E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును చంపబోయిన రణవీర్

Nindu Noorella Saavasam Serial Today march 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును చంపబోయిన రణవీర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

రణవీర్ కారులో మనోహరిని ఒక పార్క్‌ దగ్గరకు తీసుకెళ్తాడు. మనోహరి కోపంగా రణవీర్‌ ఏం చేస్తున్నావు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. దీంతో రణవీర్‌ కోపంగా ఏంటే తెగ గింజుకుంటున్నావు నువ్వు నీ అవతారం చూసుకున్నావా..? బాగానే ఎంజాయ్‌ చేస్తున్నావు.. అనగానే.. మనోహరి కూడా కోపంగా ఏంటి.? ఏదో సొంత పెళ్లాన్ని అడిగినట్టు అలా అడుగుతున్నావు.. ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు.. అనగానే.. రణవీర్‌ కూడా నీతో సంబంధం పెట్టుకోవాలని నాకు లేదు.. నీలాంటి దుర్మార్గురాలికి స్వార్థపరురాలికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నేను కూడా అనుకుంటున్నాను అంటాడు..

దీంతో మనోహరి కూడా నేను చెడ్డదాన్ని సెల్ఫీష్‌ను అయితే ఏంటి..? నువ్వు మహాత్ముడివా..? నువ్వు ఎన్ని క్రైమ్స్‌ చేయలేదు.. అనగానే.. రణవీర్‌ కోపంగా నీ వల్లనే నేను క్రిమినల్‌ అయ్యాను.. అఖరికి జైళ్లో పడ్డాను.. కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు నువ్వు.. అంటాడు. దీంతో మనోహరి నువ్వు జైళ్లో ఉన్నావని నాకు తెలియదు అంటుంది. దీంతో రణవీర్‌ కోపంగా ఏయ్‌ నాటకాలాడకు.. నా గురించి లాయరు నీకు ఎన్నిసార్లు కాల్ చేశాడు. మాట్లాడావా..? అనగానే.. మనోహరి ఏమీ తెలియనట్టు నేను కాస్త బిజీగా ఉన్నాను.. అని చెప్తుంది. దీంతో రణవీర్‌ మరింత కోపంగా అవును నువ్వు బిజీ అయ్యావని నీ వేషం చూస్తేనే తెలుస్తుందిలే.. అనగానే.. ఇంక ఆపు రణవీర్‌ ముందు నన్ను ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అని అడగుతుంది.

Advertisement

దీంతో రణవీర్ కోపంగా నాకు నా కూతురు కావాలి అని చెప్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. నీకు కావాల్సింది కూతురా..? లేక ఆస్థా..? అని అడుగుతుంది. అది నీకు అనవసరం నా కూతురును నాకు అప్పగిస్తానని చెప్పి మాటిచ్చి నాతో అడ్డమైన పనులు చేయించుకున్నావు.. ఆ పనులు చేసి నేను జైలు పాలయ్యాను.. ఆస్తి వస్తే తప్పా..? జైలు నుంచి బయట పడలేను. నాకు ఒక్క నెల రోజులే బెయిల్‌ ఇచ్చారు. ఆలోపు నా కూతురును నాకు అప్పగించు లేదంటే నా చేతుల్లో చస్తావు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు రణవీర్‌. దీంతో మనోహరి కోపంగా సడెన్‌ గా ఊడిపడి కూతురు కావాలంటే అదేమైనా నా ఒళ్లో ఉందా ఇవ్వడానికి అంటుంది. దీంతో రణవీర్  కోపంగా ఆ పిల్ల ఎక్కడుందో నీకు తెలుసు కదా..?  అనగానే.. నాకు తెలియదు.. అమర్‌కు తెలుసు అనగానే..

వాడిని అడిగితే చెప్తాడు కదా..? అనగానే.. ఈరోజు చెప్పేవాడే ఆ భాగీ, రాథోడ్‌ అడ్డుపడకపోయి ఉంటే.. నేను అనాథ ఆశ్రమంలో వదిలేసిన బేబీని అమర్‌, అరుంధతిలు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.. అని మనోహరి చెప్పగానే.. రణవీర్‌ కోపంగా అంటే నా కూతురును  వాళ్లు ఏం చేశారు.. అరుందతి చనిపోగానే.. అమరేంద్ర నా కూతురును మళ్లీ అనాథ ఆశ్రమంలో వదిలిపెట్టాడా..? అనగానే.. అమర్‌ అలాంటి వాడు కాదు తన కన్న కూతురు అని తెలియకపోయినా భాగీకి పుట్టిందని తెలియక ఆర్ఫాన్‌ అనుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.. అని చెప్పగానే.. రణవీర్‌ అయితే నా కూతురు ఆ ఇంట్లోనే ఉందా..? ఆ నలుగురు పిల్లల్లో ఒకరు నా కూతురా..? అని రణవీర్‌ అడగ్గానే.. మనోహరి షాక్‌ అవుతుంది. నీకేమైనా పిచ్చా ఆ నలుగురు అరుందతి పిల్లలు అని చెప్తుంది. దీంతో రణవీర్‌ గడువులోపు నా కూతురును నాకు అప్పగించు లేదంటే నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు రణవీర్‌.

Advertisement

రణవీర్ బెయిల మీద బయటకు వచ్చాడని తెలుసుకున్న అమర్‌. ఇంటికి ఫోన్‌ చేసి పిల్లలు ఇంట్లోనే ఉన్నారా..? అని తెలుసుకుంటాడు. ముగ్గురు ఉన్నారని అమ్ము లేదని చంభా చెప్పగానే.. వెంటనే అమర్‌, రాథోడ్‌ను తీసుకుని ఆఫీసును బయలుదేరుతాడు. మరోవైపు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న అమ్మును ఎవరో కారుతో డాష్‌ ఇవ్వబోతారు. అమ్ము షాక్‌ అవుతుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Big Stories

Advertisement
×