E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజుకు లాకెట్‌ ఇచ్చిన అమర్‌ – ఇంట్లోంచి ఎస్కేప్‌ అయ్యేందుకు మనోహరి ప్లాన్‌

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజుకు లాకెట్‌ ఇచ్చిన అమర్‌ – ఇంట్లోంచి ఎస్కేప్‌ అయ్యేందుకు మనోహరి ప్లాన్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి టెన్షన్‌ పడుతూ కలకత్తా నుంచి బాబ్జీ ఇంకా ఫోన్‌ చేయలేదని ఎదురుచూస్తుంది. ఇంతలో బాబ్జీ ఫోన్‌ చేస్తాడు. మేడం నువ్వు చెప్పినట్లే ఇక్కడ ఆశ్రమంలో దుర్గ గురించి అడిగితే ఏవరూ కూడా తెలియదంటున్నారు. నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నారని.. మీరు చెప్పిన రోజు ఎటువంటి అమ్మాయి ఇక్కడకు రాలేదంట అని బాబ్జి చెప్పగానే మనోహరి దుర్గ మెడలో కాళికా మాత లాకెట్‌ ఉంటుందని చెప్తుంది. అప్పటికే సిగ్నల్ సరిగ్గా లేక మనోహరి చెప్పింది బాబ్జికి వినిపించదు. దీంతో మనోహరి ఫోన్‌ చేక్‌ చేసుకుంటుంది. ఫోన్‌ సిగ్నల్‌ లేకపోవడంతో బయటకు వెళ్తుంది మనోహరి.

మనోహరిని ఆపిన సెక్యూరిటీ

Advertisement

సిగ్నల్‌ కోసం ఫోన్‌ పట్టుకుని గేటు దగ్గరకు వెళ్లిన మనోహరిని అక్కడి సెక్యూరిటీ వాళ్లు ఆపేస్తారు. దీంతో మనోహరి సీరియస్‌ గా  మిమ్మల్ని పర్మిషన్‌ ఎవరు అడిగారు. ఇది నా ఇల్లు ఇష్టం వచ్చినప్పుడు వస్తా.. ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. అడగడానికి ఆపడానికి మీరెవరు అంటూ నిలదీస్తుంది. దీంతో సెక్యూరిటీ వాళ్లు అమరేంద్ర సార్‌ చెప్పారు మేడం సార్‌ పర్మిషన్‌ లేకుండా ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎవరూ లోపలికి రాకూడదు. అని చెప్పడంతో మనోహరి తాను అర్జెంట్‌ గా ఫోన్‌  మాట్లాడాలని  ఇక్కడ సిగ్నల్‌ రావడం లేదని చెప్పడంతో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా సిగ్నల్ రాదు మేడం మేమే జామర్‌ ఆన్‌ చేశామని సెక్యూరిటీ చెప్తాడు. ఇంతలో రాథోడ్‌ వచ్చి  మనోహరికి నిజం చెప్పి  వాళ్లు మీ ప్రాణాలు కాపాడటానికే ఉన్నారు. మీరు లోపలికి వెళ్లండి అని చెప్పాగానే మనోహరి సరే అంటుంది.

మిస్సమ్మకు ఝలక్‌ ఇచ్చిన అంజు

Advertisement

 మరోవైపు లోపల పిల్లలు హ్యాపీగా మాట్లాడుకుంటూ.. సరదాగా గొడవ పడుతుంటారు. అమర్‌, అంజును చూసి  తను దొరికిన విషయం గుర్తు చేసుకుని వెళ్లిపోతాడు. తలుపు చాటు నుంచి చూసిన ఆరు, అమర్‌ ఎందుకు డల్‌ గా ఉన్నాడు అని ఆలోచిస్తుంది.  అమర్‌ అంజు చిన్నప్పటి చైన్‌ తీసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు కింద పిల్లలు అల్లరి చేస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ బౌల్‌ తీసుకుని రావడంతో పిల్లలు తగలడంతో కిందపడబోయే బ్యాలెన్స్‌ గా నిలబడుతుంది. మిస్సమ్మను పిల్లలందరూ మెచ్చుకుంటారు. భలేగా బ్యాలెన్స్‌ చేశావని పొగుడుతుంటారు. ఇంతలో అంజు  అంతలా మురిసిపోకమ్మా మిస్సమ్మ. నువ్వు జస్ట్‌ బౌల్‌ ను సేవ్‌ చేశావు అంతే. అదే నేను స్కూల్‌ లో ఎంతమంది పిల్లలను సేవ్‌ చేశానో నువ్వే చూశావు కదా? ఏదో పెద్ద  ఘనకార్యం చేసినట్టు బిల్డప్‌ ఇస్తున్నావు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.

Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజలి కోసం మందు మానేసిన రణవీర్‌ – అమర్‌ ఇంట్లో బాంబు పేలుస్తానన్న అరవింద్‌

అంజుకు లాకెట్‌ ఇచ్చిన అమర్‌

ఇంతలో అమర్‌ వచ్చి అంజుకు కాలికా దేవి లాకెట్‌ ను గిఫ్ట్‌ గా ఇస్తాడు. దీంతో శివరాం. అంజలికి ఒక్కదానికే తెచ్చావు మరి మిగతా ముగ్గురికి తేలేదు ఎందుకు అని అడగ్గానే అంజలి.. తాతయ్య మెడల్స్‌, అవార్డ్స్‌ , రివార్డ్స్‌ ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు. నాలాంటి విన్నర్స్‌ కే ఇస్తారు. అని చెప్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోతుంటే ఆగండి అని గట్టిగా అరుస్తుంది అంజలి. నేను ప్రాణాలకు తెగించి పిల్లల్ని,  మా స్కూల్‌ ని  కాపాడాను.  అందుకే కదా డాడ్‌ నాకు ఈ మెడల్‌ ఇచ్చింది. అంటూ అంజలి అడగ్గానే అమర్‌ అవునని తలూపుతాడు. దీంతో అంజలి గర్వంగా తానో సెలబ్రిటీలాగా అందరూ నాతో ఫోటో తీసుకోండని మిస్సమ్మను ఫోటోలు తీయమని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఫోటోలు తీస్తుంటే అంజు ఒకరి తర్వాత ఒకరితో ఫోటోలు దిగుతుంది.

గణపతి విగ్రహం తాను తీసుకొస్తానన్న మనోహరి

లాకెట్‌ చూడకుండా వెళ్లిపోయిన మనోహరిఇంతలో మనోహరి లోపలికి రాగానే అంజు.. మనోహరి ఆంటీ నేను స్కుల్ ను కాపాడానని  మా డాడీ నాకు  లాకెట్‌ గిఫ్ట్‌ గా ఇచ్చారు. చూడండి ఎలా ఉందో..  అని డ్రస్‌ లోంచి బయటకు తీస్తుంటే..  విసుగ్గా మనోహరి ఏమీ వద్దులే అంజు. అమర్‌ సెలక్షన్‌ చేశాడంటే చాలా బాగుంటుంది అని చెప్తుంది. ఇంతలో అమర్‌ నేను వెళ్లి గణపతి విగ్రహం తీసుకొస్తాను. మీరంతా రెడీగా ఉండండి పూజ చేద్దాం అంటాడు. అందరూ సరే అంటారు.

ఎమోషనల్‌ అయిన రణవీర్‌

మరోవైపు అమర్‌ ఇంటికి రావడానికి రణవీర్‌ చాలా బాగా  రెడీ అవుతాడు. లాయరు చూసి చాలా రోజుల తర్వాత నీలో పాత రణవీర్‌ కనిపిస్తున్నాడు అని అంటాడు. పక్కనే ఉన్న తన కూతురు దుర్గ ఫోటో తీసుకుని తన్మయంత్వంతో ఎమోషన్‌ అవుతుంటాడు. మరోవైపు విగ్రహం కోసం ఇంట్లోంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతున్న అమర్‌ దగ్గరకు మనోహరి వస్తుంది. మనకు, మన ఇంటికి  థ్రెట్‌ ఉందని నాకు తెలుసింది అమర్‌. అందుకే నువ్వు బయటకు వెళ్లొద్దు అని చెప్తుంది.  నువ్వు బయటకు వెళితే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అందుకే నువ్వు ఇక్కడే ఉంటే నేను వెళ్లి విగ్రహం తీసుకొస్తానని బయటకు చెప్తుంది. కానీ మనసు లోపల మాత్రం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటుంది మనోహరి. ఇంతటితో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఎపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×