Sadagopen Ramesh On Gill: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies,) మధ్య వన్డే సిరీస్ (West Indies tour of India, 2026) జరుగుతోంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ గిల్ ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు వరుసగా రెండింటిలో గెలిచిన టీమిండియా…. 2-0 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే మొదటి వన్డేలో సెంచరీ చేసిన కెప్టెన్ గిల్… రెండో మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు. దీంతో కెప్టెన్ గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంటే, మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ మాత్రం పరువు తీశారు. మిస్టర్ గిల్ ని డబుల్ సెంచరీలను చెత్తబుట్టలో వేసుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ మైదానాలలో కాదు… దమ్ముంటే విదేశాల్లో కూడా ఆడి చూపించు అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో సదగోపన్ రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ సందర్భంగా కెప్టెన్ గిల్ సెంచరీ తో పాటు డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా వరుసగా విజయాలు నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో మాజీ ఆటగాడు సదగోపన్ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ఫ్లాట్ ట్రాక్స్ ల పైన బ్యాటింగ్ చేయడం మగతనం కాదని పరువు తీశారు. హైవే లాంటి మైదానాలలో ఎవరైనా డబుల్ సెంచరీలు చేస్తారని పేర్కొన్నారు. కానీ విదేశీ గడ్డలపై ఆడి చూపించాలని మండిపడ్డారు. భారత గడ్డపై ఎన్ని డబుల్ సెంచరీలు చేసినా, దండగే అన్నారు. ఆ రికార్డులను చెత్త బుట్టలో వేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇక పేద గిల్ ఇండియాలో కాకుండా విదేశాల్లో ఆడాలని కోరారు సదగోపన్ రమేశ్.
కెప్టెన్ గిల్ కు దమ్ముంటే 2027 వన్డే వరల్డ్ కప్ తీసుకురావాలని సదగోపన్ రమేశ్ సవాల్ విసిరారు. దక్షిణాఫ్రికా గడ్డపై జరగబోయే టోర్నమెంటులో గిల్ డబుల్ సెంచరీలు చేసి జట్టును ముందుండి నడిపించాలని కోరారు. అప్పుడే కెప్టెన్ గిల్ రియల్ ఆటగాడని వ్యాఖ్యానించారు. వన్డే వరల్డ్ కప్ లో గిల్ ఆడ లేకపోతే అతడు డమ్మీ అన్నారు. అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మాత్రం మెచ్చుకున్నారు సదగోపన్ రమేశ్. గాయపడిన పులుల లాగా ఇద్దరూ ఆడుతున్నారని ప్రశంసలు కురిపించారు. ఈ ఇద్దరి వల్లే, టీమిండియాకు వరల్డ్ కప్ వస్తుందన్నారు.