E-Paper
Advertisement

GHMC News: హైదరాబాద్‌వాసులకు కబురు.. వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు

GHMC News: హైదరాబాద్‌వాసులకు కబురు.. వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు
Advertisement

GHMC News: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు చల్లని కబురు చెప్పింది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్-OTS పథకం కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ పథకం కింద పెండింగ్ బకాయిలను చెల్లించే వారికి వడ్డీలో 90 శాతం మాఫీ కానుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. 

Advertisement

గ్రేటర్ వాసులకు జీహెచ్ఎంసీ తీపి కబురు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లపై ఫోకస్ పెట్టారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధి చిన్నది కావడంతో ఆస్తి పన్ను వసూళ్లలో టార్గెట్ దాదాపుగా రీచ్ అయ్యింది. ఈసారి నగర శివారులోని 27 మున్సిపాలిటీలు విలీనం చేయడంతో ఈసారి పన్ను వసూలు మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

డిసెంబర్ నాటికి కేవలం 1550 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు అయ్యింది. ఇంకా 1450 కోట్ల రూపాయలు వసూలు కావాల్సివుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రకటన చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద పన్ను చెల్లించినవారికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ కానుంది. పూర్తి ప్రిన్సిపల్ మొత్తానికి కేవలం 10 శాతం వడ్డీ చెల్లిస్తే చాలు.

వన్ టైమ్ స్కీమ్ కొనసాగింపు, రేపోమాపో వారికి నోటీసులు

మిగతా 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ అవుతుంది. చాలా రోజులుగా ఇంటి బకాయిలను చెల్లించనివారికి ఇదొక తీపికబురు అన్నమాట. ఈ స్కీమ్ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లోవున్న పన్ను బకాయిలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. నగరవాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని GHMC విజ్ఞప్తి చేసింది.

గ్రేటర్ సిటీలో చాలామంది బడాబాబులు ఆస్తి పన్ను కట్టడం లేదని అధికారులు గుర్తించారు. రేపో మాపో వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తోంది. చాలామంది ఏళ్ల తరబడి పన్ను కట్టలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పరిధిలోని జోన్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

ALSO READ: బీఆర్ఎస్ ఈసారి పక్కాగా ప్లాన్.. వైసీపీతో కలిసి బరిలోకి

గతంలో ఆస్తి పన్ను నేరుగా వినియోగదారుల నుంచి వసూలు అధికారులు చేసేవారు. చాలామంది అధికారులు ఆ నిధులతో వడ్డీ వ్యాపారాలు చేశారట. ఈ నేపథ్యంలో పాత పద్దతిని తొలగించి, ఆన్‌లైన్ ద్వారా చెల్లించే పద్దతికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. అందుకోసం MyGHMC యాప్, మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు-CSCs, ఆన్‌లైన్ విధానాల ద్వారా పన్ను చెల్లించవచ్చు.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×