E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 26th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కోసం అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి     

Nindu Noorella Saavasam Serial Today Episode October 26th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు కోసం అమర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి     
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఏదో ఒక వంకతో అమర్‌ ఇంటికి వెళ్లాలని ఎదురుచూస్తున్న మనోహరికి చంభా ఫోన్‌ చేసి అంజుకు జ్వరం వచ్చింది. నీకు ఇదే మంచి చాన్స్‌ అంజును చూసే నెపంతో నువ్వు ఇంటికి రావొచ్చు అని చెప్తుంది. మనోహరి చాలా సంతోషంగా అవునా ఎప్పుడు వచ్చింది జ్వరం అని అడిగితే.. ఇప్పుడే వచ్చిందట.. పిల్లలు ఎవ్వరూ కూడా స్కూల్ కు వెళ్లలేదు మనోహరి నువ్వు త్వరగా వచ్చేయ్‌ అని చెప్తుంది. మనోహరి ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

రాథోడ్‌ డోర్‌ దగ్గర నిలబడి ఫోన్‌ మాట్లాడుతుంటాడు. కిచెన్‌లో కూరగాయలు కట్‌ చేస్తూ.. డోర్‌ వైపు చూస్తుటుంది చంభా.. మనోహరి ఇంకా రాలేదేంటి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే మనోహరి గట్టిగా అంజు అంటూ పరుగెత్తుకుంటూ వస్తుంది. మనోహరిని గమనించిన చంభా ఎంటర్‌ ది డ్రాగన్‌ అని మనసులో అనుకుంటుంది. ఇంట్లోకి పరుగెత్తుకుంటూ అంజు అంజు అంటూ వస్తున్న మనోహరిని ఆపేసి ఏంటండి ఇలా వచ్చారు అని రాథోడ్‌ పలకరిస్తాడు. మనోహరి టెన్షన్‌ పడుతున్నట్టు నటిస్తూ.. అంజు ఎక్కడ ఉంది..? చెప్పు రాథోడ్‌ అంజు ఎక్కడ అని అడగ్గానే.. రాథోడ్‌ కూడా కంగారులో ఏంటి అంజు మీ కూతురు అన్న నిజం తెలిసిపోయిందా కొంపదీసి అంటాడు. మనోహరి, చంభా షాక్‌ అవుతారు. రాథోడ్‌ నాలుక కరుచుకుంటాడు. మనోహరి డౌటుగా ఇప్పుడు ఏమన్నావు రాథోడ్‌.. మళ్లీ చెప్పు అంటే.. ఏమన్నాననండి.. ఏదో అంజు మీ కూతురు అయినట్టు అలా పరుగెత్తుకుంటూ వస్తున్నారు అన్నాను.. అంటూ రాథోడ్‌ మాట మారుస్తాడు.

Advertisement

మనోహరి డౌటుగానే.. నువ్వు అదే మీనింగ్‌తో అన్నావా..? నాకు వేరేలా వినిపించింది అంటే.. వేరే లేదు ఏం లేదండి.. చెప్పండి మీరు ఎందుకు వచ్చారు అంటూ రాథోడ్‌ అడుగుతుండగానే.. అమర్‌, మిస్సమ్మ వస్తారు. మనోహరిని ఎప్పుడొచ్చావని అమర్‌ అడిగితే.. ఇప్పుడే వచ్చాను అమర్. అంజుకు అలా అయిందని తెలిసి కంగారుగా పరుగెత్తుకొచ్చాను అంటుంది. అమర్‌ కూడా అంజుకు ఏమైంది అని అడిగితే.. జ్వరం వచ్చింది స్కూల్‌కు వెళ్లలేదు.. మిగతా పిల్లలు కూడా స్కూల్‌కు వెళ్లలేదు అని మిస్సమ్మ చెబితే.. అమర్‌ కోపంగా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగితే.. మిస్సమ్మ మనిద్దరికి మాటలు లేవు కదా అంటుంది. అమర్‌ కోపంగా ఏంటి రాథోడ్‌ ఎందుకు చెప్పలేదు నాకు అని అడిగితే.. చిన్న జ్వరమే సార్‌ ఓ గంటలో తగ్గిపోతుంది అంటాడు. చిన్నదైనా పెద్దదైనా అంజును నేను చూడాలి ఎక్కడుంది అంజు అని మనోహరి అడిగితే.. పైన రూంలో ఉందండి చూడుపోండి అంటాడు రాథోడ్‌. వెంటనే మనోహరి పైకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అమర్‌ కూడా పైకి వెళ్తాడు.

మిస్సమ్మ కోపంగా రాథోడ్‌ను చూస్తూ.. ఏంటి రాథోడ్‌ నువ్వు కూడా డ్రామాలు ఆడుతున్నావా..? అని అడిగితే.. నేను డ్రామాలాడటం ఏంటి మిస్సమ్మ అంటాడు. మరి ఇందాక నాతో ఏమన్నావు ఫుల్‌ ఫీవర్‌ అన్నావు.. ఇప్పుడేమో చిన్న జ్వరం అంటున్నావు అంటూ మిస్సమ్మ ప్రశ్నిస్తే.. అంజు అలా చెప్పమంది మిస్సమ్మ అంటూ రాథోడ్‌ చెప్పగానే.. మిస్సమ్మ అనుమానంగా చూస్తూ.. చెప్పమంది అంటే.. ఏంటి..? అంజుకు జ్వరం రాలేదా..? అని అడుగుతుంది. అవునని మిమ్మల్ని సార్‌ను కలపడానికి పిల్లలు ఇవాళ ఇంట్లోనే ఉండటానికి ఈ జ్వరం నాటకం ఆడుతున్నారు అని రాథోడ్‌ చెప్పగానే. అయితే వాళ్లకు నువ్వు సపోర్టుగా ఉన్నావన్నమాట అవును అంజుకు జ్వరం వచ్చిందన్న విషయం ఇంట్లోనే ఉన్న ఆయనకు తెలియదు.. కానీ ఎక్కడో ఆశ్రమంలో ఉన్న మనోహరికి ఎలా తెలిసింది అంటూ మిస్సమ్మ అనుమానంగా అడిగితే..

Advertisement

ఇంట్లో మనోహరికి గూడచారి ఉంది కదా మిస్సమ్మ. ఆ గూడచారే చెప్పి ఉంటుంది అంటాడు. వెంటనే మిస్సమ్మ, యాదమ్మ ఇటు రా అంటూ పిలుస్తుంది. ఏంటి మేడం అంటూ వెళ్లిన యాదమ్మను అంజుకు జ్వరం వచ్చిన విషయం మనోహరికి నువ్వు ఫోన్‌ చేసి చెప్పావా..? అని అడిగితే.. యాదమ్మ లేదు మేడం.. నాకు చాలా పనులు ఉన్నాయి. పైగా నా ఫోన్‌లో చార్జింగ్‌ లేదు.. రిచార్జ్‌ కూడా చేయించలేదు అంటూ అతి వినయంగా చెప్తుంది యాదమ్మ. మిస్సమ్మ కోపంగా చూస్తూ.. చూశావా రాథోడ్‌ ఎంత నాటకాలు ఆడుతుంది అంటే.. ఈ నాటకం ఏం చూశావా..? మిస్సమ్మ పైన మనోహరి గారి అసలైన నాటకం మొదలవుతుంద అది చూడు దిమ్మ తిరిగిపోవడం కాయం అంటాడు. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని పైకి వెళ్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu illaalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్కటి అవుట్…

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..

అవమానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.. రాము రాథోడ్ లైఫ్ స్టోరీ

తనూజ, రీతు, డెమోన్‌లపై రాము రాథోడ్ సంచలన కామెంట్స్!

ఇదేక్కడి లాజిక్ రా మామా.. బ్రేకప్ అయితే కంగ్రాట్స్ అంటున్న రాము రాథోడ్!

కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!

Big Stories

Advertisement
×