Donald Trump is confirmed safe after gunshots were fired near his golf: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ని టార్గెట్ చేస్తూ దుండగులు అవకాశం దొరికినప్పుడల్లా కాల్పులు జరుపుతునే ఉన్నారు. రెండు నెలల క్రితం ట్రంప్ పై జరిగిన కాల్పుల సంఘటన మరువకముందే మరో కాల్పుల సంఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తన సొంత గొల్ఫ్ కోర్ట్ లో గోల్ఫ్ ఆడుతున్నారు ట్రంప్. ఈ గొల్ప్ ప్రాంగణం ఆయన నివాసం ఉంటున్న ఫ్టోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ సమీపంలోనే ఉంది. అయితే ట్రంప్ కు అత్యంత సమీపంలోనే ఈ కాల్పులు జరిగాయి. దీనితో యూఎస్ సీక్రెట్ పోలీస్ సర్వీస్ అప్రమత్తమయింది.
సురక్షిత ప్రాంతానికి
వెంటనే ట్రంప్ ని అక్కడి నుండి పోలీసు సెక్యూరిటీతో సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. కాగా తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి 11.30 నిమిషాలకు జరిగింది అయితే ట్రంప్ కు కేవలం 300 మీటర్ల దూరంలో దుండగుడు ఉన్నాడు. అతని దగ్గర నుంచి ఏకె 47 రైఫిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ట్రంప్ క్షేమంగానే ఉన్నట్లు ఆయన ఆంతరంగిక భద్రతా అధికారులు చెబుతున్నారు. అయితే ట్రంప్ ని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా లేక మరేదైనా కోణంలో జరిగాయా అని విచారిస్తున్నారు.
Also Read: నిమజ్జనం రోజు ఇలా ప్రయాణించండి.. మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు!
న్యూయార్క్ పోస్ట్ వైరల్
ఇందుకు సంబంధించి అక్కడి న్యూయార్క్ పోస్ట్ విభిన్నంగా వార్త రాసుకొచ్చింది. ఈ కాల్పులు ట్రంప్ ని ఉద్దేశించినవి కావు అని స్పష్టం చేసింది. ట్రంప్ గోల్ప్ ఆడుతుండగా బయట ఎవరో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పరస్పరం జరుపుకున్న కాల్పులలో మిస్ ఫైర్ అయి ట్రంప్ సమీపంలో బుల్లెట్ దూసుకొచ్చిందని రాసుకొచ్చింది. ఒక వేళ ట్రంప్ ని అంత దగ్గరగా కాల్చితే ఆయన శరీరానికి ఏం గాయం ఎందుకు కాలేదు అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ న్యూయార్క్ పోస్ట్ రాసిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు మాత్రం ఇదంతా రాజకీయ స్టంట్ అని అంటున్నారు.
సింపతీ కోసమేనా..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనం ఓట్లను సింపతీ సెంటిమెంట్ ద్వారా రాబట్టుకోవాలని ట్రంప్ చూస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సర్వేలలో కమలా హ్యారిస్ గెలుపు తథ్యమని భావించడంతో ట్రంప్ సరికొత్త ఎత్తులకు ప్లాన్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ సభ్యులు మాత్రం ఇదంతా చేయించేది డెమోక్రాటిక్ పార్టీ వారే అంటూ ప్రచారం చేస్తున్నారు.
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) September 15, 2024