Ninnu kori serial today Episode: మాయ కోసం వెతుకుతున్న విరాట్ ఫోన్ కలవడం లేదని తన ఫ్రెండ్‌కు కాల్ చేసి మాయ ఫోన్ ట్రేస్ చేసి లొకేషన్ తనకు షేర్ చేయమని చెప్తాడు. మాయ అవసరం అప్పటి కన్నా ఇప్పుడే తనకు ఎక్కువ ఉందని రిక్వెస్ట్ చేస్తాడు. దీంతో విరాట్ ఫ్రెండ్ సరే అంటాడు. మరోవైపు మదన్, చంద్ర కలిసి మాయ కోసం వెతుకుతుంటారు. విరాట్ కారు మిస్ అయిందని ఎటు వెళ్లారో కనిపించడం లేదని మదన్ చెప్తాడు. అయితే గచ్చిబౌలిలో బస్సులు ఆగే ప్లేస్‌కు వెళ్దామని చంద్ర చెప్తుంది. మదన్ సరే అంటూ అటువైపు కారు మలుపుతాడు.
కొద్దిదూరం వెళ్లాక విరాట్ కారు ఆపి మాయ ఫోటో చూపించి ఎంక్వైరీ చేస్తాడు. ఎవ్వరూ చూడలేదని చెప్తారు. ఇంట్లో షాలిని రౌడీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది. విరాట్ బావను ఇంకా వేయలేదా..? అని మనసులో అనుకుంటుంది. కారులో వెళ్తున్న మదన్ మొత్తానికి నేనే మాయగాన్ని అనుకుంటే నన్నే బురిడి కొట్టించారు అంటే.. మీరు దొంగే కానీ మంచివారు అందుకే మిమ్మల్ని నేను ఏమీ అనలేదు ముందు మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వండి అని చెప్పగానే.. మదన్ నవ్వుకుంటాడు.
విరాట్ కు తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఓరేయ్ మాయ శంషాబాద్ వైపు వెళ్తుంది. నీకు లొకేషన్ పంపించాను అని చెప్తాడు. ఏంటి గచ్చిబౌలి వెళ్తున్నాను అని చెప్పిందట కదా శంషాబాద్ ఏంటి అనగానే.. లొకేషన్ అక్కడే చూపిస్తుంది. నీకు మాయకు పదిహేను కిలోమీటర్ల దూరం ఉందిరా అంటూ చెప్పగాన.. సరే అంటూ విరాట్ వెళ్తుంటాడు. అప్పుడే రౌడీ లారీతో వచ్చి విరాట్ కారును గుద్దేస్తాడు. విరాట్ కారులోంచి బయటకు రోడ్డు పడిపోతాడు. బ్లడ్ కారుతుంది. ఇంట్లో జగదీశ్వరి పూజ చేస్తుంటే దేవుడి ముందు దీపం ఆరిపోతుంది.. జగదీశ్వరి షాక్ అవుతుంది. బయటకు వచ్చి క్రాంతిని పిలిచి తాను పూజ చేస్తుంటే.. దీపం ఆరిపోయింది విరాట్ ఎక్కడున్నాడో కనుక్కోమని చెప్తుంది. క్రాంతి కాల్ చేస్తాడు. విరాట్ లిఫ్ట్ చేయడు.. అదే విషయం చెప్పగానే.. జగదీశ్వరి టెన్షన్ పడుతుంది.
అప్పుడే చంద్ర కూడా విరాట్‌కు కాల్ చేస్తుంది. కష్టంగా లిఫ్ట్ చేస్తాడు విరాట్ కానీ మాట్లాడలేక స్పృహ కోల్పోతాడు. రౌడీ దగ్గరకు వెళ్లి విరాట్ ను ఫోటో తీసి షాలినికి సెండ్ చేస్తాడు. చంద్ర మళ్లీ ఫోన్ చేయగానే.. అక్కడే ఉన్న ఒక వ్యక్తి లిఫ్ట్ చేసి యాక్సిడెంట్ జరిగిందని.. అంబులెన్స్‌కు కాల్ చేశామని వస్తుందని చెప్తాడు. చంద్ర ఏడుస్తూ.. మదన్ గారు వెంటనే హాస్పిటల్‌కు వెళ్దాం పదండి అని చెప్తుంది. మదన్, చంద్ర హాస్పిటల్‌కు వెళ్లే సరికి విరాట్‌కు ట్రీట్‌మెంట్ జరుగుతుంది. తాను చూడాలని అడిగినా డాక్టర్లు చంద్రను లోపలికి వెళ్లనివ్వరు దీంతో అక్కడే చంద్ర కూలబడిపోయి ఏడుస్తుంది. మదన్ ఏడుస్తుంటాడు. తర్వాత డాక్టర్ వచ్చి విరాట్‌కు ప్రమాదం తప్పిందని చెప్తాడు. తాను వెళ్లి చూస్తానని చంద్ర అడిగితే..
తను కోమాలో ఉన్నాడని అతని ఫేస్ డ్యామేజ్ అయిందని ఇంతకు ముందు ఉన్న రూపం ఇక ఉండదు అని చెప్పగానే.. మదన్ అదేంటి డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ లాంటి ఎన్నో టెక్నికల్ సర్జరీలు వచ్చాయి కదా అంటూ అదంతా వేరు ఇప్పుడు అతను కోమాలోంచి వచ్చాక చూడండి అంటూ చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు. చంద్ర ఏడుస్తూ బావను తీసుకొస్తానని అత్తయ్యకు చెప్పి వచ్చాను ఇప్పుడు ఎలా అంటుంది. ఇప్పుడే ఏం చెప్పొద్దండి వాళ్లు తట్టుకోలేరు విరాట్ గారు స్పృహలోకి వచ్చాక చెబుదాం మీరు ముందు కూర్చోండి నేను వాటర్ తీసుకొస్తాను అంటూ మదన్ వెళ్తాడు. అప్పుడే సిస్టర్ వచ్చి ఏవండి మీరు పేషెంట్‌ను చూడాలనుకుంటే ఒకసారి ఐసీయూలోకి వెళ్లి చూడండి అని చెప్తుంది. చంద్ర వెళ్లబోతూ ఆగి నా బావ అలా పడి ఉండటం నేను చూడలేను అంటూ బాధపడతుంది.
ఇంటి దగ్గర టెన్షన్ పడుతున్న జగదీశ్వరి విరాట్‌కు ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవడం లేదని బాధపడుతుంది. రఘురాం ఓదారుస్తుంది. వెనకే వచ్చి అంతా విన్న కామాక్షి, శృతి ఇద్దరూ విరాట్ ఫోన్ కలవడం లేదంటే మాయ, విరాట్ కావాలని ఇద్దరూ జంప్ అయ్యారేమో అని మాట్లాడుకుంటారు. క్రాంతి వచ్చి విని వాళ్లను తిడతాడు. జగదీశ్వరి భయంగా క్రాంతికి విరాట్ ఫోన్ కలవడం లేదని తనకు భయంగా ఉందని చెప్తుంది అంతా విన్న షాలిని బావగారి ఫోన్ కలవడం లేదంటే యాక్సిడెంట్ జరిగిపోయి ఉంటుంది అనుకుంటుంది. అప్పుడే రౌడీ పంపిన ఫోటో చూసి షాలిని హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ఈరోజు నిన్నుకోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం