద్దున్నే వస్తావు కదా..? పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్తావు కదా..? ఆయన్ని ఆఫీసుకు తీసుకెళ్లి తీసుకొస్తావు కదా..? రేపు ఆయన పక్కనే ఉంటావు కదా..? పిల్లలకు ఏం కావాలో చూసుకుంటావు కదా.. అని మిస్సమ్మ అడుగుతుంటే.. ఏంటి మిస్సమ్మ ఎందుక అలా కొత్తగా అడుగుతున్నావు.. ఇవన్నీ నేను రోజు చేసే పనులే కదా..? అనగానే.. మిస్సమ్మ రేపటి నుంచి కూడా ఈ పనులన్నీ చేయాలని చెప్తున్నాను.. అనగానే.. భలే దానివి మిస్సమ్మ నాకేమైనా మతిమరుపు అనుకుంటున్నావా..? అయినా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ నా పనులు నా బాధ్యత సరేనా అంటాడు. దీంతో మిస్సమ్మ థాంక్స్‌ రాథోడ్‌ నువ్వు ఇలాగే బాధ్యతగా ఉండాలి. ఆయన్ని పిల్లలను ఇంటిని కాపాడుతూ ఉండాలి అని మిస్సమ్మ చెప్పగానే.. ఏంటి మిస్సమ్మ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా..? అదే మీ నాన్న గారి ఇంటికి ఓ నాలుగు రోజులు ఉండి వద్దామని వెళ్తున్నావా..? అని రాథోడ్‌ అడగ్గానే..

Advertisement

మిస్సమ్మ అవును రాథోడ్‌ వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అనగానే.. రాథోడ్‌ నవ్వుతూ.. నేను ఊరికే నాలుగు రోజులు అన్నాను మిస్సమ్మ.. మీరు రెండు రోజుల్లోనే తిరిగి రండి..  మా బుజ్జి ఆరు మేడం గారిని మేము చూడకుండా ఉండలేము కదా..? ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదు అనుకోండి.. ఏమంటారు ఆరు మేడం.. ఏమైంది మిస్సమ్మ పాప ఎందుకో ఇవాళ చాలా డల్లుగా ఉంది అని అడగ్గానే.. మిస్సమ్మ తన మనసులో మేము వెళ్లిపోతున్నట్టు తనకు కూడా అర్థం అయినట్టు ఉంది. అనుకుంటుంది. ఇంతలో రాథోడ్‌ ఎందుకైనా మంచిది రేపు ఒకసారి హాస్పిటల్‌కు తీసుకెళ్దాం.. అంటాడు. దీంతో మిస్సమ్మ అది నేను చూసుకుంటాను రాథోడ్‌ ఇంకో విషయం మనోహరి గురించి ఆయనకు నువ్వు కానీ నాన్న కానీ చెప్పొద్దు అని చెప్పగానే.. అదేంటి మిస్సమ్మ అలా అంటావు.. ఆ రాక్షసి గురించి సార్‌ తో అంతా చెప్పాలి అనుకున్నాం కదా..? నువ్వు కూడా సరే అన్నావు కదా..? అని రాథోడ్‌ అడగ్గానే..

ఇప్పుడు వద్దు అంటున్నాను రాథోడ్‌.. టైం వచ్చినప్పుడు ఆయనకు నేనే చెప్తాను. నా మాట కాదని మీరు ఆయనతో చెప్పారంటే నా మీద ఒట్టే అంటుంది.. దీంతో రాథోడ్‌ ఏంటి మిస్సమ్మ ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు.. అంటాడు. నేను తిరిగి  వచ్చే వరకు మీరు తొందరపడొద్దు అంటున్నాను అని మిస్సమ్మ చెప్పగానే.. మీరు రెండు రోజుల్లో తిరిగి వస్తా అంటున్నారు కదాఎందుకు అప్పగింతల్లో చెప్పినట్టు చెప్తున్నారు అని రాథోడ్‌ అడగ్గానే.. మిస్సమ్మ మనసులో లేదు రాథోడ్‌ ఏడు సంవత్సరాల వరకు నేను వెనక్కి రాను… అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటాను అనుకుంటుంటే.. రాథోడ్‌ మళ్లీ మిస్సమ్మ ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు అని అడగ్గానే.. నేను చెప్పేది అంతా గుర్తు పెట్టుకో రాథోడ్‌ ఏదీ మర్చిపోకు అనగానే.. అయ్యో రెండు మూడు రోజులకు ఇన్ని జాగ్రత్తలు చెప్పాలా..? ఇంతకీ మీరు ఊరు వెళ్తున్నట్టు సార్‌కు చెప్పావా లేదా..? అనగానే.. లేదు చెప్పలేదు అంటూ చెప్పను కూడా అని మనసులో అనుకుంటుంటే..

Advertisement

రాథోడ్‌ సరే మిస్సమ్మ నాకు లేట్‌ అవుతుంది నేను వెళ్తాను అంటూ వెళ్లిపోతాడు ఇదంతా గుర్తు చేసుకున్న రాథోడ్‌ విషయం మొత్తం అమర్‌కు చెప్పగానే అమర్‌ ఎమోసనల్‌ అవుతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Big Stories

Advertisement
×