Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కన్నుమూశారు.. హిందీ టీవీ సీరియల్ నటుడు విభూ రాఘవన్ ( వైభవ్ కుమార్ సింగ్ ) కన్నుమూశారు.. ఈయన గత కొంతకాలంగా స్టేజ్ ఫోర్ పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. గత కొన్ని నెలలుగా ఈయన ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇవాళ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త విన్న ఆయన తోటి నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. బాలీవుడ్ ఇండస్ట్రీ లోని పలువురు ప్రముఖులు ఆయన మృతి పై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. నేడు ముంబైలోని ఆ ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. ఇప్పటికే ఆయన మరణ వార్త విన్న పలువురు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. నేడు జరగనున్న అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులు భారీగా హాజరుకానున్నారని బాలీవుడ్ మీడియా సమాచారం..
క్యాన్సర్ తో మరణించిన సీరియల్ యాక్టర్..
బాలీవుడ్ బుల్లితెర నటుడు విభూ రాఘవే గత కొంతకాలంగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతడికి క్యాన్సర్ నాలుగో స్టేజ్ లో ఉంది. గత కొన్ని నెలలుగా ముంబైలోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నాడు. క్యాన్సర్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆర్థిక సాయం కోసం ఎదురు చూశారు. బుల్లితెరపై సక్సెస్ఫుల్ సీరియల్ లో నటించిన నటుడు పరిస్థితి దారుణంగా ఉందని బిగ్ బాస్ విన్నర్ కరణ్ వీర్ మెహ్ర తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశారు. దయచేసి అతనికి ఆర్థిక సాయం అందించాలంటూ కోరాడు. ఆ పోస్టు వైరల్ అవ్వడంతో నటుడి పరిస్థితి గురించి అందరికీ తెలిసింది. వీడియోలో నా ఫ్రెండ్ విభూకి క్యాన్సర్.. కిమోథెరపీకి బోలెడు డబ్బులు ఖర్చులవుతున్నాయి. దయచేసి మీరు ఆర్థిక సాయం అందించగలరు అంటూ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు. మీరందరి సాయం వల్ల అతని త్వరగా కోలుకుంటాడని నాకు నమ్మకం ఉంది అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటివరకు ఆయన ఆసుపత్రి బెడ్ మీద చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. తాజాగా పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.
విభూ సీరియల్స్..
బాలీవుడ్ లో ఎన్నో సీరియల్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈయన నటించిన నిషా ఔర్ ఉస్కే కజిన్స్ సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. సావధాన్ ఇండియా అనే షోలో కూడా కనిపించారు.. టీవీ షోలు సీరియల్స్ మాత్రమే కాదు బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి నటుడిగా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే మనిషి ఒక్కసారిగా క్యాన్సర్ రావడంతో కుప్పకూలిపోయాడు. ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి మరీ దారుణం అనే చెప్పాలి. ఇప్పటివరకు ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం బాలీవుడ్ ఇండస్ట్రీలో తీరని లోటు అనే చెప్పాలి. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎందరో నటులు ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.