E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పెళ్లి కోసం తాళి బొట్టు కొన్న మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today February 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పెళ్లి కోసం తాళి బొట్టు కొన్న మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

రాథోడ్‌ గార్డెన్‌లో నిలబడి మిస్సమ్మతో ఫోన్‌ మాట్లాడుతుంటాడు. హాల్లో నుంచి మనోహరి, చంభా గమనిస్తుంటారు. మనోహరి కోపంగా ఈ రాథోడ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంభా అని చెప్తుంది. దీంతో చంభా ఇప్పుడు వాడితో మార్కెట్‌కు వెళ్తున్నావు కదా..? కూపీ లాగు బయటపడతాడేమో చూడు టైం అవుతుంది వెళ్లు మనోహరి. అన్ని సరుకులతో పాటు అసలుది మర్చిపోకు అని చెప్పగానే.. అది ఎలా మర్చిపోతాను. అసలు నేను వెళ్తుందే రేపు అమర్‌ నా మెడలో కట్టబోయే తాళి కొనడం కోసం సరే వెళ్లొస్తాను అంటూ మనోహరి బయటకు వెళ్తుంటే..

రాథోడ్‌, మిస్సమ్మతో ఫోన్‌ మాట్లాడుతూ ఉంటాడు. మనోహరి అంత తేలిగ్గా బయట పడే రకం కాదు మిస్సమ్మ.. మనమే ఎలాగో ఒక ప్లాన్‌ చేసి బయటకు పంపించేయాలి. అని చెప్పగానే.. మిస్సమ్మ కూడా ఆల్‌ రెడీ నేను అదే ప్లాన్‌ లో ఉన్నాను. దాన్ని ఇంట్లోంచి పంపించేసే టైం దగ్గర పడిందిలే రాథోడ్‌ అని చెప్పగానే.. ఆ ఇంకో విషయం మిస్సమ్మ స్కూల్‌కు నేను వెళ్లడం లేదు. సారే వెళ్లి అంజు పాపను బుజ్జమ్మను తీసుకుని వస్తా అన్నారు అని రాథోడ్‌ చెప్పగానే.. అది కూడా మంచిదేలే రాథోడ్‌ బుజ్జమ్మకు ఆయనకు ఇంటిమసీ పెరుగుతుంది అని చెప్పగానే.. రాథోడ్‌ బాధగా మరి నేను బుజ్జమ్మను మిస్‌ అవుతున్నాను కదా మిస్సమ్మ.. నిజం తెలిశాక మొదటిసారి బుజ్జమ్మను చూద్దామనుకున్నాను.. చాన్స్‌ మిస్ అయిపోయింది అనగానే..

Advertisement

మిస్సమ్మ ఓదారుస్తూ.. పర్వాలేదులే రాథోడ్‌ నీకు నిజం తెలిసింది. బుజ్జమ్మ ఆ ఇంటికి వస్తుంది. మార్కెట్‌కు వెళ్లి వచ్చాక బుజ్జమ్మతో టైం స్పెండ్‌ చేయ్‌.. అని చెప్పగానే.. నేను అదే అనుకుంటున్నాను మిస్సమ్మ అంటూ రాథోడ్‌ మాట్లాడటం మనోహరి విని షాక్‌ అవుతుంది. కారు అద్దంలో మనోహరిని చూసి రాథోడ్‌ షాక్‌ అవుతాడు. వెంటనే మనోహరి అనుమానంగా రాథోడ్‌ ఎవరితో మాట్లాడుతున్నావు.. అని అడగ్గానే.. రాథోడ్‌ కంగారుగా అంజు వాళ్ల మిస్‌ తో మాట్లాడుతున్నాను అని చెప్తాడు. మరి మిస్సమ్మ అంటున్నావు అని మనోహరి అడగ్గానే.. మిస్‌ నే గౌరవంగా మిస్సమ్మ అంటున్నాను.. ఇదిగో మిస్‌ గారు ఇవాళ స్కూల్‌కు నేను రావడం లేదు మా సార్‌ వచ్చారు అని చెప్పగానే.. ఫోన్‌ లో మనోహరి వాయిస్‌ విన్న మిస్సమ్మ కూడా ఇక ఉంటానులే రాథోడ్‌ అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

మనోహరి మాత్రం రాథోడ్‌ను అనుమానంగా చూస్తుంది. దీంతో రాథోడ్‌ ఏంటండి అలా చూస్తున్నారు..? మిస్సమ్మ అంటే మన మిస్సమ్మ అనుకున్నారా..? బలే వారండి మిస్సమ్మ ఎక్కడుందో మీకే తెలియదు.. మరి నాకెలా తెలుస్తుంది. సరే సరే పదండి వెళ్దాం అని చెప్పగానే.. మనోహరి కారు ఎక్కుతుంది. రాథోడ్‌ మాత్రం మనసులో కోపంగా ఈ రాక్షసికి ఒళ్లంతా కళ్లు ఉన్నట్టున్నాయి. వామ్మో పిల్లిలా వెనకే ఉండి అంతా విన్నట్టు ఉంది. అనుకుంటాడు. మనోహరి కూడా మనసులో ఈ రాథోడ్‌కు నిజంగా భాగీ ఎక్కడుందో తెలియదా..?  లేదా తెలిసినా తెలియనట్టు నాటకం ఆడుతున్నాడా..? చెప్తా.. అనుకుంటూ రాథోడ్‌ వెళ్దాం పద అని పిలుస్తుంది. ఆ వస్తున్నా మేడం అంటూ రాథోడ్‌ వెళ్లి కారెక్కుతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×