E-Paper
Advertisement

బిగ్ బాస్ లోకి వస్తే.. సీరియల్స్ ఆగిపోతాయి.. నిరుపమ్ పరిటాల కామెంట్స్!

బిగ్ బాస్ లోకి వస్తే.. సీరియల్స్ ఆగిపోతాయి.. నిరుపమ్ పరిటాల కామెంట్స్!
Advertisement

Nirupam:ప్రముఖ బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన విలక్షణమైన నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. హీరోగా అవతరించాలనుకున్నారు. కానీ తండ్రి అడ్డు చెప్పడంతో బుల్లితెరకే పరిమితమయ్యారు. అలా బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూనే సీరియల్స్ నిర్మిస్తూ కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు నిరుపమ్. ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన తన వ్యక్తిగత , వృత్తిపరమైన విషయాలను ఎన్నో పంచుకున్నారు. అందులో భాగంగానే వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లోకి ఈసారి వస్తారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ విషయంపై స్పందించారు. ఈయన చెప్పిన ఈ లాజిక్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ నిరుపమ్ క్రేజ్ ను ఉపయోగించుకుందామని ఆలోచిస్తే.. మొదటికే మోసం వచ్చేలా ఉందే అనే కామెంట్లు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ లోకి డాక్టర్ బాబు..

బిగ్ బాస్ లోకి సీరియల్ సెలబ్రిటీలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రతి సీజన్లో కూడా తెలుగులో సీరియల్స్ లో నటించేవారు. ముఖ్యంగా ముగ్గురు, నలుగురు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది కార్తీకదీపం సీరియల్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకొని.. డాక్టర్ బాబుగా ముద్ర వేయించుకున్న నిరుపమ్ పరిటాల కూడా గతంలోనే బిగ్ బాస్ లోకి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిరుపమ్ మాట్లాడుతూ బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ALSO READ:రూ. 16 కోట్లు హాంఫట్.. హీరో టార్చర్ భరించలేకపోతున్నాం! హీరో పై నిర్మాత అసహనం.

నేను వస్తే సీరియల్స్ ఆగిపోతాయి – నిరుపమ్

నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ..” నన్ను బిగ్ బాస్ లోకి రమ్మని వాళ్లు అడగరు. ఎందుకంటే దాదాపు నా సీరియల్స్ అన్నీ కూడా మాటీవీలోనే నడుస్తున్నాయి. ఒకవేళ నేను బిగ్ బాస్ చేయాలి అంటే ప్రస్తుతం నడుస్తున్న ఆ సీరియల్స్ అన్ని ఆగిపోతాయి. అది ఛానల్ వాళ్లకే కష్టం. అందుకే నన్ను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడగరు .కానీ బిగ్ బాస్ కి నన్ను కూడా అనుకున్నారు అనే విషయం తెలిసింది. అయితే అది నా దాకా వచ్చి ఎవరు నన్ను అడగలేదు. నేనైతే బిగ్ బాస్ ని ఫాలో అవుతాను. ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తానో లేదో మాత్రం తెలియదు”. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల. ఇక నిరుపమ్ పరిటాల నిత్యం బిగ్ బాస్ షోని ఫాలో అవుతారట. అవకాశం వస్తే వెళ్తానో లేదో అని కూడా తెలిపారు. ఒకవేళ అవకాశం వచ్చి వెళ్తే మాత్రం మాటీవీ కే నష్టం తప్పదు అనే కామెంట్స్ మాత్రం స్పష్టం అవుతున్నాయి. ఏది ఏమైనా నిరుపమ్ బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×