E-Paper
Advertisement

రూ. 16 కోట్లు హాంఫట్.. హీరో టార్చర్ భరించలేకపోతున్నాం! హీరో పై నిర్మాత అసహనం.

రూ. 16 కోట్లు హాంఫట్.. హీరో టార్చర్ భరించలేకపోతున్నాం! హీరో పై నిర్మాత అసహనం.

Tollywood Hero:తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక హీరో తన సినిమాతో నిర్మాతలకు నష్టం మిగిల్చడమే కాకుండా తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బెదిరిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే .. ఒకప్పుడు ఆ హీరో తన కామెడీ చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అనూహ్యంగా యూటర్న్ తీసుకొని విభిన్నమైన జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవేవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందించలేదు. ఎందుకంటే సాధారణంగా కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విష్ణు లీలా (పేరు మార్చబడింది).. ఆ తర్వాత రూట్ మార్చి వారం వ్యవధిలోనే రెండు చిత్రాలు చేశారు. అయితే ఈ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు లీలా మూవీకి హేమా అండ్ శాలిని జి సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి యదునాత్ మారుతీరావు దర్శకత్వం వహించారు.

ఓటీటీ మార్కెట్ చూసి ఎగబడ్డ నిర్మాతలు..

వాస్తవానికి విష్ణు లీలాకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా మార్కెట్ లేదు. కానీ ఓటీటీ మార్కెట్ ను బేస్ చేసుకుని ఈయన సినిమాల కోసం నిర్మాతలు భారీగానే పెట్టుబడి పెట్టారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక వచ్చిన నష్టం చూసి నిర్మాతలు లబోదిబో అంటుంటే.. ఈ సమయంలో విష్ణు లీలా విన్యాసాలు చూసి నిర్మాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

నిర్మాత నష్టపోయినా.. తగ్గని హీరో..

అసలు విషయంలోకి వెళ్తే.. విష్ణు లీలా సినిమాను 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇందులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ రూ.8 కోట్లకు డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే హీరోకి రూ.5.2 కోట్లు ఇస్తామని కమిట్ అయ్యారు నిర్మాతలు.. అప్పుడే 4 కోట్లు హీరోకి ఇచ్చేశారు. కానీ మిగతా మనీ కోసం విష్ణు లీలా ప్రెజర్ చేస్తున్నాడు. అటు ప్రొడ్యూసర్లకి 5 కోట్లు నష్టం వచ్చింది. దీంతో హీరోతో రెమ్యూనరేషన్ ని తగ్గించమని నిర్మాతలు ప్రాధేయపడినా.. విష్ణు లీలా మాత్రం ఊరుకోవడం లేదు. కచ్చితంగా తన మనీ తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.మొత్తంగా 16 కోట్ల బడ్జెట్.. పైగా వడ్డీలు కాకుండా.. వాస్తవానికి ఆరు నెలలకే చేయాల్సిన సినిమా ఇది . కానీ రెండు సంవత్సరాల సమయం పట్టింది.

హీరో వల్ల నిర్మాతలకు భారీ నష్టం..

ముఖ్యంగా ఇతని లేజీనెస్ వల్ల వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడుసార్లు మాత్రమే డేట్స్ ఇవ్వడం జరిగింది. మొదట దీనికి వేరే ప్రొడ్యూసర్ ఉండేవారు. కాకపోతే విష్ణు లీలా ఆలస్యం వల్ల వారు తప్పుకోవడంతో మేనేజర్ ప్రోత్బలంతో సుబ్రహ్మణ్యేశ్వర బ్యానర్ రంగంలోకి దిగింది. అయితే ఈ బ్యానర్ వచ్చిన తర్వాత విష్ణు లీలా మరింత ఆలస్యం చేయడం మొదలుపెట్టాడు. అలా ఆరు నెలల్లో తెరపైకి రావాల్సిన ఈ సినిమాకి రెండు సంవత్సరాల సమయం పట్టింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేద్దామని చెప్పినా విష్ణు లీలా హాజరు కాలేదు.. దాంతో ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే నేరుగా సినిమాను విడుదల చేశారు. పైగా ఈ సినిమా డబ్బింగ్ విషయంలో కూడా చెక్ ఇస్తేనే డబ్బింగ్ చెబుతానని విష్ణు లీలా డిమాండ్ చేశాడు.

ఆందోళనలో నిర్మాతలు..

దాంతో డబ్బింగ్ చెప్పిన తర్వాత కూడా చెక్స్ ఇచ్చారు. కాకపోతే తనకు రావాల్సిన మిగతా మొత్తం ఇవ్వాలని ..లేకపోతే అమెజాన్ కి లెటర్ రాసి ఇవ్వాల్సిన డబ్బులను ఆపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇకపోతే సుబ్రహ్మణ్యేశ్వర బ్యానర్ వారు విష్ణు లీలాకి అంత ఇస్తామని కమిట్ అవ్వలేదు. ముందు బ్యానర్ వాళ్ళు కమిట్ అయ్యారు. కానీ వీరు తమ సినిమా కోసం చేసిన నాలుగు కోట్లు ఇచ్చేశారు.. అయినా సరే విష్ణులీలా ఇలా డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×