BigTV English
Advertisement

Trinayani Serial Today Episode: మారువేషంలో వచ్చిన గజగండ, గంటలమ్మ – గాయత్రి పాప దెబ్బకు హడలిపోయిన గజగండ

Trinayani Serial Today Episode: మారువేషంలో వచ్చిన గజగండ, గంటలమ్మ – గాయత్రి పాప దెబ్బకు హడలిపోయిన గజగండ

Trinayani Serial Today September 16th: తిలొత్తమ్మ వల్లభను తిడుతూ ముందు నువ్వు గాయత్రి పాప గురించి ఆలోచించు అని చెప్తుంది.  తన పేరు మాత్రమే గాయత్రి. కానీ తను ఎప్పటికీ పెద్దమ్మ గాయత్రి దేవి లాగా మారదు. ఆ రాజసం ఆ గంభీరం అసలేన వ్యక్తిత్వాన్ని నువ్వు ఎవరితో పోల్చకు మమ్మీ అంటాడు వల్లభ. నువ్వు కాదు ఎవ్వరూ కూడా నేను చెప్పింది నమ్మరని గజగండ, గటలమ్మకు చెప్పాను. ఇంటికి వచ్చి గాయత్రి పాప సంగతేంటో చూస్తామన్నారు. వాళ్లు వస్తే నయని వాల్లు కాఫీలు, టీలు ఇస్తారనుకున్నావా? మమ్మీ. జుట్టుపట్టి నీవల్లే ఇన్ని అరిష్టాలు అని గంటలమ్మను కొట్టి ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి పంచకమణి ఇస్తేనే నీ పెళ్లాం గంటలమ్మను విడిచిపెడతాం అంటారు. అని వల్లభ చెప్పగానే అంత ఈజీగా వాళ్లు దొరకరు వల్లభ అని తిలోత్తమ్మ చెప్పగానే మీ ఇష్టం మమ్మీ అని వల్లభ వెళ్లిపోతాడు.


మారు వేషంలో వచ్చిన గజగండ, గంటలమ్మ

గజగండ, గంటలమ్మలు మరో వేషం వేసుకుని నయని ఇంటికి వస్తారు. గజగండ ఇదే ఇల్లు అని గంటలమ్మ అని చెప్పగానే స్థానం మారినంత మాత్రానా ప్రాణం పోకుండా ఉంటుందా? మన కొడుకును పొట్టన పెట్టుకున్న ఈ ఇంట్లో ప్రాణం పోయేంత వరకు వదిలేది లేదు. మన పని వెంటనే పూర్తి చేసుకుని వెళ్లిపోవాలని అనుకుంటారు. పైనుంచి అంతా గాయత్రి పాప గమనిస్తుంది.  ముందు నువ్వు వెళ్లు గంటలమ్మ అనగానే గంటలమ్మ లోపలికి సోది చెప్తానమ్మా అంటూ వెళ్తుంది.


సుంకమ్మ, ఎంకన్నగా మారిన గజగండ, గంటలమ్మ

 సోదమ్మ సౌండ్ విని అందరూ బయటకు వస్తారు. సరాసరి లోపలికి వస్తు్నావేంటి ఎవరు మీరు అని అడుగుతారు. సోది చెప్తానమ్మా అటుంది. ఆవిడను బయటకు తోలేయకుండా మాటలు పెట్టారేంటి అని సుమన అనగానే వల్లభ పశువులను తోలినట్టు ఏయ్‌ డర్‌ అంటాడు. నేను పశువును కాదు స్వామి నేను మనిషిని అని వల్లభను చూసి కన్ను కొడుతుంది. దీంతో వల్లభ మమ్మీ ఈమె నన్ను చూసి కన్ను కొడుతుంది. అనగానే తిలోత్తమ్మ ఈవిడ వల్లభను చూసి కన్నుకొడుతుంది అంటే ఈమె గంటలమ్మ అయి ఉండవచ్చు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో గజగండ వస్తాడు. నేను ఎంకన్నను మీ భవిష్యత్తు చెప్తాను అంటాడు. ఇంతలో గంటలమ్మ ఇంట్లో నయని లేదని సుంకమ్మ చెప్తుంది. భర్త బాగుండాలని ఆమె దేవునికి పూజ చేస్తుంది కదా స్వామి అని ఎంకన్న చెప్పగానే అరె వీళ్లు ఎవరో అన్ని తెలిసివాళ్లలా ఉన్నారు. అన్ని నిజంగానే చెప్తున్నారు అని అందరూ షాక్‌ అవుతారు. తిలోత్తమ్మ మాత్రం వచ్చింది గజగండ, గంటలమ్మే అని క్లారిటీగా అనుకుంటుంది.

Also Read: అంజుకు లాకెట్‌ ఇచ్చిన అమర్‌ – ఇంట్లోంచి ఎస్కేప్‌ అయ్యేందుకు మనోహరి ప్లాన్‌

నిజం చెప్పిన సుంకమ్మ, ఎంకన్న

 వల్లభ పంచకమణి గురించి చెప్తుంటే.. విశాల్‌ దాని గురించి మాట్లాడొద్దని చెప్పగానే మణులు వ్యాపారం చేసుకోవడానికే పనికి వస్తాయని ఆరోగ్యం బాగు చేయలేవని ఎంకన్న స్వామి అలియాస్‌ గజగండ చెప్తాడు. దీంతో వల్లభ ఇదంతా కాదు కానీ మా తమ్మికి ఏం జరిగితే చేతికి చలనం లేకుండా పోయిందో చెప్పండి చాలు అప్పుడు నమ్ముతాం. అనగానే చెబుతాం స్వామి అంటూ సుంకమ్మ అయ్య చేతికి పురుగు కుట్టింది అని చెప్తుంది. మీరు అంటున్న మణి చేతులు మారిందే కానీ మీకు చేరలేదు అని ఎంకన్న చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో అవన్నీ సరే కానీ మా విశాల్‌ కు నయం అయ్యే మార్గం ఉందా? అని తిలోత్తమ్మ అడుగుతుంది. దీంతో ఉందని ఆ బాబును కన్నతల్లిని రమ్మనండి చెబుతాం అనగానే ఆమె రావాలంటే మీరే పైకి పోవాలని చెప్తారు. దీంతో సుంకమ్మ పునర్జన్మ ఎత్తే ఉండాలి కదా స్వామి అని చెప్పగానే విశాల్‌ షాక్‌ అవుతాడు. దీంతో విశాల్‌ అవును మా అమ్మ నిజంగానే పుట్టింది అని చెప్తాడు. ఇంతలో గాయత్రి పాప వస్తుంది. హాసిని కొంప దీసి ఈ పాపే గాయత్రి అత్తయ్య అని నిజం చెప్తారా? ఏంటి అని మనసులో అనుకుంటుంది.  ఇంతలో విశాల్‌ వారికి డబ్బులు ఇచ్చి పంపిచేయండి అని చెప్పగానే మీరు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మీకు చేయి నయం అయితే మాకు అదే సంతోషం అనగానే విక్రాంత్‌ సరే ఏం చేస్తే మా బ్రోకు నయం అవుతుందో చెప్పండి అని అడగ్గానే ఒక దుప్పటి తీసుకురండి అని సుంకమ్మ అలియాస్‌ గంటలమ్మ చెప్పగానే విక్రాంత్‌ దుప్పటి తీసుకొస్తాడు.

  గజగండ, గంటలమ్మను గుర్తు పట్టిన విశాల్‌

 విశాల్‌, గాయత్రి పాపలను తమ ఎదురుగా కూర్చోబెట్టుకుని తమపైన దుప్పటి కప్పించుకుంటారు. లోపలికి వెళ్లిన గాయత్రి భయపడుతుందేమోనని సుమన అనగానే గాయత్రి భయపెడుతుంది కానీ భయపడదు అని హాసిని అంటుంది. గాయత్రి చాలా గడుసున్న పాప అంటాడు విక్రాంత్‌. లోపల దుప్పట్లో ఉన్న గజగండ విబూది తీసి విశాల్‌ మీద వేయగానే విశాల్‌ మత్తుగా స్పృహ కోల్పోతుంటే గాయత్రి పాప విశాల్‌ చేయి పట్టుకుని గజగండ గొంతు పట్టిస్తుంది. దీంతో విశాల్‌ గట్టిగా గజగండను పట్టుకుంటాడు. నాకు మత్తుగా ఉన్నా గాయత్రి పాప నా చేయి పట్టకోగానే నాకు బలం వచ్చింది అంటాడు. ఇంతలో గజగండ, గంటలమ్మ మాయమవుతారు. విశాల్‌ స్పృహ కోల్పోయి ఉంటాడు. విక్రాంత్‌ నీళ్లు తీసుకొచ్చి ముఖంపై కొట్టగానే విశాల్‌ లేచి కూర్చుంటాడు. కోపంగా ఎక్కడున్నారు వాళ్లు, గాయత్రి పాప ఏది అనగానే గాయత్రి పాప ఇక్కడే ఉంది కానీ ఏమైంది అని విక్రాంత్‌ అడగ్గానే వాళ్లేవరో గాయత్రి పాపను ఎత్తుకెళ్లడానికి వచ్చారు. నేను బిగ్గరగా గొంతు పట్టుకునే సరికి మాయమయ్యారు అని విశాల్‌ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Big tv Kissik Talks: రాజు జీవితంలో రాణి లేదు.. బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన రాజు!

Big tv Kissik Talks: డ్యాన్సర్లు అంటే అంత చులకనా… ఎమోషనల్ అయిన రాజు!

Illu Illalu Pillalu Today Episode: సేనకు నర్మద వార్నింగ్.. భాగ్యంకు దిమ్మతిరిగే షాక్.. రామా రాజు ఇంట పెద్ద గొడవ..

Nindu Noorella Saavasam Serial Today November 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ప్లాన్ సక్సెస్ 

Brahmamudi Serial Today November 5th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌

Intinti Ramayanam Today Episode: మీనాక్షి పై శ్రీయ సీరియస్..తల్లి రాకతో అవని హ్యాపీ.. ఫ్రెండ్ ను కలిసిన పల్లవి..

GudiGantalu Today episode: మనోజ్ పై బాలుకు అనుమానం..బాలు, మీనాను దారుణమైన అవమానం.. ప్రభావతికి టెన్షన్..

Tv Serials Heros Remuneration: సీరియల్ హీరోల రెమ్యూనరేషన్.. అందరికంటే ఎక్కువ అతనికే..?

Big Stories

×