BigTV English

Sri Tej Health Update : విదేశాలకు శ్రీతేజ్.. మళ్లీ ఏమైంది..?

Sri Tej Health Update : విదేశాలకు శ్రీతేజ్.. మళ్లీ ఏమైంది..?

Sri Tej Health Update : గత ఏడాది డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. డిసెంబర్ 4 నుంచి ఇప్పటికీ ఆ బాలుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అతడిని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా అతను ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.. శ్రీ తేజ్ ఆరోగ్యం కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు శ్రీదేవి ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపించలేదు. క్రిమినల్ గా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న కూడా అతను స్పృహలోకి రాకపోవడంతో అందరు టెన్షన్ పడుతున్నారు.. అసలు ఎందుకు ఇంకా శ్రీతేజ్ కోలుకోలేదనే సందేహం రావడం కామన్.. అయితే తాజాగా శ్రీతేజ్ ను విదేశాలకు తీసుకొనివెళ్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సంధ్య థియేటర్ ఘటన.. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పుష్ప 2… ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద గల సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ భారీ ర్యాలీతో చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. నిమ్స్ హాస్పిటల్ లో రెండు నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. కానీ అతన్ని మునుపటిలాగా తీసుకూరాలేదు.. అయితే మొన్న రిలీజ్ చేసిన శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ లో కళ్లు తెరుస్తున్నాడని కొద్దిగా పర్వాలేదని అన్నారు.. కానీ ఇప్పుడు మాత్రం శ్రీతేజ్ ను మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తున్నారని సమాచారం..


వైద్యం కోసం విదేశాలకు శ్రీతేజ్.. 

శ్రీతేజ్ఆ రోగ్యం కుదుటపడుతోందని వైద్యులు చెప్పడంతో బన్నీవాసు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో శ్రీతేజ్‌ కు ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యుల సలహా మేరకు విదేశాలకు తీసుకుని వెళ్లాల్సి వస్తే.. అందుకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు అన్నారు. ఇక పోతే పుష్ప 2 చిత్ర బృందం రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ల చొప్పున మొత్తం రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని చెప్పారు.. విదేశాలకు వెళ్లడం అనేది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.. పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 1800 కోట్లు వసూల్ చేసింది. ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నాడు.. త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉంబయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×