Psycho Thriller OTT : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ఆసక్తికరంగా ఉంటాయి. వైలెన్స్, ప్రేమ మధ్య జరిగే ఈ కథలను చూసే కొద్ది చూడాలనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఇద్దరమ్మాయిల ప్రేమతో పాటు ఓ మర్డర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ ఇంటెన్స్ టెన్షన్ హైలైట్ గా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..
2024లో వచ్చిన ఈ అమెరికన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు‘లవ్ లైస్ బ్లీడింగ్’(Love Lies Bleeding). రోజ్ గ్లాస్ దర్శకత్వంలో క్రిస్టెన్ స్టీవర్ట్, కేటీ ఓ’బ్రియాన్, ఎడ్ హారిస్, డేవ్ ఫ్రాంకో, జెనా మలోన్ ముఖ్య పాత్రలు పోషించారు.క్రైమ్ మిక్స్‌తో నిండిన ఈ నియో-నాయిర్ థ్రిల్లర్ సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి పాజిటివ్ రివ్యూలు అందుకుంది.థియేటర్స్ లో 2024 మార్చిలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Video లో రెంట్ ఆప్షన్, HBO Max లో సబ్‌స్క్రిప్షన్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1 గంట 44 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.7/10 రేటింగ్ పొందింది.
లూ (క్రిస్టెన్ స్టీవర్ట్) అనే అమ్మాయి న్యూ మెక్సికోలోని ఒక చిన్న టౌన్‌లో జిమ్ మేనేజర్‌గా పని చేస్తుంటుంది. ఆమె ఫాదర్ (ఎడ్ హారిస్) ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్ స్టర్. టౌన్‌ను కూడా కంట్రోల్ చేస్తాడు. లూ లైఫ్ బోరింగ్‌గా సాగుతుంటే, జాకీ (కేటీ ఓ’బ్రియాన్) అనే బాడీబిల్డర్ టౌన్‌లోకి వస్తుంది.లాస్ వేగాస్ కాంపిటీషన్‌కు ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. ఇద్దరూ జిమ్‌లో కలుసుకుని సడన్‌గా ఇంటెన్స్ రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. లూ ఆమెకు స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేస్తుంది. వాళ్ల మధ్య చాలా బోల్డ్‌గా రొమాన్స్ ఉంటుంది. కానీ లూ సిస్టర్ బెత్ హస్బెండ్ డైసీ వల్ల అబ్యూసివ్ కి గురవుతుంటుంది. ఒక రోజు జాకీ రేజ్‌లో డైసీని చంపేస్తుంది.
ఇక్కడి నుంచి క్రైమ్, వయోలెన్స్ స్టార్ట్ అవుతుంది. లూ, జాకీ ఆ బాడీని దాచడానికి ప్లాన్ వేస్తారు. లూ ఫాదర్ హెల్ప్ తీసుకుంటుంది. కానీ లూ ఫాదర్ వాళ్లను మానిప్యులేట్ చేస్తాడు. జాకీ స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఆమెకు సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. భయంకరమైన వయోలెంట్ సీన్స్ ఉంటాయి. ఇక్కడ లూ ఫాదర్ సీక్రెట్స్ కూడా బయటపడతాయి. చివర్లో ఊహించని ట్విస్ట్స్‌తో ఈ మూవీ ముగుస్తుంది. ఆ ట్విస్టులు ఏమిటి ? ఆ మర్డర్ నుంచి వీళ్ళు ఎలా బయట పడతారు ? లూ తండ్రి వీళ్ళకు సహాయం చేస్తాడా ? వీళ్ళ రొమాంటిక్ ప్రేమ చివరిదాకా నిలుస్తుందా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.