E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  

Nindu Noorella Saavasam Serial Today Episode October 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పార్థు బతికే ఉన్నాడా..?  వైజయంతి మాటల్లో నిజమెంత..?  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమంలో మనోహరికి చుక్కలు చూపిస్తుంటారు సరస్వతి, రాజు. గొడవపడిన అమర్‌, మిస్సమ్మలను కలిపేందుకు పిల్లలు రాథోడ్‌ హెల్ప్‌ అడుగుతారు. కథ ఇలా సాగుతుండగానే.. వైజయంతి నిజం చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆ నిజం ఏంటి..? కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఇవాళ్టీ ఏపిసోడ్‌లో తెలుసుకుందాం.

అమర్‌ ఇంట్లో క్లీన్‌ చేస్తున్న యాదమ్మ పార్థు ఫోటోకు ఉన్న దండ కింద పడిపోవడం చూసి మళ్లీ వేయడానికి వెళ్తుంది. ఎంత ట్రై చేసినా దండ ఫోటోకు ఉండకుండా కింద పడిపోతుంది. అది చూసిన మిస్సమ్మ  ఏమైంది యాదమ్మ అని అడిగితే.. దండ ఎన్నిసార్లు వేసినా పడిపోతుంది మేడం అని యాదమ్మ చెప్పగానే.. మిస్సమ్మ  రాథోడ్‌ను పిలిచి దండ ఊడిపోకుండా గట్టిగా వేయమని చెప్తుంది. రాథోడ్‌ దండ వేయడానికి వెళ్తుంటే..

Advertisement

ఇక ఆ ఫోటోకు దండ వేయోద్దు రాథోడ్‌. అలాగే ఆ ఫోటోను అక్కడి నుంచి తీసేయ్‌ అంటూ వస్తుంది వైజయంతి. అదేంటి అంటూ అందరూ షాకింగ్‌గా చూస్తుంటే.. అమర్‌ వచ్చి ఏంటి మేడం మీరు ఫోటో ఎందుకు తీసేయాలి అని అడిగితే.. బతికి ఉన్న వాళ్ల ఫోటోలు చనిపోయిన వారి ఫోటోల పక్కన పెట్టకూడదు అమర్‌. అందుకే దండ వద్దన్నాను.. ఫోటోనే తీసేయమన్నాను అంటుంది. వైజయంతి పార్థు బతికే ఉన్నాడని చెప్తుంది. రాథోడ్‌, మిస్సమ్మ, అమర్‌ సంతోషంతో ఉప్పొంగిపోతారు. యాదమ్మ మాత్రం భయంతో వణికిపోతుంది.

కట్‌ చేస్తే యమలోకంలో విచిత్రగుప్తుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. నారదుడు వెళ్లి ఏంటి విచిత్రగుప్త అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగితే. విచిత్రగుప్తుడు బాధగా నా సోదరి అరుందతి కనిపించం లేదు. పార్థు, మనోహరి ల పెళ్లి చేశాక తాను ఎక్కడికి వెళ్లిందో ఏంటో..? పార్థు మరణించిన విషయం కూడా తనకు తెలియదు.. అయినా ఆ పార్థు మరణంలో నాకు భాగం ఉంది మహర్షి అంటూ విచిత్రగుప్తుడు చెప్పగానే.. అయ్యో విచిత్రగుప్త ఇంకా ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ పార్థు మరణించలేదు.. బతికే ఉన్నాడు అంటూ మాయా పేటికలో పార్థు ఉన్న ప్లేస్‌ చూపిస్తాడు నారదుడు.

Advertisement

పార్థు బాడీ అంతా దెబ్బలతో స్పృహ కోల్పోయి ఉంటాడు. కొంతమంది పార్థు చుట్టూ నిలబడి పసరు వైద్యం చేస్తుంటారు. అది చూసి విచిత్రగుప్తుడు హ్యాపీగా ఫీలవుతాడు. మరి భవిష్యవాణిలో పార్థు చనిపోతాడు అని రాసి ఉంది కదా అని అనుమానంగా అడిగితే. అదే విధి లిఖితం. ఒక్కోసారి విధి అలా మారిపోతూ ఉంటుంది. పార్థు విషయంలో కూడా అదే జరిగింది అంటూ నారదుడు చెప్పగానే.. విచిత్రగుప్తుడు హ్యాపీగా ఫీలవుతాడు.

పార్థు ఫోటో తన చేతుల్లోకి తీసుకుని వైజయంతి ఫోటోను తడుముతూ నా నమ్మకమే నిజం అయింది అంటే అమర్‌ మాత్రం అపనమ్మకంగానే.. ఏంటి మేడం మీరు చెప్పేది. పార్థు బతికే ఉన్నాడా..? అవును అమర్‌ బతికే ఉన్నాడు. పార్థు బతికే ఉండాలన్న నా ఆశ నిజమైంది. నా తమ్ముడు నన్ను వదిలి పోలేదు.. తిరిగి వస్తాను అక్కా అంటూ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అంటూ వైజయంతి చెప్తుంటే..

మిస్సమ్మ కూడా నమ్మశక్యం కానట్టుగా ఆరోజు పోలీసులు మొత్తం వెతికి చనిపోయి ఉంటాడని నిర్దారించారు కదా మేడం అంటూ అడిగితే.. ఆరోజు పోలీసులు కొద్ది దూరం వరకే వెతికారు. తర్వాత నేను రిస్య్కూ టీంను పంపించి లోయ చివరి వరకు వెతికించాను.. ఎక్కడా పార్థు భాడీ కానీ మరే అనుమానాస్పద వస్తువులు కానీ దొరకలేదు. అంటే పార్థు బతికే ఉన్నాడని అర్థం అంటూ వైజయంతి చెప్తుంటే..  యాదమ్మ భయంగా చూస్తుంది. వెంటనే  ఈ విషయం మనోహరికి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Godavari Janu : జాను నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Friday Movies : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

తెలంగాణ యాంకర్ల పారితోషికం ఎంతో తెలుసా? ఒక్కొక్కరు ఎంత సంపాదిస్తున్నారంటే!

లైవ్ లో మెగా హీరోకి ప్రపోజ్ చేసిన శ్రీముఖి!

ముఖేష్ పర్సనల్ ఎటాక్.. కన్నీళ్లు పెట్టుకున్న శివ!

బల ప్రదర్శన.. కళ్ళు తిరిగి పడిపోయిన వర్షిణి!

రీఎంట్రీలో మరింత జోరు పెంచిన షాలిని.. ఆ నోటికి హద్దు అదుపు లేదా?

Big Stories

Advertisement
×