E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను, రణవీర్‌కు మిస్సమ్మ వార్నింగ్‌ – అంజలి మెడలో దుర్గమ్మ చైన్‌ చూసిన రణవీర్‌, మను

Nindu Noorella Saavasam Serial Today February 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను, రణవీర్‌కు మిస్సమ్మ వార్నింగ్‌ – అంజలి మెడలో దుర్గమ్మ చైన్‌ చూసిన రణవీర్‌, మను
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  అంజును ఎలా తీసుకెళ్లాలి.. లేదంటే కిడ్నాప్‌ చేద్దామా అంటాడు రణవీర్‌. ఇంతలో మిస్సమ్మ వచ్చి వాళ్లు మాట్లాడుకునేది వింటుంది. మిస్సమ్మను రణవీర్‌, మనోహరి  చూసి షాక్‌ అవుతారు. మిస్సమ్మ దగ్గరకు వచ్చి ఎందుకు అంత షాక్‌ అవుతున్నారు. మీ కళ్లల్లో ఆ భయం కనిపిస్తుంది. అసలు ఏం చేస్తున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా లేదా అన్నది నాకు అనవసరం. కానీ మీరు నా కుటుంబం జోలికి వస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది మిస్సమ్మ. దీంతో మనోహరి ఏయ్‌ నీకేమైనా పిచ్చి పట్టిందా..? ఏదేదో మాట్లాడుతున్నావేంటి..? ఈయనేదో అడిగితే చెప్తున్నాను. దానికెందుకు ఇంత రాదాంతం చేస్తున్నావు అంటూ మను వెళ్లిపోతుంటే.. మిస్సమ్మ ఆపి.. మీరు అంజును హాస్పిటల్‌ కు తీసుకెళ్లారని తెలిస్తే ఆయన నాలా వచ్చి మాట్లాడరు చంపేస్తారు.

ఏంటలా చూస్తున్నారు. రణవీర్‌ అంజును బ్లడ్ టెస్ట్‌ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని నాకు తెలుసు. వెనక నువ్వు వెళ్లావని కూడా తెలుసు అంటుంది. దీంతో రణవీర్‌ అయ్యో మిస్సమ్మ గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటాడు. దీంతో మిస్సమ్మ.. నేను తప్పుగా అర్తం చేసుకోవడం లేదు రణవీర్‌. మీరే ఈ మనోహరితో కలిసి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీ ప్లానేంటో తెలియదు. ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కానీ పిల్లల దగ్గరకు వెళ్లాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్లాలి. అన్ని ఇక్కడితో ఆపి వెనక్కి వెళితే మంచిది. లేదంటే మీ ప్రతి పనిలో నేనే అడ్డంకిగా ఉంటాను. మీకు నా గురించి మళ్లీ స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని వార్నింగ్‌ ఇచ్చి మిస్సమ్మ వెళ్లిపోతుంది.

Advertisement

గుప్త, ఆరు మెల్లగా నడుచుకుంటూ చిత్రగుప్తుడి వెనక నుంచి వెళ్తుంటే.. చిత్రగుప్తుడు చూసి అంత జరిగినా ఈ చిత్రవిచిత్రగుప్తుడు మారడం లేదు ఏంటి అని వాళ్లను ఫాలో అవుతాడు. కొంచెం దూరం వెళ్లాక ఇద్దరూ కలిసి చిత్రగుప్తుడు వినేలా నా దగ్గర నాగమణి ఉంది అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు పవర్‌ వస్తుంది. నన్ను భూలోకం తీసుకెళ్లిన వాళ్లకే ఇస్తాను అని చెప్తుంది ఆరు. చాటు నుంచి విన్న చిత్రగుప్తుడు ఆ బాలికను నేనే భూలోకం తీసుకెళ్తాను ఆ నాగమణి నేనే తీసుకుంటాను అనుకుంటాడు.

అమర్‌ కిందకు వచ్చి అంజు లాకెట్‌ మిస్సమ్మకు ఇస్తూ అంజు వచ్చాక మెడలో వేయమని చెప్తాడు. మిస్సమ్మ సరే అంటుంది. ఇంతలో నిర్మల, శివరాం వస్తారు. ఈ చైన్‌ అంజు పుట్టిన రోజు నాడు కానీ ఏదైనా స్పెషల్‌ అకేషన్‌ రోజు వేస్తావు కానీ ఈరోజు ఎందుకు వేస్తున్నావు అని శివరాం అడుగుతాడు. అమర్‌ ఈ చైన్‌ ఇంకెప్పటికీ అంజలి మెడలో వేద్దామనుకుంటున్నాను అని చెప్తాడు. ఇన్ని రోజుల లేనిది ఇప్పుడెందుకు కొత్తగా వేస్తున్నావు నాన్నా అని నిర్మల అడుగుతుంది.

Advertisement

ఇది అంజు మెడలోనే ఉండాలి అమ్మా అది తన హక్కు.. ఇది తనతో ఉంటేనైనా తన ప్రయాణంలో తన కన్నవాళ్లు ఉంటారని చెప్పబోతూ.. అమర్‌ ఆగిపోతాడు. ఏంటండి మీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు తన కన్నవాళ్లు అంటూ పరాయిదానిలా మాట్లాడుతున్నారు అని మిస్సమ్మ అడుగుతుంది. దీంతో రాథోడ్‌ మిస్సమ్మ ఇది మేడం చేయించిన చైన్‌ అది అంజు మెడలో వేస్తే.. మేడం తనతో ఉంటుందని సార్‌ అభిప్రాయం అంటాడు. ఇంతలో అంజు లోపలికి రాగానే.. అమర్‌ చైన్‌ తీసి మెడలో వేస్తాడు. పై నుంచి అంతా గమనిస్తుంటారు రణవీర్‌, మనోహరి.

ఆ చైన్‌ ఏంటని రణవీర్‌.. మనోహరిని అడుగుతాడు. అదేదో సెంటిమెంట్‌ చైన్‌ అంటూ ఇద్దరూ చైన్‌ చూసి షాక్‌ అవుతారు. పక్కకు వెళ్లి చైన్‌ గురించి మాట్లాడుకుంటారు. అసలు నిజం కళ్ల ముందే పెట్టుకుని దేశం మొత్తం వెతికాను. అంటూ రణవీర్‌ మాట్లాడుతూ అమర్‌ తనకు తెలియకుండానే నాకు చాలా హెల్ప్‌ చేస్తున్నాడు అంటాడు. అలాంటి చైనే మరోకటి చేయించుకుని అంజలిని తీసుకుని మనం వెంటనే బయలుదేరాలి.. నాకు ఎక్కువ టైం లేదు అంటాడు. అప్పుడే వచ్చిన అంజలి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. దీంతో మనోహరి, రణవీర్‌ షాక్‌ అవుతారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×