E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర ప్లాన్‌ సక్సెస్‌ 

Nindu Noorella Saavasam Serial Today June 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర ప్లాన్‌ సక్సెస్‌ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు ఇంట్లో వెతుకుతున్న అమర్‌కు మిస్సమ్మ ఫోన్‌ చేసి అంజు దొరికిందా అని అడుగుతుది. దీంతో అంజు  దొరకలేదని.. రణవీరే అంజును కిడ్నాప్‌ చేశాడని నాకు తెలిసింది వాడి సంగతి చూశాకే నీకు ఫోన్‌ చేస్తాను అంటాడు అమర్‌. ఏవండి నేను నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి. ఒక నిజం చెప్పాలండి అంటుంది. ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం అంటాడు అమర్‌. ఇంతలో కారు వస్తుంది. రాథోడ్‌ కారు చూసి సార్‌ రణవీర్‌ వచ్చినట్టు ఉన్నాడు అని చెప్తాడు. అమర్‌ భాగీ రణవీర్‌ వస్తున్నాడు. వాడి సంగతి చూసి అంజును తీసుకొస్తాను ఫోన్‌ పెట్టేయ్ అంటాడు అమర్‌. దీంతో మిస్సమ్మ ఏవండి మీరు రణవీర్‌ను ఏమీ చేయడానికి వీలులేదండి.. అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు భాగీ అంజును కిడ్నాప్‌ చేయాలని చూసిన వాడిని తన స్వార్థం కోసం అంజును కొల్‌ కతా తీసుకొచ్చిన వాడిని వాడి ఆస్తిని దక్కించుకోవడానికి కోర్టులో అంజు తన కూతురు అని  అబద్దపు  సాక్ష్యం చెప్పించిన వాడిని వదిలేయమంటున్నావా..? అంటాడు అమర్‌.

దీంతో మిస్సమ్మ అవునండి.. ఎందుకంటే అంజు కోర్టులో రణవీర్‌ కూతురు అని చెప్పడం అబద్దం కాదు. ఏంటి ఏం మాట్లాడుతన్నావు అంటాడు అమర్‌. దీంతో మిస్సమ్మ అవునండి అంజు రణవీర్ కన్నకూతురు. ఏం జరిగిందో తెలియదు. ముందు అంజును తీసుకుని అక్కడి నుంచి వచ్చేయండి. ఏం జరిగినా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తుంది. దీతో అమర్‌ షాక్‌లో ఉంటాడు. మిస్సమ్మ ఫోన్‌ కట్‌ చేస్తుంది. రణవీర్‌, లాయరు అంజును తీసుకుని ఇంట్లోకి వస్తారు. ఇంట్లో అమర్‌ను చూసిన అంజు, లాయర్‌, రణవీర్ షాక్‌ అవుతారు. అమర్‌ ఇక్కడకు ఎలా వచ్చాఉ. అంజు నాతో ఉందని ఎలా కనిపెట్టాడు. నిజం తెలిసిపోయిందా..? అని మనసులో అనుకుంటుంటాడు. అంజు డాడ్‌ అనుకుంటూ వెళ్లి అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది. అమర్‌ కోపంగా రణవీర్‌ ను చూస్తుంటాడు. కట్‌ చేస్తే ఇంట్లో అందరూ టెన్షన్‌ పడుతుంటారు. మనోహరి మెల్లగా వచ్చి చిత్రను ఏంటో సంతాపసభకు కూర్చున్నట్టు అందరూ మౌనంగా కూర్చున్నారు అని అడుగుతుంది. ఇంతలో ఫోన్‌ వస్తుంది. మిస్సమ్మ వెళ్లి లిఫ్ట్ చేసి అలాగా…ఓకే నేను చెప్తాను అంటూ హ్యాపీగా అంజు దొరికేసిందట అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మను, చిత్ర షాక్‌ అవుతారు.

Advertisement

అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. పక్కా ప్లాన్‌ చేశాను అన్నావు పాప దొరికేసింది అంటున్నారు అని అడుగుతుంది చిత్ర. దీంతో మనోహరి నాకు అదే అర్థం కావడం లేదే అంజు అమర్‌కు ఎలా దొరికింది అనుకుంటుంది. రణవీరే అమర్‌కు దొరికేసి ఉంటాడు. నువ్వు ఎలా చూసిన నిజం అదే ముందు నీ నిజం అమర్‌ ముందు బయట పడిందో లేదో వెళ్లి కనుక్కో  అని చెప్తుంది చిత్ర. మనోహరి కంగారు తన రూంలోకి వెళ్లి రణవీర్‌ కు కాల్‌ చేస్తుంది. తర్వాత అందరూ లాన్‌లో కూర్చుని ఉండగా.. వినోద్‌ వెళ్తాడు. అమర్‌తో అన్నయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తాడు. దేని గురించి మాట్లాడాలి వినోద్‌ అని శివరాం అడుగుతాడు.

దీంతో వినోద్‌ నా పెళ్లి గురించి నాన్నా అని చెప్తాడు. దీంతో నిర్మల నువ్వు ఈ మాట ఎప్పుడెప్పుడు అంటావా అని ఎదురుచూస్తున్నాము నాన్నా అంటుంది. దీంతో వినోద్‌ నేను ఆల్ రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అమర్‌ మాత్రం కూల్‌గా చిత్రనా..? అని అడుగుతాడు. శివరాం కూడా నువ్వు నిజంగా చిత్రను ప్రేమిస్తున్నావా..? వినోద్‌ అని అడుగుతాడు. దీతో వినోద్‌ అవును నాన్నా నేను తననే పెళ్లి చేసుకుందాం  అనుకుంటున్నాను అని చెప్తాడు. మీరందరూ ఒప్పుకుంటే మీ ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతుంది. లేదంటే పెళ్లికి నా కుటుంబం రాలేదు అనుకుని చిత్ర మెడలో తాళి కడతాను. అనగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

Big Stories

Advertisement
×