E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు రణవీర్ కొత్త ప్లాన్ 

Nindu Noorella Saavasam Serial Today November 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు రణవీర్ కొత్త ప్లాన్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

అమర్‌ కారు కీస్‌ తీసుకుని లోపలికి వెళ్లిపోయాక మనోహరి కూడా చంభాతో లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత అందరూ పడుకున్నాక వెళ్లి రెడో కీతో కారు డిక్కీ ఓపెన్ చేసి రణవీర్‌ను ఇంట్లోకి తీసుకెళ్తుంది. రూంలోకి వెళ్లిన రణవీర్‌ నిజంగా చచ్చిపోయాను అనుకున్నాను బతికించావు మనోహరి అంటాడు. నిన్ను  ఎలాగైనా కాపాడతానని చెప్పాను కదా అంటుంది మనోహరి. కానీ ఇంత రిస్క్‌ చేసి ఇంట్లోకి రావడం కన్నా డిక్కీలోనే ఉండటం బెటర్‌ అనిపించింది అని రణవీర్‌ అనగానే.. అయితే మళ్లీ డిక్కీలోకి పంపిచేయనా అంటుంది మనోహరి. వద్దు పర్వాలేదు.. ఇక్కడే ఉంటాను.. అవును ఈ బాంబు ఏంటి మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చావు అని రణవీర్‌ భయపడుతుంటే.. టెన్షన్‌ పడకు రేపు నాకు దీంతో పని ఉంది అని చెప్తుంది. ఏం పని అని రణవీర్‌ అడగ్గానే.. రేపు నువ్వే చూస్తావు కదా అంటుంది మనోహరి.

తర్వాత రాథోడ్‌ గార్డెన్‌లో కారు క్లీన్‌ చేస్తుంటే.. రామ్మూర్తి, మంగళ వస్తారు వాళ్లను చూసిన రాథోడ్‌ సంతోసంగా రండి సార్‌ రండి అమ్మా.. అని పిలుస్తుంటాడు. రాథోడ్‌ను చూసిన రామ్మూర్తి ఏమయ్యా రాథోడ్‌ అప్పుడే వచ్చేశావా నువ్వు అని అడగ్గానే.. పొద్దున్నే వచ్చేశాను సార్‌.. మిస్సమ్మ సీమంతాన్ని నేను మిస్‌ అవ్వనని చెప్పాను కదా.. ఆ బ్యాగులు ఇలా ఇవ్వండి సార్‌ మళ్లీ లోపలికి  ఎందుకు..? ఏయ్‌ తిరుపతి ఈ బ్యాగులు కారు డిక్కీలో పెట్టు.. అని చెప్పగానే.. రాథోడ్‌, భాగీ అల్లుడు గారు పిల్లలు రెడీ అవుతున్నారా..? అని రామ్మూర్తి అడగ్గానే.. అవుతున్నారు సార్‌ లగేజీ సర్దుతున్నారు అని రాథోడ్‌ చెప్పగానే.. అయ్యో ఇంకా రెడీ అవుతున్నారా..? గంటలో రాహు కాలం వస్తుంది త్వరగా బయలుదేరాలి అని చెప్పగానే..

Advertisement

అంత సేపు ఏం కాదు సార్‌ ఇక బయలుదేరుతాము.. మీరు లోపలికి వెళ్లి హడావిడి చేయండి అని రాథోడ్‌ చెప్పగానే.. రామ్మూర్తి, మూర్తి లోపలికి వెళ్తుంటారు. ఇంతలో ఫోన్‌ మాట్లాడుతూ అమర్‌ ఎదురుగా వస్తాడు. లోపలికి వెల్లండి మామయ్యా అని చెప్పి బయటకు వెళ్తాడు అమర్‌. లోపలికి వెళ్లిన మంగళ అటూ ఇటూ చూస్తుంటే.. ఏంటో అక్కడకు చూస్తున్నావు.. పద అమ్మాయి దగ్గరకు అని రామ్మూర్తి చెప్పగానే.. మీరు వెళ్లండి నాకు కొంచెం పనుంది అని మంగళ చెప్పగానే.. ఏంటో ఆ మనోహరితో ముచ్చట పెట్టుకోవాలా..? దుష్టులకు దూరంగా ఉండమని ఎన్ని సార్లు చెప్పాను అంటాడు రామ్మూర్తి. నాకు మనోహరిని కలవడం తప్పా వేరే పని ఉండదా..? ఎప్పుడూ అదే అనుమానం అంటుంది. చూడు శుభమాని ఊరెలుతున్నాం. ఏదైనా తేడా జరిగిందో చంపేస్తాను జాగ్రత్త అంటూ రామ్మూర్తి వార్నింగ్‌ ఇచ్చి పైన మిస్సమ్మ దగ్గరకు వెళ్తాడు.

రామ్మూర్తిని చూసిన మిస్సమ్మ నాన్న వచ్చేశారా పిన్ని ఎక్కడ అని అడుగుతుంది. కింద ఉందమ్మా.. అమ్మా ఈ టైంలో నువ్వు ఈ పనులు చేస్తున్నావా..? నువ్వు కూర్చో నేను చేస్తాను అంటాడు రామ్మూర్తి. నాన్న ఈ పనులు అన్నీ మీకు ఎందుకు అంటుంది మిస్సమ్మ.. దీంతో రామ్మూర్తి తప్పేం ఉందమ్మా.. ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా…? ఎప్పుడెప్పుడు ఊర్లో వాళ్లందరినీ పలకరిద్దామా..? ఎప్పుడెప్పుడు నీ సీమంతం చేద్దామని చాలా ఆత్రుతగా ఉందమ్మా.. రాత్రంతా నాకు అసలు నిద్ర పట్టలేదు అమ్మ.. రేపు ఈ పాటికి నా కల తీరిపోతుంది అమ్మ.. నాకు చాలా సంతోసంగా ఉంది తెలుసా..? అని రామ్మూర్తి చెప్పగానే.. అవును నాన్న నాకు కూడా ఎన్నో రోజుల తర్వాత మన ఊరు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని మిస్సమ్మ చెప్తుంది.

Advertisement

తర్వాత అందరూ బయలుదేరి వెళ్తుంటారు. కార్లలో వెళ్తున్న మిస్సమ్మ వాళ్లను మధ్యలో అడ్డగించి అటాక్‌ చేయాలని రణవీర్‌ ఏర్పాటు చేసిన రౌడీలు కాపు కాస్తుంటారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెడతారు. రోడ్డు పనులు జరుగుతున్నాయి డైవర్షన్‌ తీసుకోండని బోర్డు పెడతారు. ఇంతలో అక్కడకు వచ్చిన మిస్సమ్మ వాళ్లు కార్లు ఆపి ఆయోమయంగా చూస్తుంటారు. రౌడీలు చెట్ల చాటు నుంచి అంతా గమనిస్తుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

Big Stories

Advertisement
×