Telugu TV Serials : తెలుగు ప్రేక్షకులను సీరియల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొద్ది రోజులుగా కొత్త సీరియల్స్ ఎన్ని వస్తున్నా సరే.. పాత సీరియల్స్ కన్నా డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ ప్రేక్షకులనే విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటుగా మంచి టిఆర్పి రేటింగ్ ని కూడా నమోదు చేసుకుంది. ప్రతివారం సినిమాలకి బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అదేవిధంగా సీరియల్స్ కి కూడా టిఆర్పి రేటింగ్ రిజల్ట్స్ అనేది ప్రతివారం ఉంటాయి. మరి ఈ వారం జీ సీరియల్ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది ఆ సీరియల్ రేటింగ్ ఎంతో ఉంటుంది. అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ సీరియల్లో పొదిరిలో సీరియల్ మంచి రేటింగ్ ని ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ వస్తుంది. ఒకప్పుడు కొత్త సీరియల్స్ వచ్చినప్పుడు పాత సీరియల్స్ కి డిమాండ్ తగ్గేది. కానీ కొత్త సీరియల్స్ కన్నా ఈ సీరియల్ కి ఎక్కడ డిమాండ్ తగ్గలేదు. అయితే ‘పొదిరిల్లు’ సీరియల్ కూడా ఈవారం మంచి టీఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం ఈ సీరియల్ మంచి రేటింగ్ నమోదు చేసుకోవడంతో పాటుగా స్టోరీలు అనేక ట్విస్టులు కూడా ఏర్పడడంతో సీరియల్ కి శుభం కార్డు పడబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిశనేంత ఉందో కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ వారం ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం..
ప్రముఖ ఛానెల్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.73 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.50 ఉంది. పొదరిల్లు 11. 65, ఇంటింటి రామాయణం 11.64, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.57, నువ్వులేక నేను లేను10.60, నిండు మనసులు 9.30, చిన్ని 8.23, బ్రహ్మముడి 8.27.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి..
Also Read :సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని మస్ట్ వాచ్..