E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలా బారి నుంచి మిస్సమ్మను సేవ్ చేసిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today November 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలా బారి నుంచి మిస్సమ్మను సేవ్ చేసిన అమర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:    

చంభా పంపిన కాలా హాల్లో కూర్చున్న మిస్సమ్మను కాటేయబోతుంది. పై నుంచి మనోహరి, చంభా చూస్తుంటారు. ఇంతలో పిల్లలు స్కూల్ కు రెడీ అయి వస్తూ మిస్సమ్మ అని పిలుస్తారు. పిల్లలు పిలవడంతో మిస్సమ్మ అక్కడి నుంచి లేస్తుంది. కాలా కాటేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. పిల్లుల మిస్సమ్మ దగ్గరకు వచ్చి మిస్సమ్మ మేము స్కూల్ కు వెళ్తున్నాము అని చెప్పగానే.. సరే వెళ్లండి అంటూ అందరికీ లంచ్‌ బాక్స్‌ ఇస్తుంది మిస్సమ్మ. లంచ్‌ బాక్స్‌ తీసుకుని స్కూల్‌ కు వెళ్లబోతూ.. డోర్‌ దగ్గర ఆగిపోతారు. దీంతో పై నుంచి చూసిన మనోహరి ఏంటి పిల్లలు ఆగిపోయారు అంటుంది. పిల్లలు కాలాను చూశారేమో అని చంభా భయపడుతుంది.

Advertisement

ఇంతలో పిల్లలు తిరిగి మిస్సమ్మ అంటూ దగ్గరకు వెళ్లి మిస్సమ్మ కడుపులో బేబీని బాయ్‌ చింటూ.. బాయ్‌ కన్నా అంటూ తలా ఓ పేరుతో పిలుస్తారు. దీంతో మిస్సమ్మ ఆగండి ఆగండి మీరు తలా ఓ పేరుతో పిలిస్తే బేబీ కన్పీజ్‌ అవుతుంది అని చెప్పగానే.. అంజు మిస్సమ్మ మరి చెల్లికి ఇంకా ఏ పేరు పెట్టలేదు కదా అంటుంది. ఇంతలో అమ్ము ఒక పని చేద్దాం మనకే చెల్లికి ఒక మంచి పేరు పెడితే సరిపోతుంది అంటుంది. దీంతో ఆనంద్ ఏం పేరు పెడితే బాగుంటుంది అని అడుగుతాడు. ఏం పేరు పెట్టినా చాలా క్యూట్‌గా ఉండాలి అంటాడు ఆకాష్‌.. పిల్లలు పేరు ఆలోచిస్తుంటారు. ఇంతలో అంజు రోజ్‌ అని పెడదాం.. అంటుంది. దీంతో అమ్ము వద్దు స్కూల్‌ లో రోజా కాజా కూజా అని చెల్లిని ఏడిపిస్తారు.. కావ్య అని పెడదాం అంటుంది. దీంతో ఆనంద్‌ అది మరీ ఓల్డ్‌ నేమ్ లా ఉంది. మనీషా అని పెడదాం. లేదంటే బిందు అని పెడదాం అంటాడు.

ఇంతలో ఆకాష్‌ డింపుల్‌ అని పెడదాం.. చాలా స్టైల్‌గా ఉంటుంది అని చెప్పగానే.. లోపలికి వచ్చిన అమర్‌ ఆ పేర్లేవీ వద్దు అరుంధతి అని పెడదాం అంటాడు. దీంతో పిల్లుల అందరూ అమ్మ పేరు కదా డాడ్‌ అంటారు. దీంతో రాథోడ్‌ అవును పిల్లలు అరుందతి మేడమే మళ్లీ మిస్సమ్మ కడుపులో పుడుతుందని అనుకున్నాం కదా కాబట్టి ఆ బేబీకి అరుంధతి మేడం పేరే కరెక్టు అని చెప్పగానే.. అంజు అమ్మ పేరులో చెల్లిని ఎలా పిలవాలి కష్టం కదా అంటుంది. దీంతో అంజు నువ్వు ఎప్పుడు మీ అమ్మని పేరు పెట్టి పిలవనట్టు మాట్లాడుతున్నావు.. అనగానే.. అంజు సిగ్గుతో తల దించుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ ఈ పేర్ల గోల తర్వాత మీరు స్కూల్ కు వెళ్లకపోతే మీకు ఆక్షన్‌ పడుతుంది. మీరు ముందు స్కూల్‌ కు వెళ్లండి.. రాథోడ్‌ పిల్లలను తీసుకెళ్లు అని మిస్సమ్మ చెప్పగానే.. అవును పిల్లలు స్కూల్‌ కు టైం అవుతుంది పదండి అంటూ పిల్లలను తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

వాళ్లు వెల్లిపోయాక అమర్‌ భాగీ అని పిలవగానే.. ఆ నాకు గుర్తుంది ఇప్పుడు నేను జ్యూస్‌ తాగాలి అంతే కదా మహానుభావ అంటుంది. ఇప్పుడు తాగడం ఏంటి..? ఐదు నిమిషాల కిందటే నువ్వు జ్యూస్‌ తాగాలి అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ అబ్బా నేను ఫ్రూట్స్‌ తిని పది నిమిషాలు కూడా కాలేదండి అంటుంది. దీంతో అమర్‌ డ్రై ఫ్రూట్స్‌ తిన్నావా..? మామూలు ఫ్రూట్స్‌ తిన్నావా..? అని అమర్‌ అడగ్గానే.. రెండు తిన్నాను.. కాస్త గ్యాప్‌ ఇవ్వండి. కడుపు నిండా తినమంటున్నారు.. కదలకుండా కూర్చోమంటున్నారు.. అవును మీరు ఇప్పుడే ఇలా ఉంటే అప్పట్లో పాపం మా అక్క ఎలా తట్టుకుందో ఏంటో..? అని అడగ్గానే.. హలో భాగీ నువ్వు ఇవన్నీ తినాల్సింది నీ ఒక్క దానికోసం కాదు కడుపులో బేబీకి కలిపి ఇద్దరికి సరిపడా తినాలి. అలాగే అంతే వర్కవుట్స్‌ కూడా చేయాలి. జ్యూస్‌ తాగి పద వర్కవుట్ చేద్దువు కానీ

అనగానే రామచంద్ర ప్రభు నా వల్ల కాదు అంటూ మిస్సమ్మ చెప్పగానే.. నా వల్ల కాదు అంటే వదులుతానా..? నేను ఇంట్లో ఉన్నది ఎందుకు..? అంటాడు. మీరు ఆఫీసకు వెళ్లితే బాగుండు.. మీరు లీవ్‌ లో ఉండి నన్ను చంపుతున్నారు.. అవును మీ లీవ్స్‌ ఎప్పుడు అయిపోతాయి అని మిస్సమ్మ అడగ్గానే.. అమర్‌ నీ డెలివరీ తర్వాత అని చెప్పగానే.. ఆ అప్పటి వరకు అంతేనా.. అంటుంది మిస్సమ్మ.. తప్పదు పదా అంటూ అమర్‌ మిస్సమ్మను తీసుకుని పైకి రూంలోకి వెళ్లిపోతాడు. చాటు నుంచి కాలా చూస్తు ఉంటుంది. పై నుంచి చూస్తున్న మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీల్‌ అవుతుంది. ఇంట్లో అమర్‌, పిల్లలు ఉన్నంత వరకు భాగీని కాలా కాదు కదా..? ఆ దేవుడు కూడా ఏమీ చేయలేరు అంటూ కోప్పడుతుంది. దీతో చంభా బాధ పడకు మనోహరి దేనికైనా టైం రావాలి.. అప్పటి వరకు ఓపిక పట్టు అంటూ ఓదారుస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×