E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజలి కోసం మందు మానేసిన రణవీర్‌ – అమర్‌ ఇంట్లో బాంబు పేలుస్తానన్న అరవింద్‌

Nindu Noorella Saavasam Serial Today September 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజలి కోసం మందు మానేసిన రణవీర్‌ – అమర్‌ ఇంట్లో బాంబు పేలుస్తానన్న అరవింద్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజలి, మనోహరిని రణవీర్‌ ఫోన్‌ నెంబర్‌ అడగడంతో లేదని చెప్తుంది. దీంతో అంజలి రాథోడ్‌ దగ్గరకు వెళ్లి రణవీర్‌ అంకుల్‌ నెంబర్‌ ఇవ్వమని అడుగుతుంది. రాథోడ్ ఎందుకని అడగడంతో అంకుల్‌ మొన్న నాకు చాక్లెట్స్‌ తీసుకోమని డబ్బులు ఇచ్చారు కదా? ఆ డబ్బుల్లో కొంత మనీ మిగిలింది. ఆ మిగిలిన మనీని ఆ అంకుల్‌ కే మనియార్డర్‌ చేద్దామని అంటుంది అంజలి. అంజు మాటలకు రాథోడ్‌ షాక్‌ అవుతాడు. అలా ఇచ్చిన డబ్బులు మళ్లీ రిటర్న్‌ పంపించకూడదు అని రాథోడ్‌ చెప్తుంటే నీకు చాలా తెలివి ఉంది రాథోడ్‌ అంటూ రాథోడ్‌ను పొగుడుతుంది అంజలి.

రణవీర్‌ను ఇంటికి పిలిచిన అంజలి

Advertisement

అంజలి మాటలకు రాథోడ్‌ పొంగిపోతూ.. రణవీర్‌ కు కాల్ చేసి అంజలికి ఇస్తాడు. ఫోన్‌లో అంజలి వాయిస్‌ విన్న రణవీర్‌ తన్మయత్వంతో ఎమోషనల్‌ అవుతాడు. అంజలి తిన్నారా? అంకుల్‌ అని అడగ్గానే లేదని మీరు తిన్నారా? పాప అని అడుగుతాడు రణవీర్‌. మేము ఎప్పుడో తిన్నామని మీరు లేటుగా తింటే మీ హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయని అంజలి చెప్పగానే రణవీర్‌ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తర్వాత అంజలి వినయక చవితికి తమ ఇంటికి రమ్మని పిలుస్తుంది.

అంజలి కోసం మందు మానేసిన రణవీర్‌

Advertisement

సరేనని రణవీర్‌ ఫోన్‌ కట్‌ చేసి తన ముందు ఉన్న మందు బాటల్స్‌ అన్ని తీసేయమని లాయరుకు చెప్తాడు. దీంతో షాక్‌ అయిన లాయర్‌ నువ్వు ఒక్కసారి మందు తాగడం మొదలు పెడితే బాటిల్‌ అయిపోయేవరకు తాగి అక్కడే పడుకుంటావు. ఇవాళ ఏంటి మొదలుపెట్టక ముందే తీసేయ్‌ అంటున్నావు అని అడగ్గానే రణవీర్‌ నా కూతురు గురించి తెలియక నా బాధని ఆ నషాలో కలిపేసే వాణ్ని. కానీ అంజలితో మాట్లాడాక మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిద్ర పోవడానికి నాకు ఏ మందు అవసరం లేదనిపిస్తుంది అని చెప్తాడు. దీంతో రణవీర్‌ ఇన్ని కోట్ల ఆస్తులు నీకు ఇవ్వలేని ప్రశాంతత ఒక చిన్న పాప వల్ల వచ్చిందంటే ఆ పాపని ఆ కాళికా మాతే నీ జీవితంలోకి పంపించిందేమో.. అంటాడు లాయర్. సరే సరే అంటూ రణవీర్‌ నేను వెళ్లి భోజనం చేసి పడుకుంటాను. అని రణవీర్‌ వెళ్లిపోతాడు.

Also Read: ‘త్రినయని’ సీరియల్‌: గాయత్రిని చంపేస్తానన్న గజగండ – నయనిని అవమానించిన సుమన

అమర్‌ ఇంట్లో బాంబు పేలుస్తానన్న అరవింద్‌

మరోవైపు అమర్‌ ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్లకు ఏదో చెప్తుంటాడు. ఇంతలో అరవింద్ అక్కడికి కొద్దిదూరంలో కారులో ఆగి అమర్‌ ఇంటిపై రెక్కీ నిర్వహిస్తుంటాడు. బాంబు పెట్టి అమర్‌ను చంపాలనుకుంటాడు. రేపు వినాయక చవితి పూజలో వాళ్లింట్లో నేను పెట్టే బాంబు పేలుతుంది అని తన అనుచరులకు చెప్తాడు. అనుచరులు వద్దన్నా అమర్‌ ను చూస్తుంటే మాకు భయంగా ఉంది అంటారు. అక్కడ సెక్యూరిటీ చూశావా? ఎంత ఉందో వాళ్లకు మనం దొరికామంటే మన సంగతి అంతే ఇక అంటూ భయపడుతుంటారు. దీంతో మనం కనబడకుండా వాళ్లింట్లో బాంబు పేలే ప్లాన్‌ చేశాను అంటాడు అరవింద్‌.

పిల్లలకు ఇష్టమైన వంటకాలు చేస్తానన్న మిస్సమ్మ

తర్వాతి రోజు అందరూ ఎర్లీగా లేచి గణపతి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. పిల్లలు రెడీ అయి డల్‌ గా కూర్చుని ఉంటారు. ఈ సారి అమ్మ లేదని, అమ్మలా పూజ చేసే వారే లేరని బాధపడుతుంటారు. ఇంతలో మిస్సమ్మ వచ్చి మీరేం బాధపడకండి.. మీకందరికీ ఏంఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను అంటుంది. దీంతో పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో స్వీటు అడుగుతాడు. అంజలి మాత్రం తనకు బిర్యాని కావాలని అడుగుతంది. దీంతో మిస్సమ్మ షాక్‌ అవుతుంది. వెంటనే ఇవాళ నీకు బిర్యాని చేస్తాను కానీ వెజిటేబుల్‌ బిర్యాని అని చెప్పడంతో పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు.

అమర్‌, మిస్సమ్మల మధ్య రొమాంటిక్ రిలేషన్‌

తర్వాత మిస్సమ్మ రూంలో రెడీ అవుతుంది. అమర్‌ చూస్తూ ఉంటాడు. మిస్సమ్మ నెక్లెస్‌ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అమర్‌ చూస్తుంటాడు. దీంతో మిస్సమ్మ అలా గుడ్లు అప్పగించి చూడకపోతే వచ్చి హెల్ఫ్‌ చేయోచ్చు కదా? అని మనసులో అనుకుంటుంది. అమర్‌ దగ్గరకు వచ్చి అదే పని నువ్వు చేయకుండా అడగొచ్చు కదా? అంటాడు దీంతో మిస్సమ్మ షాక్‌ అవుతుంది. నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసిపోయింది. ఎలా అండి.. ఓ టెలీపతినా..? అంటుంది. తర్వాత అమర్‌ అటు తిరుగు అంటూ మిస్సమ్మకు నెక్లెస్‌ పెట్టడానికి ఆమె మెడను టచ్‌ చేస్తాడు. దీంతో మిస్సమ్మ రొమాంటిక్‌గా ఫీలవుతుంది. అమర్‌ కూడా రొమాంటిక్‌ గా ఫీలవుతాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో రొమాంటిక్‌ సాంగ్‌ ప్లే అవుతుంది. ఇంతలో మిస్సమ్మ తేరుకుని పూజకు లేట్‌ అవుతుందని తప్పించుకుని పక్కకు జరగ్గానే అమర్‌ కూడా సరే వెళ్దాం పద అని ఇద్దరు కలసి కిందకు వస్తారు.

రాథోడ్‌ వద్దనా మార్కెట్‌ కు వెళ్లిన అమర్‌

కింద శివరాం, నిర్మల పూజకు అంతా సిద్దం అయిందని ఒక్క గణపతి విగ్రహం మాత్రమే ఇంకా రాలేదని చెప్తారు. దీంతో విగ్రహం తీసుకురావడానికి అమర్‌ మార్కెట్‌ కు వెళ్తుంటే రాథోడ్‌ వచ్చి మీరు ఇంట్లోనే ఉండండి సార్‌ వాడు చాలా డేంజర్‌ నేను వెళ్లి విగ్రహం తీసుకోస్తాను అంటాడు. వద్దులే రాథోడ్‌ అంటూ అమర్‌ వెళ్లిపోతాడు.

కలకత్తాకు వెళ్లిన బాబ్జి

మరోవైపు దుర్గను వెతుక్కుంటూ కలకత్తా వెళ్లిన బాబ్జీ అక్కడ ఆశ్రమంలో దుర్గ గురించి ఎంక్వైరీ చేసి షాక్‌ అవుతాడు. తను చెప్పిన డీటెయల్స్‌ అక్కడి రికార్డ్స్‌ లో మ్యాచ్‌ అవ్వలేదని వెంటనే మనోహరికి ఫోన్‌ చేసి చెప్తాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×