Jason Gillespie criticism of Aaqib Javed : ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే సిరీస్ కోల్పోయింది పాకిస్తాన్. ఈ క్రమంలో ఏకంగా ఏడుగురు క్రికెటర్లపై వేటు వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇద్దరూ కోచ్ లను కూడా తప్పించింది. దీంతో మూడో టెస్టులో కొత్త ప్లేయర్లు రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఏడుగురు క్రికెటర్లపై వేటు వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తాజాగా జేసన్ గిలెస్పీ ( Jason Gillespie) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పతనానికి ఆకిబ్ జావేదే కారణం అన్నారు. ఆ 7 గురు క్రికెటర్ల జీవితాలతో ఆడుకుంటున్నాడని సీరియస్ అయ్యారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ క్రికెటర్లను తప్పించినట్లు ఆగ్రహించారు జేసన్ గిలెస్పీ. దీంతో జేసన్ గిలెస్పీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ టెస్ట్ జట్టు విఫలమైన విషయాన్ని గుర్తు చేసిన జేసన్ గిలెస్పీ ( Jason Gillespie)…. ఆ జట్టు నుంచి ఏడుగురిని తొలగించడం అన్యాయం అన్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఏడుగురు క్రికెటర్లను తప్పించడం ఏ మాత్రం సమంజసం కాదని ఫైర్ అయ్యారు. అర్ధాంతరంగా ఆ ఏడుగురు క్రికెటర్లను ఎలాంటి సమాచారం లేకుండా తప్పిస్తే.. ఇంటికి వచ్చాక వాళ్ళ కుటుంబ సభ్యులకూ ముఖం ఎలా చూపిస్తారని ఆకిబ్ జావేద్ ను నిలదీశారు. ఆకిబ్ జావేద్ తప్పుడు నిర్ణయం వల్ల ఈ ఏడుగురు క్రికెటర్ల జీవితాలు బలయ్యాయని ఫైర్ అయ్యారు.
పాకిస్తాన్ లో ఈ ఏడుగురు క్రికెటర్లు మళ్ళీ తిరగలేని పరిస్థితి ఉంటుందని… వాళ్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయాలను కూడా జేసన్ గిలెస్పీ తీవ్రంగా తప్పుపట్టారు. ప్యాంట్లు మార్చినంత ఈజీగా రోజుకో నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మార్చుకుంటూ వెళ్తోందని ఫైర్ అయ్యారు. ఆకిబ్ జావేద్ గత రెండు సంవత్సరాలుగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉంటూ ఏం పీకుతున్నాడని ప్రశ్నించారు. జట్టు వైఫల్యాలకు మాత్రం… ప్లేయర్లతో పాటు కోచ్ లను బ్లేమ్ చేయడం అతనికి అలవాటైందని ఫైర్ అయ్యారు. ముందుగా ఆకిబ్ జావేద్ పై వేటు వేయాలని డిమాండ్ చేశారు జేసన్ గిలెస్పీ. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకు బాధ వేస్తోందని ఎమోషనల్ అయ్యారు. గతంలో తాను పనిచేసిన జట్టుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను అనుకోలేదని వెల్లడించారు. దీనికి కారణమైన ఆకిబ్ జావేద్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.