Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థు బతికే ఉన్నాడన్న విషయం మాయాపేటికలో చూసిన గుప్త హ్యాపీగా ఫీలవుతాడు. అయితే పార్థుకు గతం గుర్తు లేదన్న నిజం తెలుసుకుని బాధపడతాడు. అరుంధతి చావు విషయంలో నిజం తెలుసుకోవాలనుకున్న అమర్‌కు ఇలాగే జరిగింది. ఇప్పుడు పార్థుకు కూడా ఇలాగే జరిగింది. అసలు ఆ దుష్ట బాలిక ఆగడాలకు అంతే లేదా మహర్షి అని గుప్త, నారదుడిని అడిగితే దేనికైనా సమయం రావాలి విచిత్రగుప్త ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి..? అంటాడు నారదుడు.
పార్థు బతికే ఉన్నాడన్న నిజం వైజయంతి చెప్పడంతో యాదమ్మ షాక్ అవుతుంది. ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలని మనసులో అనుకుంటుంది. పార్థు గురించి చెప్పిన తర్వాత వైజయంతి ఆఫీసులో ఏదో పనుంది వెళ్లిపోతుంది. అందరూ తమ పనుల్లో ఉంటే.. యాదమ్మ మెల్లగా ఇంట్లోంచి వెళ్లిపోతుంది. నేరుగా మనోహరి ఉన్న ఆశ్రమం దగ్గరకు వెళ్లి మనోహరిని కలుస్తుంది. ఏంటి చంభా మళ్లీ వచ్చావు అని మనోహరి అడిగితే.. నీకో నిజం చెప్పాలని వచ్చాను మనోహరి అని యాదమ్మ అంటే ఏంటో ఫోన్ చేయోచ్చు కదా అది చెప్పడానికి నువ్వు ఇంత దూరం రావాలా..? అంటూ మనోహరి ఇరిటేట్ ఫీల్ అయితే.. యాదమ్మ కోపంగా అది నేరుగా చెప్పాలని వచ్చాను మనోహరి.. అంటూ యాదమ్మ నాన్చుతుంటే.. ఏంటో చెప్పు చంభా అంటూ మనోహరి అడుగుతుంది.
అదే పార్థు గురించి పార్థు చనిపోలేదట.. బతికే ఉన్నాడట.. అని యాదమ్మ చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు చంభా అని మనోహరి అడిగితే అవును మనోహరి పార్థు సార్ చనిపోలేదని స్వయంగా ఆ వైజయంతి మేడమే చెప్పారు.. అనగానే.. మనోహరి కాళ్ల కింద భూమి కంపించినట్టు ఫీలవుతుంది. అంతలోనే తేరుకుని నేను ప్లాన్ చేసి చంపేస్తే ఇప్పటిదాకా బతికిన వారే లేరు చంభా అంటే ఏమో ఈ పార్థుకు భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయేమో.. అయినా నువ్వు ప్లాన్ చేసిన చంపాలనుకున్న అమర్ సార్ బతికే ఉన్నారు కదా అలాగే ఈ పార్థు కూడా బతికే ఉండొచ్చు కదా అంటుంది యాదమ్మ.
కానీ ఆ వైజయంతి ఏదైనా నాటకం ఆడుతుందేమో అని మనోహరి అనుమానిస్తే.. నాటకం ఆడాల్సిన అవసరం ఆమెకెందుకు ఉంటుంది. ఇది స్వయంగా తాను తమ్ముడిగా చూసుకునే పార్థు కేసు ఆమె అలాంటి నాటకాలేం ఆడదు మనోహరి. పార్థు కోసం అక్కడ పోలీసులు వెతుకుతున్నారట. ఏ క్షణంలోనైనా పార్థు రావొచ్చు నువ్వు జైలుకు పోవచ్చు అంటూ బెదిరిస్తుది యాదమ్మ. అందుకు మనోహరి కోపంగా చంభాను తిడుతుంది. పార్థు తిరిగి వస్తే జరిగేది అదే కదా మనోహరి అందుకే చెప్తున్నాను ఎక్కడికైనా పారిపో అంటూ సలహా ఇస్తుంది.
కానీ మనోహరి కోపంగా నేను ఎక్కడికి వెళ్లను పార్థు తిరిగి వచ్చే లోపు భాగీని తప్పించి నేను అమర్‌ను పెళ్లి చేసుకోవాలి. ముందు నేను ఆ ఇంటికి రావాలి.. అందుకోసం నువ్వు నేను చెప్పినట్టు చేయ్ చంభా అంటుంది మనోహరి.. ఏం చేయాలో చెప్పమని చంభా అడిగితే.. ఇంట్లో అంజుకు జ్వరం కానీ కడుపునొప్పి కానీ వచ్చేలా చేయ్ అప్పుడు అది అడ్డు పెట్టుకుని నేను ఇంటికి వస్తాను అని చెప్తుంది మనోహరి. యాదమ్మ సరే అంటూ వెళ్లిపోతుంది.
కట్ చేస్తే ఇంట్లో ఉన్న అంజు మిగతా పిల్లలతో ఇవాళ తాము స్కూల్‌కు వెళ్లకుండా అమర్, మిస్సమ్మలను కలపాలి అని చెప్తుంది. స్కూల్‌కు ఎందకు వెళ్లలేదని ఇంట్లో వాళ్లు అడిగితే ఏం చెబుదాం అని ఆనంద్, ఆకాష్ అడిగితే.. తనకు జ్వరం వచ్చిందని చెప్తానని.. నాకు తోడుగా మీరు ఇంట్లోనే ఉండాలని నేనే అడుగుతాను అని అంజు చెప్తుంది. అందుకు పిల్లలు ఓకే అంటారు. ఇక ఇంట్లో ఉండి ఏం చేయాలనేది పిల్లలు ప్లాన్ చేస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.