E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  
Advertisement

Ninnu kori serial today Episode: జగదీశ్వరి ట్రీట్‌మెంట్ కు మాయ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరా మ్యాచ్‌ అవుతుందని డాక్టర్‌ చెప్పడంతో రఘురాం, జగదీశ్వరి హ్యాపీగా ఫీలవుతారు. కానీ విరాట్‌ మాత్రం అనుమానంగా చూస్తుంటాడు. అసలు 90 శాతం మ్యాచ్‌ కావడం ఏంటో అర్థం కావడం లేదు ఇందులో ఏదో తేడా ఉంది నాకు చంద్రకు పుట్టే బిడ్డ మ్యాచ్‌ కావాలంటేనే 50 శాతం అవుతుంది కానీ మాయకు కడుపులో బిడ్డ 90 శాతం మ్యాచ్‌ కావడం ఏంటని అనుమానపడుతూ రఘురామ్‌, జగదీశ్వరిలను ఇంటికి వెళ్లమని చెప్పి విరాట్‌ ఐవీఎఫ్‌ సెంటర్‌కు వెళ్తాడు.

చంద్రకు నిజం తెలిసినా మదన్ ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిర్ణయించుకుంది అని ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది మందర. అప్పుడే కామాక్షి, శృతి వెళ్లి ఏంటి ఆలోచిస్తున్నావు చెమటలు పడుతున్నాయి ఓ శాంపిల్స్‌ మిస్‌ మ్యాచ్‌ అయితే ఈ ఇంట్లో సెటిల్‌ అయిపోవాలన్న ఆశలు అడియాలు అవుతున్నందుకా..? అంటూ అడుగుతారు. శాంపిల్స్‌ మ్యాచ్‌ అయ్యే అవకాశం లేదు కాబట్టి మాయ వచ్చే లోపు అన్ని సర్దుకుని రెడీగా ఉండు అంటూ మందరకు చెప్తారు. మీరెంత ఎగిరిపడినా మేము ఈ ఇంట్లోంచి వెళ్లే ప్రసక్తే లేదు అంటుంది మందర. అప్పుడే ఇంటికి వస్తారు రఘురాం, జగదీశ్వరి, మాయ. అందరికీ సంతోషంగా జగదీశ్వరి ప్రాణాలకు ఎటువంటి ముప్పు రాదని.. 90 శాతం మ్యాచ్‌ అవుతుందని చెప్తాడు రఘురాం.

Advertisement

అందుకు అందరూ షాక్‌ అవుతారు. కామాక్షి, శృతి, షాలిని అనుమానిస్తారు. మాయ కడుపులో బిడ్డ మ్యాచ్‌ కావడం ఏంటని మనసులోనే అనుకుంటారు. చంద్ర మాత్రం దేవుడు నిజంగానే మనల్ని కరుణించాడు అత్తయ్య మీరు బతకబోతున్నారు మ ఆవేదన తీరబోతుంది అంటూ హ్యాపీగా ఫీలవుతుంది అంటూ మాట్లాడుతుంటే.. అప్పుడే మందర చెప్పానా నా కూతురు వల్లే మీ ప్రాణాలు నిలబడతాయని.. ఇప్పుడు ఏమంటారు అంటూ గొప్పలు మాట్లాడుతుంటే.. షాలిని మాత్రం చంద్ర చేతిలో నీకు ఉంది మందర. తనకు అన్ని తెలిసినా మౌనంగా ఉందంటే తను ఏదో చేయబోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇప్పటికైనా మాయను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోమని మందర చెప్పగానే.. జగదీశ్వరి కోపంగా నా ప్రాణాలు కాపాడినంత మాత్రాన మాయను నేను కోడలిగా ఒప్పుకోను.. అసలు మీరు నా కళ్ల ముందు ఉండటం కూడా నాకు ఇష్టం లేదు.. ఆ దేవుడు ఉంటే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం ఇస్తాడు అంటుంది .

ఐవీఎఫ్‌ సెంటర్‌కు వెళ్లిన విరాజ్‌ కోపంగా డాక్టర్‌ సమీరను కలిసి మాయ బిడ్డ విషయంలో నిజం చెప్పమని నిలదీస్తాడు. డాక్టర్‌ తనకేం తెలియదని.. అంతా నిజమేనని చెప్తుంది. విరాజ్‌ కోపంగా మీరు నిజం చెప్పకపోతే మీ గురించి నేను మీడియాకు చెప్తాను.. పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తాను.. ఇంకా సోషల్‌ మీడియాలో మిమ్మల్ని కడిగిపారేస్తాను అంటూ బెదిరిస్తాడు. అప్పుడు డాక్టర్‌ భయంతో విరాట్‌కు నిజం చెప్తుంది. మాయ కడుపులో పెరుగుతున్నది విరాట్‌, చంద్రల బిడ్డేనని మాయ తన కూతురును చంపేస్తానని బెదిరించిందని అందుకు అబద్దం చెప్పానని డాక్టర్‌ సమీర చెప్పడంతో విరాట్‌ షాక్‌ అవుతాడు. అందులోంచి బయటకు వచ్చి సంతోషంగా చంద్ర నీకు తల్లి అయ్యే అదృష్టం ఉంది.. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ.. అని మనసులో అనుకుంటూ సంతోషంగా డాక్టర్‌కు థాంక్స్‌ చెప్పి.. మాయను ఎలాగైనా కంట్రోల్‌ చేసి బిడ్డ పుట్టే వరకు ఏమీ అనకూడదు. ముందు అమ్మకు చంద్రకు నిజం చెప్పాలి అనుకుంటూ వెళ్లిపోతాడు విరాట్‌.

Advertisement

మాయ దగ్గరకు వెళ్లిన షాలిని భయంగా చంద్రక అంతా తెలిసే మనతో నాటకం ఆడుతుందని చెప్తుంది. నువ్వు ఈ విషయాన్ని బయటపెట్టలేవు.. అలాగని చంద్ర ముందు ఓపెన్‌ అవ్వలేవు అంటూ చెప్తుంది షాలిని. విరాట్‌ బావకు ఈ విషయం తెలిస్తే నిన్ను కేవలం బిడ్డను కనే వరకు భరించి బిడ్డను కన్నాక బయటకు గెంటేస్తారు అంటూ షాలిని చెబితే.. ఇప్పుడు నేను నాటకం ఆడాల్సిన అవసరం లేదు షాలిని. ఈ ఇంటి పెద్ద ప్రాణం నా బిడ్డే కాపాడుతుంది. అందుకే అందరి ముందే విరాట్‌ను నా మెడలో తాళి కట్టమని మొడికేస్తాను.. లేదంటే ఆ బిడ్డను కనను అంటూ బెదిరిస్తాను అప్పుడు ఏం చేస్తారో చూస్తాను అంటూ చెప్తుంటే.. అప్పుడే డాక్టర్‌ సమీర ఫోన్‌ చేసి జరిగిన విషయం మొత్తం మాయకు చెప్తుంది. విరాట్‌ నీ మీద కోపంతో బయలుదేరాడు అంటూ చెప్పగానే.. మయా భయపడుతుంది. విరాట్‌కు నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి షాలిని అంటూ అడుగుతుంది మాయ. తన దగ్గర ఒక ఐడియా ఉందని షాలిని చెప్తుంది.

మాయ విషయంలో నువ్వెక్కడ తగ్గొద్దని కామాక్షి, శృతిలు కలిసి జగదీశ్వరికి చెప్తారు. నేను అసలు తగ్గను అంటుంది జగదీశ్వరి. మరోవైపు క్రాంతి, రఘురాం దగ్గరకు వెళ్లి బిడ్డ శాంపిల్‌ మ్యాచ్‌ అయింది కాబట్టి అన్నయ్య ఇక మాయను అసలు పంపించడు.. ఇక అన్నయ్య, వదినలు ఎలా కలుస్తారు నాన్న అని అడుగుతాడు.. రఘురామ్‌ కూడా తాను అదే ఆలోచిస్తున్నానని చెప్తాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Intinti Ramayanam Today Episode: గుండెలు పగిలేలా ఏడ్చిన అక్షయ్.. అయ్యో కన్నీళ్లు తెప్పించే సీన్.. పల్లవి ఫుల్ హ్యాపీ..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

Big Stories

Advertisement
×