Ninnu kori serial today Episode: కిచెన్‌లో ఉన్న దాక్షాయణి దగ్గర మ్యాటర్ డైవర్ట్ చేయడానికి చంద్ర, సామ్రాట్ గురించి అడుగుతుంది. ఆరోజు సామ్రాట్ గారు ఎక్కడికి వెళ్లారు ఏమైనా తెలిసిందా అని అడగ్గానే.. ఆరోజు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నాకు కూడా చెప్పలేదు చంద్ర. వాడు ఆరోజు నా మాట మొదటిసారి వినకుండా వెళ్లాడు అని చెప్పగానే.. ఇంతకీ ఆరోజు సామ్రాట్ ఏ విషయంలో నీ మాట వినలేదమ్మా అని నీలగిరి అడుగుతాడు. ఒకటా రెండా అన్ని విషయాల్లో శత్రువులను పెంచుకుంటన్నావు వద్దు అంటే వినలేదు అంటూ చెప్పగానే.. వాళ్లెవరో ఒక్కరైనా మీకు తెలుసా మేడం అంటూ అడగ్గానే.. నాకు చాలా మంది తెలుసు కానీ వారిలో ఎవరు చేశారో తెలియడం లేదు అయినా ఈ విషయాలు ఎందుకు నీకు సామ్రాట్ హెల్త్ గురించి ఆలోచించు.. డైట్ ప్లాన్ గురించి ఆలోచించు అంటూ చెప్తుంది దాక్షాయణి.
మదన్, శ్రీజ గురించి ఆలోచిస్తుంటే.. శ్రీజ వస్తుంది. మీరు చెప్పినట్టే నా ప్రేమ నిజమా కాదా అని బావ టెస్ట్ చేశాడు. అని చెప్పగానే.. మదన్ షాకింగ్ గా నోటి మాట కోసం ఏదో చెప్తే అదే జరిగిందా..? అయితే ఆ దేవుడు నాకు పవర్ ఇస్తున్నాడేమో అని మనసులో అనుకుని మరి ఈ లవ్ గురు అంటే ఏంటనుకున్నావు అని చెప్పగానే.. అవునండి మీరు చెప్పిందే యాజ్‌టీజ్‌గా జరిగింది అంటూ సామ్రాట్ తనతో మాట్లాడిన విషయాలు మొత్తం మదన్‌కు చెప్తుంది. మదన్ మాత్రం అయ్యో శ్రీజ నీ ప్రేమ విషయంలో క్లారిటీ తీసుకోవడానికి అలా మాట్లాడాడు అని అర్థం అవుతుంది. అంటూ మనసులో అనుకుంటాడు మదన్. అప్పుడే శ్రీజ, మదన్ చేతులు తన చేతుల్లోకి తీసుకుని థాంక్స్ చెప్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన గిరిజ ఆ సీన్ చూసి షాక్ అవుతుంది. ఇదేంటి ఈ పిచ్చిది మదన్‌తో క్లోజ్ గా ఉంటుంది. ఇక్కడేదో తప్పు జరుగుతుంది వెంటనే మా ఆయనకు చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది.
మదన్ రూంలోంచి బయటకు వస్తున్న శ్రీజకు నీలగిరి, గిరిజ ఎదురుగా వెళ్లి ఏంటమ్మా నువ్వు ఆ మదన్‌తో క్లోజ్ గా ఉంటున్నావట.. అని నిలదీస్తే.. అదేం లేదు బావను పడేయడానికి నేను మదన్ తో కలిసి ఒక ట్రిక్ ప్లే చేస్తున్నాను అని చెబితే.. గిరిజ కోపంగా నువ్వేం ట్రిక్ ప్లే చేయకు ఆ మదన్ నిన్ను ట్రాప్ లో పడేస్తున్నట్టు ఉంది అంటూ గిరిజ తిడుతుంది. దీంతో జరిగిన విషయం మొత్తం శ్రీజ చెప్తుంది. మదన్ తన ప్రేమకు హెల్ప్ చేస్తున్నాడని చెప్తుంది. ఏమోనే మీ బావ నీకు దగ్గర అవుతున్నాడంటే ఓకే కానీ ఆ మదన్‌ను నమ్మాలంటేనే భయంగా ఉంది అంటుంది గిరిజ.
తర్వాత నీలగిరికి ఎవరో ఫోన్ చేసి ఇల్లీగల్ బిజినెస్ గురించి చెప్తారు. ఇప్పుడు సామ్రాట్ కు ఏమీ గుర్తు లేదు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడే కరెక్ట్ టైం సామ్రాట్ సంతకం కావాలంటే నేను చేసి పంపిస్తాను.. అని చెప్తాడు. సామ్రాట్‌కు గుర్తుకు వస్తే ఏం చేస్తావని అవతలి వ్యక్తి అడిగితే.. సామ్రాట్‌కు గతం గుర్తుకు వచ్చేలోపే ఆ బిజినెస్ అక్కడి నుంచి సిఫ్ట్ చేసేస్తాను.. అది నా రిస్క్ ఇందులో నా వాటా వన్ టైం సెటిల్ మెంట్ చేయండి అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు. డోర్ చాటు నుంచి చంద్ర అంతా వింటుంది. సామ్రాట్ గారు వద్దన్న బిజినెస్ నీలగిరి గారు చేస్తున్నారు అంటే సామ్రాట్‌కు హాని నీలగిరి నుంచి కూడా ఉండొచ్చని అనుకుంటూ వెళ్లిపోతుంది.
మదన్ దగ్గరకు వెళ్లిన చంద్ర మొత్తం చెప్పేస్తుంది. మదన్ కోపంగా తిడుతూ ఈ విషయం వెంటనే దాక్షాయణి గారికి చెప్పాలి అంటాడు. కానీ సామ్రాట్‌ను చంపే విషయంలో నీలగిరికి ఏమైనా హస్తం ఉందంటారా…? అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో మదన్ కూడా గుడిలో రౌడీలు అటాక్ చేసినప్పుడు నీలగిరి చాటుగా దాక్కుని రౌడీలు వెళ్లిపోయాక వచ్చి ఓవరాక్షన్ చేశారు అంటాడు మదన్. దీంతో విషయంలో చాలా లోతుగా ఆలోచించాలి అంటూ సామ్రాట్ మీద గుడిలో అటాక్ చేయించింది కూడా నీలగిరి అయ్యుండొచ్చు ఇక నీలగిరి మీద ఓ కన్నేసి ఉంచుదాం డౌట్ కన్‌ఫం అయితే దాక్షాయణి గారి దృష్టికి తీసుకెళ్దాం అని నిర్ణయం తీసుకుంటారు.
తర్వాత శ్రీజ కాఫీ తీసుకొచ్చి ఇస్తే.. దాక్షాయణి కేశవ అందరూ షాక్ అవుతారు. శ్రీజ కాఫీ చాలా బాగా పెట్టిందని ఆశ్చర్యపోతారు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే సామ్రాట్ వస్తాడు. వాళ్లను చూసి సామ్రాట్‌కు తల పగిలిపోయినట్టు అవుతుంది. తల పట్టుకుని గట్టిగా అరుస్తాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.