Bigg Boss 10 Ramya krishnan: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో తెలుగులో 10వ సీజన్ రన్ అవుతుంటే.. అటు తమిళ్లో కూడా పదవ సీజన్ రన్ అవుతోంది. నాగార్జున (Nagarjuna) తెలుగు సీజన్ 10 లో హోస్ట్గా వ్యవహరిస్తూ అద్భుతమైన వ్యాఖ్యాతగా పేరు దక్కించుకుంటే.. అటు తమిళ్లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తనదైన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే ఆయన కొన్ని అనారోగ్య సమస్యల వల్ల విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఒక వారం పాటు తమిళ్ బిగ్ బాస్ 10 కి హోస్ట్గా వ్యవహరించడానికి వచ్చేసింది రమ్యకృష్ణ (Ramyakrishna).
ఏడవ వారానికి సంబంధించి అతిథి హోస్ట్గా వ్యవహరిస్తున్న రమ్యకృష్ణ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన వీకెండ్ ప్రోమో ని విడుదల చేయడంతో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి అందరూ నోరెళ్ళ పెడుతున్నారు. తాజాగా తమిళ్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా విడుదల చేసిన ప్రోమోలో ఒక మేల్ కంటెస్టెంట్.. ఫిమేల్ కంటెస్టెంట్ ని తక్కువ చేసి మాట్లాడడంతో అందుకు సంబంధించిన విజువల్స్ ను బయటపెట్టి మరీ.. ఆ మేల్ కంటెస్టెంట్ పై విరుచుకుపడింది రమ్యకృష్ణ . ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారడంతో రమ్యకృష్ణ లో నీలాంబరి మోడ్ ఆన్ అయ్యింది. ఇలాంటి హోస్టు మాకెందుకు లేరు.. పర్ఫెక్ట్ హోస్ట్ అంటూ తెలుగు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే బిగ్ బాస్ పర్ఫెక్ట్ హోస్ట్ గా ఆడియన్స్ చేత మరింత పేరు సొంతం చేసుకుంటోంది రమ్యకృష్ణ.
ఇకపోతే రమ్యకృష్ణ బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరించడం ఇదేం తొలిసారి కాదు. గతంలో 2021లో కమలహాసన్ (Kamala Hassan) హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 5 లో కూడా ఈమె ఒక వారం పాటు హోస్ట్ గా వ్యవహరించింది. అప్పుడు కమలహాసన్ కోవిడ్ 19 కారణంగా హాస్పిటల్ పాలవడంతో ఆయన చికిత్స తీసుకుంటున్న సమయంలో ఒక వారం రోజులపాటు ఈమె హోస్ట్ గా వ్యవహరించింది
ఇకపోతే తెలుగు అభిమానులు కోరుకుంటున్నట్లు ఈమె గతంలో తెలుగు బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది 2019లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి ఒక వారం పాటు అతిధి హోస్ట్గా వ్యవహరించింది రమ్యకృష్ణ మొత్తానికైతే పోస్ట్ లకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు లేదా ఇతర కారణాలవల్ల వాళ్ళు షోకి బ్రేక్ ఇస్తున్నప్పుడు రమ్యకృష్ణ అతిథిగా పనిచేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు తమిళ్ సీజన్ 10 లో వారం పాటు అతిథి హోస్ట్ గా వ్యవహరించడానికి వచ్చిన రమ్యకృష్ణ తనదైన పెర్ఫార్మన్స్ తో కంటెస్టెంట్స్ అందరినీ దారిలో పెడుతున్న తీరు ఆమెపై ప్రశంసలు కురిపించేలా చేస్తోంది.
also read: దక్షి ఎలిమినేటెడ్.. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఈమె ఎంత సంపాదించిందంటే?
ఇకపోతే రమ్యకృష్ణ ఒక వారం రోజులపాటు అతిథిగా వ్యవహరించబోతున్న నేపథ్యంలో రోజుకి రూ.10 లక్షల చొప్పున ఈమెకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే అటు హీరోయిన్గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హోస్ట్ గా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రమ్యకృష్ణ.