E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అదరి ముందు ఆరులా మాట్లాడిన బుజ్జమ్మ 

Nindu Noorella Saavasam Serial Today march 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అదరి ముందు ఆరులా మాట్లాడిన బుజ్జమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, రాథోడ్‌, మిస్సమ్మ, మనోహరి, యాదమ్మ హాల్లో ఉంటారు. అమ్ముకు వచ్చిన కొరియర్‌ గురించి మనోహరి, అమర్‌కు చెప్తుంది. దీంతో అమర్‌ గట్టిగా అమ్మును పిలుస్తాడు. అమ్ము పై నుంచి కిందకు వచ్చి చెప్పండి డాడ్‌ అని అడుగుతుంది. దీంతో అమర్‌ నీకొచ్చిన కొరియర్‌ ఏంటి అని అడుగుతాడు. దీంతో అమ్ము షాక్‌ అవుతుంది. ఇంతలో పిల్లలు కూడా కిందకు వస్తారు. అది డాడ్ అంటూ అమ్ము తడబడుతుంటే..  మనోహరి నిన్ను అడుగుతుంటే తనను చూస్తావేంటి అమ్ము ఆ కొరియర్‌లో ఏముందో చెప్పు అంటుంది.. దీంతో మిస్సమ్మ అందులో ఏమీ లేదు మనోహరి అంటుంది.

దీంతో అమర్‌ కోపంగా నేను అడుగుతుంది నిన్ను కాదు.. చెప్పు అమ్ము నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు..? అని అడగ్గానే.. మిస్సమ్మ తనేం దాయలేదండి… అనగానే.. అమర్‌ కోపంగా కాసేపు నువ్వు కామ్‌గా ఉంటావా..? అమ్ము వెళ్లి ఆ కొరియర్‌ తీసుకురా..? చెప్పేది నీకే వెళ్లు.. అనగానే.. మిస్సమ్మ నేను తీసుకొస్తానండి అంటూ లోపలికి వెళ్లి కొరియర్ కవర్‌ తీసుకుని వచ్చి అమర్‌కు ఇస్తుంది మిస్సమ్మ. కవర్‌ తీసుకుని అమర్‌ చూస్తాడు. మిస్సమ్మ, రాథోడ్‌, అమ్ము టెన్షన్‌ పడుతుంటారు. లెటర్‌ చదివిన అమర్‌ అమ్మును కోపంగా చూస్తుంటే.. మిస్సమ్మ ఏవండి అమ్మును ఏమీ అనకండి ఆ లెటర్‌ దాయమని నేనే చెప్పాను అనగానే.. అమర్‌ కోపంగా బుద్ది ఉందా నీకు ఇలాంటివి ఎవరైనా దాస్తారా..? తన ఫ్యూచర్‌ ఏం కావాలి..? అనగానే.. మిస్సమ్మ భయంగా అంటే అమ్ముకు ఇష్టం లేదంటండి.. అందుకని అని చెప్పగానే.. అమర్‌ మరింత కోపంగా అందుకని మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారా…? నేను ఉన్నది ఎందుకు..? ఏదైనా నాతో చెప్పాలి కదా..? అనగానే..

Advertisement

రాథోడ్‌ మెల్లగా ఈరోజు మీకు చెప్పాలనుకున్నారు సార్‌ అనగానే.. అమర్‌ కోపంగా రాథోడ్‌ అంటే ఈ విషయం నీకు కూడా తెలుసన్నమాట. అందరూ కలిసే నా దగ్గర దాచారన్నమాట అంటూ అమర్‌ కోప్పడుతుంటే.. మనోహరి అమర్‌ ఆ లెటర్‌లో ఏముంది అమర్‌ అని అడగుతుంది. దీంతో అమర్‌ ఏంటి అమ్ము నాతో చెప్పకుండా నీకు నువ్వే డిసీజన్స్‌ తీసుకునేంత పెద్దదానివి అయిపోయావా..? అనగానే.. అమ్ము ఏడుస్తూ సారీ డాడ్‌ అంటుంది. దీంతో అమర్‌ నో ఎక్స్‌క్యూజ్‌ వెళ్లి నీ లగేజీ సర్దుకో అని అమర్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.. అమ్ము మాత్రం ఏడుస్తూ.. డాడ్‌ అంటుంది. అమర్ కోపంగా వెళ్లి లగేజీ తెచ్చుకో అని చెప్పగానే.. అమ్ము ఏడుస్తూ రూంలోకి వెళ్తుంది.  వెనకే మిస్సమ్మ వెళ్తుంది. మిస్సమ్మతో ఏడుస్తూ అమ్ము తనకు ఇష్టం లేదని చెప్తుంది. దీంతో మిస్సమ్మ అమ్మును ఓదారుస్తుంది.

ఇంతలో కింద నుంచి మనోహరి అమ్ము ఫ్లైట్‌కు టైం అవుతుంది వెంటనే లగజీ సర్దుకుని కిందకురా  అని పిలుస్తుంది. అమ్ము, మిస్సమ్మ కిందకు వస్తారు.. అమ్ము ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి నిలబడి మొక్కుతూ ఏడుస్తుంది. అప్పుడే బుజ్జమ్మ, అమ్ము దగ్గరకు వెళ్లి  అచ్చం ఆరులా అమ్ము అని పిలుస్తుంది. ఆ పిలుపు విన్న అందరూ షాక్‌ అవుతారు… బుజ్జమ్మ మాత్రం ఆరులా అమ్ము మా అందరికీ దూరంగా వెళ్తున్నానని బాధపడకు.. నీ మీద డాడ్‌ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు.. సరేనా అని చెప్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.. అమర్‌ మాత్రం మనసులో బుజ్జమ్మ మాట్లాడుతుంటే.. ఆరు గొంతులా వినిపిస్తుందేంటి..?  అనుకుంటాడు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×