Fire Accident: ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగింది. కార్యాలయంలోని రికార్డు గదిలో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న కీలకమైన భూమి రికార్డులు, పట్టా దార్ పాస్ పుస్తకాలు, ఇతర ప్రభుత్వ పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయ సిబ్బంది గమనించే లోపే మంటలు పైకప్పు వరకు వ్యాపించడంతో లోపల ఉన్న ఫర్నిచర్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
బయట వేసిన చలి మంట.. ఎగిసిపడి రికార్డు గదిలోకి పడ్డ నిప్పురవ్వలు
ఈ ప్రమాదం జరగడానికి కార్యాలయంలోని వారి అజాగ్రత్త వల్లే జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కార్యాలయం వెలుపల చలి తీవ్రత తట్టుకోవడానికి కొందరు వ్యక్తులు చలి మంట వేశారు. అయితే గాలి వేగానికి ఆ చలి మంటల నుంచి నిప్పురవ్వలు ఎగిరిపడి, కిటికీ ద్వారా రికార్డు గదిలోకి ప్రవేశించాయి.
మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
అయితే గదిలో కాగితాలు, పాత ఫైళ్లు ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించి పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అదుపులోకి తెచ్చిన సిబ్బంది ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడం వల్ల మంటలు పక్కనే ఉన్న ఇతర గదులకు వ్యాపించకుండా నివారించగలిగారు.
Also Read: అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య.. హైదరాబాద్ చేరుకున్న నిఖిత మృతదేహం
కీలక ఫైళ్లు తగలబడిపోవడంపై అనుమానాలు
ఈ కీలకమైన ఫైళ్లు మంటల్లో కాలిపోవడంపై పోలీసులకు అనుమానాలు రేగుతున్నాయి. ప్రమాదం జరిగిన జాయింట్ కలెక్టర్ అలేఖ్య పరిశీలించారు. రెవెన్యూ సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. కంచికచర్ల మండల తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన నందిగామ డివిజన్ ఆర్డీవో బాలకృష్ణ కేవలం ఒక గదిలో మాత్రమే మంటల వచ్చాయన్నారు. కుల, ఆస్తి ధ్రువీకరణ పత్రాలు తగులపడ్డాయన్నారు. తహశీల్దార్ కార్యాలయంలోని ఉన్నా ప్రధాన రికార్డు రూంకి ఎలాంటి మంటలు వ్యాపించలేదని చెబుతున్నారు. కంచికర్ల తహశీల్దార్ ఫిర్యాదు ఆధారాంగా పోలీసులు కేసి దర్యాప్తు చేస్తున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా నందిగామ-కంచికచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఘటన
మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆహుతి
తహసీల్దార్ ఆఫీస్ బయట చలి మంట వేయటంతో.. నిప్పురవ్వలు ఎగిరిపడి కార్యాలయం ఉన్న రికార్డు గదిలో మంటలు
మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/VrduUiTJ0j
— BIG TV Breaking News (@bigtvtelugu) January 9, 2026