E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు ‘ చక్రీ ఇంత మోసం చేశాడా..? ఫ్యాన్స్ హర్ట్..

Podarillu Chakri : ‘పొదరిల్లు ‘ చక్రీ ఇంత మోసం చేశాడా..? ఫ్యాన్స్ హర్ట్..
Advertisement

Podarillu Chakri : స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చివరి నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ పొందుతూ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. కార్తీకదీపం హీరో డాక్టర్ బాబు ఈ సీరియల్ ని నిర్మించిన విషయం తెలిసిందే. నలుగురు మగాళ్లు ఉన్న ఇంట్లోకి ఒక ఆడపిల్ల వెళితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఈ సీరియల్ స్టోరీ.. ఆ ఇంట్లోనే మగాళ్ళ మధ్య ఒంటరి ఆడపిల్ల ఎదుర్కొనే పరిస్థితులు. తన ఆశయాలను నెరవేర్చుకునేలా చేస్తాయా? లేదా అన్న స్టోరీ తో ఈ సీరియల్ వచ్చింది.. ఇందులో హీరోగా చక్రి నటించాడు. ఇతని అసలు పేరు దీపక్ కుమార్. తాజాగా దీపక్ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. వాటిని చూసిన ఫ్యాన్సు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..

దీపక్ కుమార్ వేకేషన్ పిక్స్..

పొదరిల్లు హీరో చక్రి కి ఆల్రెడీ పెళ్లయింది అన్న విషయం తెలిసిందే.. ఈయన ఒక తమిళ్ నటుడు అక్కడ పలు సీరియల్స్లలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. దీపక్ కు తెలుగులో మొదటి సీరియల్ పొదరిల్లు. అయినా కూడా తను నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించాడు. ఈ హీరోకి పెళ్లయింది. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు. చక్రి గురించి గూగుల్ లో వెతికిన ఫ్యాన్స్ కి ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. తన భార్య కూడా ఒక సీరియల్ నటినే. సీరియల్స్ తో బిజీగా ఉన్నా యాక్టర్స్ పెద్దగా ఫ్యామిలీతో గడపడానికి టైం సరిపోదు అని అందరికీ తెలిసిందే. కానీ చక్రి మాత్రం తన ఫ్యామిలీతో టైం దొరికినప్పుడల్లా వెకేషన్ కి వెళ్తూ ఆ పిక్స్ ని షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ ని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో.. చక్రి మోసం చేశాడు సీరియల్ కి డుమ్మా కొట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై హీరో దీపక్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: విల్లాలో ప్రభావతి ఓవరాక్షన్.. మనోజ్ పరువు తీసిన బాలు.. ఇదేం పేరురా నాయనా..

చక్రీకి మరో అవకాశం..

తెలుగు బుల్లితెరపై తెలుగు వాళ్ళ కన్నా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోలకు హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరోకి కూడా అలానే డిమాండ్ పెరిగింది. మొదటి సీరియల్ తోనే ఇతను మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఇప్పుడు మరో సీరియల్ లో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ సీరియల్లో అతను రాబోతున్నాడు? అందులో కూడా హీరోగానే చేస్తున్నాడా? లేదా సైడ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడా అన్నది త్వరలోనే తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కూడా దీపక్ కుమార్ కి మొదటి సీరియల్ తోనే మంచి డిమాండ్ ఉండటం మామూలు విషయం కాదు.. ఇకముందు తెలుగులో అతనికి ఎలాంటి సీరియల్స్ వస్తాయో చూడాలి..

Advertisement

Related News

బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?

ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!

Illu illaalu Pillalu : సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త విలన్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..

Big Stories

Advertisement
×