Bigg Boss 9 Telugu : హౌస్ మేట్స్ అందరూ తనను కరివేపాకులా తీసి పారేస్తున్న ప్రతిసారీ తానే గేమ్ ఛేంజర్ అని నిరూపిస్తోంది సంజన. డే 94 ఎపిసోడ్లో కూడా ఆవిడే హైలెట్ గా నిలిచింది. కళ్యాణ్, డెమోన్ ఆట తీరును ఎండగట్టింది.
“పట్టుకో పట్టుకో” టాస్క్ లో కళ్యాణ్, సంజన సంచాలకులు. ఇందులో తనూజా గెలిచింది. “సుమన్ కు బాల్ వేయలేదు నువ్వు. ఆయనకు హైట్ మైనస్ కదా ఒక్క బాల్ వేస్తే ఏం పోయేది? నిన్న కూడా బాల్ ఆటలో ఆమెను ఒక్కదాన్నే బాల్ క్లియర్ చేసుకోవడానికి అలో చేశాడు. మిగతా వాళ్ళను మాత్రం అలా చేయనివ్వలేదు. ఇక నెక్స్ట్ టాస్క్ లో తనొచ్చి నా బండి తాకింది. నా ఆట పోయింది అందుకే నేను ఈ టాస్క్ లో ఫెయిర్ గా ఉండాలని సెకండ్, ఫోర్త్ వేస్తానని చెప్పాను” అంటూ ఒక్కొక్కటిగా ఇమ్యూనిటీ టాస్క్ లలో కళ్యాణ్ ఆటతీరును సంజన బయట పెట్టింది. “సుమన్ అన్నవి రెండు నేను తీసేసుకున్నా” అని భరణి చెప్పినా సంజన ఆగలేదు. దీంతో తనూజ రంగంలోకి దిగి “నేను అడిగాను అని ఒకే ఒక్క బాల్ ను నాకు లాస్ట్ రౌండ్ లో ఎక్కువ వేశాడు. నాకు బాల్స్ ఎక్కువ రాలేదు. మిగతా వాళ్ళ బాల్స్ పక్కకు పడిపోయాయి. నేను బ్యాలెన్స్ చేయడం వల్ల నా దగ్గర ఎక్కువగా ఉన్నాయి” అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది.
టాస్క్ పూర్తయ్యాక “ఈ వీక్ ను తన ఆట తీరుతో కళ్యాణ్ పూర్తిగా పాడు చేసుకుంటున్నాడు. అతన్ని కరెక్ట్ చేయకండి” అని భరణికి సంజన సలహా ఇచ్చింది. “అదేంటో ఆమె చెప్పినట్టల్లా ఆడుతున్నాడు. రిలేషన్ ను తప్పు పట్టను. కానీ తనూజా ఓవర్ కమాండింగ్ చేస్తున్నట్టు అన్పిస్తోంది” అంటూ ఊహించని షాకింగ్ కామెంట్స్ చేశాడు భరణి.
ఈసారి నెక్స్ట్ టాస్క్ లో ఇద్దరు సభ్యులను తీసేయాలి అనడంతో రచ్చ రచ్చ జరిగింది. డెమోన్ హయ్యెస్ట్ లో ఒకరు, లీస్ట్ లో ఉన్న ఒకరిని తీయాలి అని చెప్పడమే ఈ గొడవకు ఆజ్యం పోసింది. “ప్రతిసారీ టార్గెట్ చేయడానికి నేనే కన్పిస్తున్నానా మీకు ? ఇంకెన్నిసార్లు చంపుతారు నన్ను ? హ్యుమానిటీ లేదా? మీరు కష్టపడితే నేను దానికి పదింతలు కష్టపడ్డాను” అంటూ ఫైర్ అయ్యింది సంజన. ఇక్కడితో గొడవ అయిపోలేదు. డెమోన్ తనూజ దగ్గర ఆ టాస్క్ లో సంజన ఒక్కరే ఆడలేదు అనడంతో మళ్ళీ సంజన ఉగ్రరూపం దాల్చింది.
“సెల్ఫిష్ గా ఆలోచించడానికి కూడా ఒక లిమిట్ ఉంటది. అసలు నాపేరు తీయొద్దు నువ్వు. మీ కడుపే నిండాలా?” అంటూ ఫైర్ అయ్యింది. సంజనకు సమాధానం చెబుతున్న తరుణంలో “నేను ఇమ్మూ అన్నానే నీకు సపోర్ట్ చేశాము. మీకు ఎవరు సపోర్ట్ చేయలేదో వాళ్ళతోనే కూర్చుని, అర్థం చేసుకోవట్లేదు మీరు” అన్నాడు. అంతే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు “ఎవరు సపోర్ట్ చేయలేదు” అంటూ భరణి ఒక్కసారిగా లేచాడు. ఇక ఇందులో తప్పేవరిది అన్న విషయం పక్కన పెడితే… ఆమె డిఫెండ్ చేసుకుని ఆడియన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతోంది.
Read Also : తనూజ – కళ్యాణ్ ల పరువు తీసిన భరణి… ఇమ్మూ – డెమోన్ బలి… పాపం సుమన్