Trump Visa Policies : అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎన్నికయ్యాక ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జన్మతః అమెరికా పౌరసత్వం పొందే విధానానికి స్వస్తి చెప్పేసిన ట్రంప్.. తాజాగా H1B వీసాపై కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో.. రానున్న రోజుల్లో అమెరికాకు వెళ్లారంటే.. ఎప్పటికైనా తిరిగి రావాల్సిందే అనేక ఆలోచనతో వెళ్లాలంటున్నారు నిపుణులు.
ఓసారి అమెరికాలో స్టూడెంట్ వీసాతో ఎంటర్ అయితే చాలు.. నెమ్మదిగా అక్కడ పౌరుడిగా పౌరసత్వం పొందవచ్చనే ఆలోచనకు ఇక పులుస్టాప్ పెట్టాలనేది నిపుణుల మాట. పైగా.. ఇప్పుడు అమెరికా వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగస్థులతో పాటు కొత్తగా వెళ్లాలనుకుంటున్న వారికి అనేక అనుమానులు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎట్ లా జెనతా ఆర్ కంచర్ల అనేక వివరాలు అందించారు. H1B వీసాతో అమెరికాలో సెటిల్ అవ్వటంపై ఇప్పటికే యూఎస్ హౌస్ కమిటీకి కొన్ని ప్రతిపాదనలు అందినట్టు తెలిపిన ఈమె.. అమెరికాలో సెటిల్ అవ్వాలి అనే ఆలోచనను మార్చుకోవడం మంచిదనే సలహా ఇస్తున్నారు.
ఇకపై దేశంలోని వచ్చే వాళ్లు చదువు పూర్తవుగానే స్వదేశానికి వెళ్ళిపోవాలని హెచ్చరికలు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. H1B వీసా ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండలేరని చెబుతున్న ఈ ఇమ్మిగ్రేషన్ విధానాల నిపుణురాలు.. అధ్యక్షుడు తీసుకునే అన్ని నిర్ణయాలు గుడ్డిగా అమలు కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. అన్నింటినీ వివిధ దశల్లో వడపోతలు ఉంటాయంటున్న ఈమె… ట్రంప్ నిర్ణయాల్లో కొన్నింటిని ఎక్కువ కాలం కొనసాగించే వీలుండదని, కాబట్టి అన్ని విషయాలకు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. అనేక సందేహాలపై.. నిపుణుల సలహాలు అందిస్తోంది.. బిగ్ టీవీ. ఈ ఇంటర్వ్యూ మీకోసం..
Also Read : లొంగిపోయిన చివరి మావోయిస్టు లక్ష్మీ.. ఇక నుంచి ఆ రాష్ట్రం మావోయిస్ట్ ఫ్రీ స్టేట్..