E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని

Ninnu kori Serial Today Episode September 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జగదీశ్వరికి ఫోన్ చేసిన విరాట్ – షాక్ అయిన షాలిని
Advertisement

Ninnu kori serial today Episode: ఇంటికి చంద్ర ఒక్కతే రావడంతో జగదీశ్వరి బాధపడుతుంది. విరాట్‌కు ఏదో చెడు జరుగుతుందని మనసు బాధపడుతుంది. అందుకే వాడిని చూడాలని కంగారుపడుతున్నాను అంటుంది. అందుకు చంద్ర బాధగా ఆయన రూపాన్ని మీరు ఎప్పటికీ చూడలేరు అత్తయ్య అని మనసులో అనుకుంటుంది. క్రాంతి కూడా మాయ దొరక్కపోయినా పర్వాలేదు అమ్మకోసం నేను వేరే దారి వెతుకుతాను మీరు వెళ్లి అన్నయ్యను తీసుకురండి అని చెప్పి వెళ్లిపోతాడు. జగదీశ్వరిని వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తుంది చంద్ర. సరే అంటూ రూంలోకి వెళ్లిపోతుంది జగదీశ్వరి.

చంద్ర ఒంటరిగా రూంలో కూర్చుని ఏడుస్తుంది. విరాట్‌తో తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. విరాట్‌ ఫోటో చూస్తూ.. ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మదన్‌ ఫోన్‌ చేస్తాడు. విరాట్‌ కోసం ప్లాస్టిక్‌ సర్జరీ చేయడానికి డాక్టర్‌ ఒప్పుకున్నాడని చెప్తాడు. డబ్బులు అరైంజ్‌ చేసుకుంటే వెంటనే సర్జరీ చేస్తామన్నారు అని చెప్తాడు. కానీ అంత డబ్బు నేను అరైంజ్‌ చేయలేను అని చెప్పగానే.. ఎంత అవుతుందో మీరు కనుక్కోండి నేను డబ్బులు తీసుకుని వస్తాను అంటూ చెప్పగానే.. మదన్‌ ఓకే అండి అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. చంద్ర మాత్రం విరాట్‌ ఫోటో చూస్తూ ఇక నీ ఈ రూపం ఎప్పటికీ చూడలేమా బావ అంటూ బాధపడుతుంది.

Advertisement

జగదీశ్వరి హాల్లోకి వచ్చి విరాట్‌ గురించి బాధపడుతుంది. ఎన్ని సార్లు కాల్‌ చేసినా ఫోన్‌ కలవడం లేదని ఎక్కడున్నాడో తెలియడం లేదని కంగారుపడుతుంది. అప్పుడే చంద్ర వస్తుంది. చంద్రను విరాట్‌ ఫోన్‌ చేశాడా అని అడుగుతుంది. చేయలేదని కానీ మీరు కంగారుపడకండి బావకు ఏమీ కాదు త్వరగానే వచ్చేస్తాడు అంటూ చంద్ర చెప్పగానే లేదు ఎక్కడో ఏదో తేడా జరిగింది. ఎప్పుడూ చెప్పకుండా ఇంతసేపు బయట ఉండలేదు. ఆ మాయను నమ్మడానికి వీలులేదు. అది ఏ హానో తలపెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఏవండి మనం వెంటనే వెళ్లి పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దాం పదండి అంటుంది. రఘురాం కూడా నువ్వు చెప్పింది కరెక్టే జగదీశ్వరి వెంటనే వెళ్లి మనం కంప్లైంట్‌ ఇద్దాం పదండి అంటూ వెళ్లబోతుంటే.. జగదీశ్వరికి విరాట్‌ నెంబర్‌ నుంచి ఫోన్‌ వస్తుంది.

జగదీశ్వరి షాక్‌ అవుతుంది. విరాట్‌ నెంబర్‌ నుంచి కాల్ వస్తుంది అని చెప్పగానే.. చంద్ర, షాలిని షాక్‌ అవుతారు. హాస్పిటల్‌ నుంచి మదన్‌ ఫోన్‌ చేసి విరాట్‌ గొంతుతో మాట్లాడతాడు. అంతా విన్న షాలిని విరాట్‌ బావ ఫోన్‌ మాట్లాడటం ఏంటి..? ఆ రౌడీ వెధవ నన్ను మస్కా కొట్టి డబ్బు తీసుకున్నాడా..? అని మనసులో అనుకుంటుంది. జగదీశ్వరి ఫోన్‌ మాట్లాడుతూ చంద్రతో మాట్లాడు అని చెప్పి ఫోన్‌ ఇవ్వగానే.. మదన్‌ తానే మాట్లాడుతున్నాను చెప్తాడు. చంద్ర తాను విరాట్‌తో మాట్లాడినట్టే నటిస్తుంది. యాక్సిడెంట్‌ అయిన విరాట్‌ బావ అంత బాగా ఎలా ఫోన్‌ మాట్లాడతారు. ఒకవేళ యాక్సిడెంట్ అయిన విరాట్‌ బావను ఏ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారో తెలుసుకోవాలి. అనుకుంటూ యాక్సిడెంట్‌ జరిగిన ప్లేస్‌కు వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది. హాస్పిటల్‌ గురించి తెలుసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంది షాలిని.

Advertisement

చంద్ర డబ్బులు తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంది. డాక్టర్‌ను కలిసి సర్జరీకి రెడీ చేశారా అని అడగ్గానే.. డాక్టర్‌ సర్జరీకి అంతా రెడీగా ఉందని సర్జన్‌ కూడా ఆన్‌ ది వే లో వస్తు్న్నారని చెప్తాడు. అదే టైంలో హాస్పిటల్‌ రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లిన షాలిని విరాట్‌ గురించి ఎంక్వైరీ చేస్తుంది. రిసెప్షన్‌ లో విరాట్‌ అనే పేరుతో ఎవ్వరూ లేరని చెప్తారు. షాలిని ఆలోచిస్తుంది. అప్పుడే డాక్టర్‌ చంద్రతో ఈ సర్జరీ చాలా సీక్రెట్‌గా చేస్తున్నామని ఎక్కడా రికార్డుల్లో కూడా  పేరు ఉండదని చెప్తాడు. రికార్డుల్లో విరాట్‌ పేరు రాయించాను అని చెప్తాడు. మదన్‌ను ఒక ఇంజక్షన్‌ తీసుకురమ్మని చెప్తాడు డాక్టర్‌ అలాగేనంటూ మదన్‌ వెళ్లి ఇంజక్షన్‌ తీసుకొస్తుంటే.. షాలిని వెనక నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అడ్డంగా దొరికిన పల్లవి.. చివరిలో ట్విస్ట్..

Thursday Movies in Tv : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

ఆటో రాంప్రసాద్ కు ఓటు వేయద్దు.. ఫాన్స్ కు రిక్వెస్ట్ అంత పగేంటి ఉప్పల్ బాలు!

యాంకర్ గా తొక్కేయడంతోనే ఉదయభాను నిర్మాత అయ్యారా?

యూట్యూబర్ నందన కేసులో బాధితుడు చెప్పిన నిజాలు!

సామాన్యుడిపై సెలబ్రిటీస్ ప్రతాపం.. కప్పు కొట్టేస్తాడని భయమా?

నందనను బిగ్ బాస్ లోకి తీసుకుంటే మర్యాద ఉండదు .. నాగార్జునకు బిగ్ వార్నింగ్!

Big Stories

Advertisement
×