BigTV English

Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మకు దూరం అయిన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మకు దూరం అయిన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today Episode :  అమర్‌ నువ్వు మారి మిస్సమ్మతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టు అని శివరాం చెప్పడంతో.. అమర్‌ ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మిస్సమ్మను తదేకంగా చూస్తుండిపోతాడు అమర్‌. అమ్ము వాళ్లకు ఆరు ఫోటోను మిస్సమ్మ కాలి కింద వేసి తొక్కిందని చెప్తుంది అంజు. మిస్సమ్మ అలాంటిది కాదని మేము నమ్మమని నువ్వే కావాలని మిస్సమ్మ మీద కోపంతో అలా చెప్తున్నావని అంటారు అమ్ము, ఆకాష్‌, ఆనంద్‌. అమ్మ విషయంలో నేను అబద్దం చెప్తానా..? అంటుంది అంజు. కానీ నువ్వు.. తప్పు చేసింది అని చెప్తుంది మిస్సమ్మ గురించి అందుకే మాకు నమ్మకం కుదరడంలేదు అంటాడు ఆనంద్‌.


అవును అంజు మిస్సమ్మకు అమ్మ స్థానం కావాలంటే ఎంతసేపు అంటాడ ఆకాష్‌. దీంతో మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదే అంటుంది అంజు. దీంతో అమ్ము కోపంగా మిస్సమ్మ ఫోటో కింద పడేసి తొక్కడం నువ్వు చూశావా..? అని అడుగుతుంది. అవునని అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకెళ్ళడం నేను చూశాను. కింద పడేసి తొక్కడం మనోహరి ఆంటీ చూసింది అని అంజు చెప్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మనోహరి ఎవరూ ఎవరూ నమ్మరని ముందే చెప్పానా..? అంటూ మిస్సమ్మ ఆ ఫోటో తొక్కడం నేను చూశాను అంటుంది. మనోహరి మాటలకు పిల్లలు షాక్‌ అవుతారు. దీంతో మనోహరి మరింత రెచ్చిపోయి మిస్సమ్మ మీద మరింత చాడీలు చెప్తుంది.

ఇంతలో అక్కడకు వచ్చిన మిస్సమ్మ పిల్లల్ని స్కూల్‌ కు టైం అవుతుంది త్వరగా రెడీ అవ్వండని చెప్తుంది. దీంతో అమ్ము డైరుక్టుగా  మిస్సమ్మ నిన్న మా రూంలో నుంచి ఫోటోను తీసుకెళ్లావా..? అని అడుగుతుంది. దీంతో అవునని మిస్సమ్మ చెప్పడంతో అంజు కోపంగా అలా తీసుకెళ్లడం తప్పు అనిపించలేదా? మిస్సమ్మ అని అడుగుతుంది. ఇందులో తప్పేముంది. ఆ ఫోటో గురించి అడుగుదామని తీసుకొచ్చాను. తర్వాత అది ఎక్కడ ఉండాలో అక్కడకు చేర్చాను. ఎందుకు అలా అడిగారు అంటుంది మిస్సమ్మ. ఇంతలో మనోహరి కలగజేసుకుని ఏం లేదులే.. నువ్వు వెళ్లు మిస్సమ్మ పిల్లలను నేను తీసుకొస్తాను అని చెప్తుంది. మిస్సమ్మ వెళ్లిపోతుంది. చూశారా..? పిల్లలు.. జరిగింది ఎవరికి తెలియదు అని ఎలా మాట్లాడుతుందో ఇక మీరు ఎవరి పక్కన ఉంటారో మీ ఇష్టం అని మనోహరి వెళ్లిపోతుంది.


మనోహరి తన ప్లాన్‌ ప్రకారం పిల్లలను అడ్డుపెట్టుకుని ఏదో చేయబోతుందని గుప్త దగ్గర ఆరు బాధపడుతుంది. ఇంతలో అమర్‌ ఆఫీసుకు వెళ్తుంటే ఆరు వెళ్లి పలకరిస్తుంది. కారు దగ్గరకు వచ్చిన అమర్‌ తూలి కిందపడబోతుంటే.. ఏమైంది సార్‌.. అని అడుగుతాడు. దీంతో అమర్‌  ఏం కాలేదు రాథోడ్‌.. చూసుకోలేదు అంటాడు. మీరు చూసుకోకుండా నడుస్తున్నారా..? ఏమైంది సార్‌ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని అడగ్గానే  నా గురించి మిస్సమ్మ గురించి మా ప్రమేయం లేకుండా మా మధ్య ముడిపడిన బంధం గురించి. నేను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి ఆలోచిస్తున్నాను రాథోడ్‌ అంటాడు అమర్‌.

దీంతో అసలు ఏమైంది సార్‌ అంటూ రాథోడ్‌ అడగ్గానే తన తండ్రి శివరాం.. మిస్సమ్మ గురించి చెప్పిన మాటలు రాథోడ్‌ కు చెప్తాడు. అమర్‌.  అయితే శివరాం చెప్పింది కరెక్టేనని.. పాపం మిస్సమ్మ పెళ్లి అయిన రోజు నుంచి మీ బదులు కూడా తనే పరుగెడుతుంది.. అంటూ రాథోడ్ చెప్పగానే కానీ రాథోడ్‌… మిస్సమ్మ ఎవరో తెలిశాక మంచి జీవితం ఇవ్వాలనిపిస్తుంది కానీ.. తనతో జీవితం పంచుకోవాలని ఎలా అనుకోవాలో తెలియటం లేదు అంటాడు అమర్‌. దూరం నుంచి గమనిస్తున్న గుప్త వెంటనే తేరుకుని అమర్‌.. ఆరు, మిస్సమ్మ అక్కాచెల్లెల్లు అన్న విషయం చెప్తాడేమో ఆరు వింటుందేమో అనుకుని ఆరును అక్కడి నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఆరు వెళ్లదు. వాళ్లు ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు విన్నాకే వస్తానని చెప్తుంది.

ఆరును దాటి జీవితాన్ని చూసుకోలేకపోతుంటే ఇప్పుడు అదే జీవితాన్ని మిస్సమ్మ తో పంచుకోవాలంటే ఎలా రాథోడ్‌ అంటూ అమర్‌ ఎమోషనల్‌ అవుతాడు. దీంతో మీ బాధ నాకు అర్తం అయింది సార్‌. కానీ మేడం గారు ఏ లోకంలో ఉన్నా నిజం తెలియగానే ఇదే కోరుకునే వారు సార్‌. అన్ని తెలిసి..  నిజం కూడా తెలిశాక చెప్తున్నాను సార్‌. మేడం గారి తర్వాత ఈ ఇంటికి కోడలుగా, మీకు భార్యగా ఉండే హక్కు ఒక్క మిస్సమ్మకే ఉంది సార్‌ అని రాథోడ్‌ చెప్తుండగానే మిస్సమ్మ పిల్లలను తీసుకుని బయటకు వస్తుంది. వాళ్లను చూసిన అమర్‌, రాథోడ్‌ తమ మాటలు ఆపేస్తారు. పిల్లలు మిస్సమ్మతో మాట్లాడకుండా స్కూల్‌ కు  వెళ్లిపోతారు.

అందరూ వెళ్లిపోయాక మిస్సమ్మ.. మనోహరిని కోపంగా పలిచి పిల్లల రూంలోకి వెళ్లి వాళ్లకు ఏం చెప్పావు అని నిలదీస్తుంది. నువ్వు వాళ్లతో మట్లాడాకే వాళ్లు నన్ను అదో రకంగా చూస్తున్నారు. అసలు నాతో మాట్లాడకుండావ వెళ్లిపోయారు. ఇంతకీ నువ్వు వాళ్లకు ఏం చెప్పావు అని ప్రశ్నిస్తుంది. దీంతో మనోహరి కోపంగా అమర్‌ కు భార్యవు అయిపోయినంత మాత్రానా.. నీకు మాత్రమే హక్కు ఉన్నట్లు మాట్లాడొద్దని వాళ్లు నా ఫ్రెండ్ పిల్లలు నాకు హక్కు ఉందని వెళ్లిపోతుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big Stories

×