E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను ఫాలో అయిన మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today January 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను ఫాలో అయిన మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

స్కూల్‌ లో బుజ్జమ్మను చూసిన అమర్ ఎమోషనల్‌ అవుతుంటాడు. ప్రిన్సిపాల్‌ బుజ్జమ్మను మీ పేరెంట్స్‌ రాలేదా అని అడగ్గానే.. మా తాతయ్య వచ్చారు అని చెప్తారు. ఇంతలో ప్రిన్సిపాల్‌ రూంలోకి రాజు వస్తాడు. అక్కడే ఉన్న అమర్‌ ను చూసి రాజు షాక్‌ అవుతాడు. రాజును చూసి అమర్‌ మీరేంటండి ఇక్కడకు వచ్చారు.. ఈ పాప మీ పాపా…? అని అడగ్గానే.. రాజు అవును సార్‌.. మా  పాపే సార్‌ అని చెప్పగానే.. ప్రిన్సిపాల్‌ పాప జాయినింగ్‌ లెటర్‌ తీసుకొచ్చారా..? అని అడగ్గానే.. తీసుకొచ్చాను మేడం అని లెటర్‌ ఇస్తాడు. లెటర్‌ చూసిన ప్రన్సిపాల్‌ వెరీ గుడ్‌ ఎంట్రన్స్‌ టెస్టులో టాప్‌ ర్యాంక్‌లో పాసయి.. స్కూల్‌ లో సీటు స్కాలర్‌షిప్‌లో సంపాదించింది తనేనా..? వెరీ గుడ్‌ అరుంధతి కంగ్రాట్స్‌ అని చెప్పగానే.. బుజ్జమ్మ థాంక్యూ మేడం అని చెప్తుంది. గాడ్‌ బ్లెస్‌ మై చైల్డ్‌.. సార్‌ పాపకు అడ్మిషన్‌ ఇవ్వాలి.. మీరు అని ప్రిన్సిపాల్‌ చెప్పగానే..

ఒకే మేడం మేము బయట వెయిట్‌ చేస్తాము అంటాడు. దీంతో ప్రన్సిపాల్‌ నో నీడ్‌ సార్‌ అంజు గురించి తర్వాత మాట్లాడతాను.. మీరు వెళ్లొచ్చు ఆఫీసుకు.. అంజలి యు గో టూ యువర్‌ క్లాస్‌ అని చెప్పగానే.. అక్కడి నుంచి అంజు, రాథోడ్‌, అమర్‌ వెళ్లిపోతారు. తర్వాత బుజ్జమ్మకు అడ్మిషన్‌ ఇస్తుంది. బయటకు వెళ్లిన అమర్‌ అంజును ఇక నుంచైనా బాగా చదువుకో అని చెప్తాడు. సరే డాడ్‌ అంటూ అంజు వెళ్లిపోతుంది. అమర్‌ అక్కడే నిలబడి రాజు బస్టాప్‌ లో చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటాడు. అంజు క్లాస్ కు వెళ్లకుండా గోడ చాటు నుంచి చూస్తుంటుంది. ఇంతలో ప్రిన్సిపాల్‌ రూంలోంచి రాజు, బుజ్జమ్మ వస్తారు.. అమర్‌ ను చూసి రాజు కంగారు పడుతుంటాడు.. సార్‌ ఇంకా ఇక్కడే ఉన్నారేంటి..? అని మనసులో అనుకుని బాయ్‌ అమ్మా నువ్వు క్లాస్‌కు వెళ్లు అని చెప్తాడు. బుజ్జమ్మ క్లాస్‌ కు వెళ్లిపోతుంది. రాజు.. అమర్‌ దగ్గరకు వెళ్లి వెళ్లోస్తాను సార్‌ అని చెప్పి వెళ్లిపోతుంటే..

Advertisement

అమర్‌ ఆపేసి రాజు గారు ఆ పాప మీ మనవరాలా..? అని అడుగుతాడు.. కాదు సార్‌ ఆ పాప అనాథ అని చెప్తాడు. దీంతో అమర్‌ షాక్ అవుతాడు.. అనాథా..? అని అడగ్గానే.. అవును సార్‌ ఈ మద్యే మా ఆశ్రమంలో చేరింది. అని చెప్పగానే.. మొన్న మీరు ఎవరినో పికప్‌ చేసుకోవడానికి బస్టాప్‌ కు వచ్చారు కదా..? ఈ పాపేనా.. అని అడగ్గానే.. కాదు సార్‌ మా బంధువుల కోసం అని చెప్తాడు రాజు. దీంతో అమర్‌ మరి పాపకు అరుంధతి అని ఎవరు పేరు పెట్టారు అని అడగ్గానే.. రాజు మేమే పెట్టాము సార్‌ అని చెప్తాడు. మీరు పెట్టారా..? అని అమర్‌ అడగ్గానే.. అవును సార్‌ మేమే పెట్టాము అంటాడు రాజు.. మరి అరుందతి అనే పేరే ఎందుకు పెట్టారు అని అమర్‌ అడగ్గానే..

ఎందుకంటే సార్‌ మాకు సంబంధించి అరుంధతి మేడం దేవత. మీరు కూడా దేవుడి లాగా మా ఆశ్రమాన్ని, పిల్లలను ఆదుకుంటున్నారు..అందుకే ఇంకా పేరు పెట్టని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్లు మా ఆశ్రమంలో చేరితే అమ్మాయి అయితే మేడం పేరు అరుంధతి అని అబ్బాయి అయితే అమరేంద్ర అని మీ పేరు పెడతాం సార్‌.. అలా ఈ అమ్మాయికి అరుంధతి అని మేడం పేరు పెట్టాము సార్‌.. అంతే సార్‌.. నేను ఆశ్రమానికి వెళ్లాలి ఉంటాను సార్‌ అంటూ రాజు వెళ్లిపోతాడు. అమర్‌ బయటకు వెళ్లి బుజ్జమ్మను చూస్తుంటాడు.. రాథోడ్‌ హ్యాపీగా సార్‌ పాప చాలా ఉషారుగా ఉంది కదా సార్‌.. అచ్చం ఆరు మేడం లాగా..? మిస్సమ్మ ఆరు పాపను తీసుకుని వెళ్లి ఉండకపోయి ఉంటే.. ఆరు పాప సరిగ్గా ఈ పాప అంత ఉండేది. అని చెప్తుంటే.. అమర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు.

Advertisement

మరోవైపు అమర్‌ ఇంటికి వచ్చి గేటు దగ్గర నిలబడి ఇంట్లోకి చూసి వెళ్లిపోతున్న మిస్సమ్మను తన ఫోన్‌లో చూస్తుంది. మనోహరి వెంటనే చంభాకు విషయం చెప్పి మిస్సమ్మను ఫాలో అవుతారు. మిస్సమ్మ ఆశ్రమంలోకి వెళ్లడం చూసి షాక్‌ అవుతారు. వెనకాలే వెళ్లి కిటికీ దగ్గర నిలబడి మిస్సమ్మ రాజులో మాట్లాడేది వింటారు. వారి మాటల్లో బుజ్జమ్మ స్కూల్‌ గురించి తెలుసుకుని బుజ్జమ్మ కోసం మనోహరి, చంభా స్కూల్‌కు వెళ్తారు. అక్కడ బుజ్జమ్మ వచ్చి మనోహరిని తగలగానే.. మనోహరికి కరెంట్‌ షాక్‌ తగిలినట్టు అవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×